AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thalapathy vijay: అలాంటి విమర్శలే స్వీకరిస్తాం.. రాజకీయాల్లో హుందాతనం ప్రదర్శిస్తున్న విజయ్..

ఈ నెల 27న  తమిళనాడులోని విల్లుపురంలోని విక్రవాండిలో మహానాడు సభతో తలపతి విజయ్ రాజకీయ రణరంగానికి తెరలేపాడు. ఆ సభలో ఆయన చాలా హుందాగా మాట్లాడారు. తీవ్ర విమర్శలు చేయకుండా తన పార్టీ ఐడియాలజీని ప్రకటించాడు. తాజాగా తనపై, తన పార్టీపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందించాడు.

Thalapathy vijay: అలాంటి  విమర్శలే స్వీకరిస్తాం.. రాజకీయాల్లో హుందాతనం ప్రదర్శిస్తున్న విజయ్..
Thalapathy Vijay
Velpula Bharath Rao
|

Updated on: Oct 30, 2024 | 8:03 AM

Share

రాజకీయాల్లో తమిళగ వెట్రి కజగం ఎప్పుడూ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ లక్ష్యాలను సాధిస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్ అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో, TVK నిర్మాణాత్మక విమర్శలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన తన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి లేఖను విడుదల చేశారు. తనపై, TVK పై రాబోయే రోజుల్లో ప్రత్యర్థుల నుంచి తీవ్ర విమర్శలు వస్తాయని విజయ్ కార్యకర్తలకు ముందే హెచ్చరించాడు.

తలపతి విజయ్ ఈ నెల 27న  తమిళనాడులోని విల్లుపురంలోని విక్రవాండిలో మహానాడు సభతో రాష్ట్ర స్థాయి రాజకీయ సమావేశాన్ని  నిర్వహించిన సంగతి తెలిసిందే.  ఈ సభకు భారీగా జనం తరలివచ్చారు. 85 ఎకరాల స్థలం పూర్తిగా జనసంద్రోహంతో నిండిపోయింది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ అందరీ దృష్టిని ఆకర్షించింది.  మహానాడు సభలో తలపతి విజయ్ స్పీచ్‌‌, తన పార్టీ ఐడియాలజీ అందరిని ఆకట్టుకుంది. ఇప్పటికి సోషల్ మీడియాలో మహానాడుకి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.