Akhnoor Encounter: దీపావళి వేళ పాకిస్తాన్‌ మరో భారీ కుట్ర.. 60 మంది ఉగ్రవాదులు పాక్‌ సరిహద్దుల నుంచి భారత్‌ లోకి చొరబడేందుకు సిద్ధం

జమ్ముకశ్మీర్‌లో ఏం జరుగుతోంది ? సరిహద్దుల్లో దీపావళి వేళ పాకిస్తాన్‌ మరో భారీ కుట్రకు తెరతీసిందా ? జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇదే నిజమన్పిస్తోంది. అఖ్నూర్‌ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌ దీనికి అద్దం పడుతోంది. విడతలవారిగా టెర్రరిస్టులు భారత్‌ లోకి చొరబడేందుకు సిద్దంగా ఉన్నారు. దాదాపు 60 మంది ఉగ్రవాదులు పాక్‌ సరిహద్దుల నుంచి భారత్‌ లోకి చొరబడేందుకు సిద్దంగా ఉన్నారు.

Akhnoor Encounter: దీపావళి వేళ పాకిస్తాన్‌ మరో భారీ కుట్ర.. 60 మంది ఉగ్రవాదులు పాక్‌ సరిహద్దుల నుంచి భారత్‌ లోకి చొరబడేందుకు సిద్ధం
PoliceImage Credit source: PTI
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2024 | 7:57 AM

దీపావళి వేళ జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నమయ్యింది. సరిహద్దులో తిష్టవేసిన 60 మంది ముష్కరుల చొరబాటును సైన్యం తిప్పికొట్టింది. అఖ్నూర్‌ సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అమెరికాలో తయారైన రైఫిళ్లతో పాటు అధునాతన ఆయుధాలను ఆర్మీ సీజ్‌ చేసింది. అఖ్నూర్‌ సెక్టార్‌లో రెండు రోజుల పాటు భారీ ఎన్‌కౌంటర్‌ కొనసాగింది. ముగ్గురు ఉగ్రవాదులను కడతేర్చింది సైన్యం.. వాస్తవానికి ఈ ఆపరేషన్‌ ఓ యుద్దంలా కొనసాగింది… అయితే ఉగ్రవాదుల చొరబాటును సైన్యం తిప్పికొట్టింది. అక్నూర్‌ సెక్టార్‌లో చొరబడ్డ ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. అయితే వెంటనే ఆర్మీ కూంబింగ్‌ను చేపట్టింది. ఆర్మీ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. కొంతమంది ఉగ్రవాదులు పారిపోయినట్టు ఆర్మీ అనుమానిస్తోంది.

అక్నూర్‌ సెక్టార్‌లో అన్ని ప్రాంతాలను ఆర్మీ జల్లెడ పట్టింది. గత వారం రోజులుగా ఉగ్రవాదుల దాడులు పెరిగాయి. స్థానికేతరులను టార్గెట్‌ చేస్తూ ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో అప్రమత్తంగా ఉన్న సైన్యం ముగ్గురు టెర్రరిస్టులను కడతేర్చింది. అధునాతన ఆయుధాలతో పాటు డ్రోన్లను ఉపయోగిస్తూ భద్రతా బలగాలు ముందుకు కదులుతున్నాయి. తొలిసారి ప్రత్యేక వాహనాలను కూడా కూంబింగ్‌లో ఉపయోగించారు. సుందర్‌బరి సెక్టార్‌ లోని అసన్‌ ప్రాంతంలో ఏపీసీ శరత్‌ వాహనాలతో గాలింపు చర్యలు చేపట్టారు.

వాస్తవానికి భారత సరిహద్దులో చొరబడ్డ ఉగ్రవాదులు పెద్ద ప్లాన్‌తోనే వచ్చారు. అమెరికాలో తయారైన అధునాతన ఆయుధాలతో దాడికి సిద్దమయ్యారు. బట్టాల్‌ దగ్గర ఎన్‌కౌంటర్‌ ముగిసిన తరువాత దొరికిన ఆయుధాలను చూస్తే దిమ్మతిరిగింది. గ్రెనేడ్లతో పాటు ఏకే 47 రైఫిళ్లు అక్కడ దొరికాయి. చాలా రోజుల పాటు దాడిని కొనసాగించేందుకు అన్నిరకాల సామాగ్రితో చొరబడ్డారు టెర్రరిస్టులు.

ఇవి కూడా చదవండి

వాస్తవానికి తొలిసారి ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అఖ్నూర్‌ సెక్టార్‌లో ఇది మొదటి ఎన్‌కౌంటర్‌. ఎం4 రైఫిల్‌ను గతంలో కూడా వాడారు. ఆ ప్రాంతంలో ఆలయం ఉన్న మాట వాస్తవమే.. ఆ ప్రాంతంలో పేలుడు పదార్దాలను గుర్తిస్తున్నాం.. తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే ఆలయాన్ని డ్యామేజ్‌ చేసేందుకు ఎవరు ప్రయత్నం చేయలేదని స్థానిక పోలీసు అధికారి చెప్పారు.

ఆర్మీ కాన్వాయ్‌లో భాగమైన అంబులెన్స్‌ను కూడా ఉగ్రవాదులు టార్గెట్‌ చేస్తూ కాల్పులు జరిపారు. అయితే వెంటనే తేరుకున్న సైన్యం ఎదురుదాడిని ప్రారంభించింది. కౌంటర్‌ ఆపరేషన్‌ చేపట్టింది. ఉగ్రవాదుల ఏరివేతకు ఆర్మీ ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్‌ రూమ్‌ నుంచే ఉగ్రవాదుల కదలికలపై డేగకన్ను పెట్టారు. కూంబింగ్‌ చేస్తున్న బలగాలకు ఆ కంట్రోల్‌ రూమ్‌ నుంచే గైడ్‌ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..