Diwali 2024: ఆర్ధిక ఇబ్బందులు తొలగడానికి దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు ఈ దేవుడిని కూడా పూజించండి..
దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీదేవి, గణేశుడిని పూజిస్తారు. అయితే లక్ష్మీదేవితో పాటుగా మరికొందరి దేవుళ్ళను పూజిస్తే మనిషికి ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదు. ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవు. ఆ దేవుళ్లెవరో తెలుసా? లక్ష్మీ దేవితో పాటు ఏ దేవుడిని పూజించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయాయో తెలుసుకుందాం..
దీపాల పండుగ దీపావళి సందడి మొదలైంది. ధన త్రయోదశి రోజు నుండి 5 రోజుల పాటు జరుపుకునే దీపాల పండుగ ప్రారంభమైంది. అయితే ఈ ఏడాది దీపావళి తేదీ విషయంలో ప్రజల్లో చాలా గందరగోళం నెలకొంది. దీపావళిని జరుపుకోవడానికి ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయారు. దీపావళి అక్టోబరు 31 అని కొందరంటే.. మరికొందరు నవంబర్ 1న దీపావళి జరుపుకోవాలని అంటున్నారు. అయితే ఇప్పుడు కాశీ పండితులు ఈ గందరగోళాన్ని తొలగించి అక్టోబర్ 31 సాయంత్రం మాత్రమే దీపావళి జరుపుకోవాలని స్పష్టం చేశారు. అటువంటి పరిస్థితిలో ఛోటీ దీపావళి అక్టోబర్ 30 న అంటే ఈ రోజు జరుపుకుంటున్నారు. ఛోటీ దీపావళిని నరక చతుర్దశి అని కూడా అంటారు.
ధన త్రయోదశి ,నరక చతుర్దశి, దీపావళి… ఈ మూడు పండుగలలో లక్ష్మీ పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీపావళి రోజు సాయంత్రం సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఉంది. దీపావళి నాడు లక్ష్మీ దేవిని పూజించడం వలన జీవితంలో డబ్బుకు లోటు ఉండదని విశ్వాసం. అయితే దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు ఏ దేవుడిని పూజించడం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయో ఈ రోజు తెలుసుకుందాం..
లక్ష్మీదేవితో పాటు ఏ దేవతను పూజించాలి?
వాస్తవానికి కొన్ని ప్రాంతాల్లో ధనత్రయోదశి రోజున లక్ష్మీ దేవి, కుబేరు దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే దీపావళి లేదా ఇతర రోజులలో కూడా లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజించడం వల్ల డబ్బుకు లోటు ఉండదు. హిందూ మతంలో యక్ష రాజైన కుబేరుడు సంపదకు దేవుడుగా భావిస్తారు. దీపావళి రోజున లక్ష్మీ దేవిని, కుబేర దేవుడిని పూజించడం వలన డబ్బు కొరత తొలగిపోతుంది. కోరుకున్న అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి.
డబ్బు సంక్షోభం తొలగిపోతుంది
దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం కలుగుతుందని, ఆర్థిక సంక్షోభం తొలగిపోతుందని మత విశ్వాసం. లక్ష్మీమాత సమేతంగా కుబేర దేవుడిని పూజించే ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు ఉండదని ఎంతో లాభం ఉంటుందని చెబుతారు. హిందూ మతంలో కుబేరుడి ఆరాధన చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అంతేకాదు శుక్రవారం రోజున లక్ష్మీ దేవితో పాటు కుబేరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.
కుబేరుని పూజించడం వల్ల ఏం జరుగుతుంది?
కుబేరుని పూజించే వ్యక్తికి ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని చెబుతారు. అలాగే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. హిందూ విశ్వాసాల ప్రకారం శుక్రవారం నాడు కుబేరుడిని ఆరాధించడం చాలా ఫలవంతమైనది. ఎందుకంటే ఈ రోజు కుబేరుడితో పాటు లక్ష్మీదేవికి ప్రియమైనది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)