Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyeshtha Purnima 2023: కష్టాల సుడిగుండంలో మునిగిపోయారా? జ్యేష్ఠ పూర్ణిమ ఈ రోజున ఈ పరిహారం చేయండి..!

హిందూమతంలో పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు గంగాస్నానం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పౌర్ణమి సంవత్సరంలో 12 సార్లు వచ్చినప్పటికీ, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమ జూన్ 3వ తేదీ శనివారం అవుతుంది. పౌర్ణమి నాడు సత్యనారయణ భగవానుని ఉపవాసం ఆచరించి కథలు వింటారు.

Jyeshtha Purnima 2023: కష్టాల సుడిగుండంలో మునిగిపోయారా? జ్యేష్ఠ పూర్ణిమ ఈ రోజున ఈ పరిహారం చేయండి..!
Jyeshtha Purnima
Follow us
Shiva Prajapati

|

Updated on: May 25, 2023 | 9:40 AM

హిందూమతంలో పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు గంగాస్నానం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. పౌర్ణమి సంవత్సరంలో 12 సార్లు వచ్చినప్పటికీ, జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం జ్యేష్ఠ పూర్ణిమ జూన్ 3వ తేదీ శనివారం అవుతుంది. పౌర్ణమి నాడు సత్యనారయణ భగవానుని ఉపవాసం ఆచరించి కథలు వింటారు. రాత్రి చంద్రునికి అర్ఘ్యం సమర్పిస్తారు. విష్ణువు, లక్ష్మితో పాటు, చంద్రుడిని కూడా పౌర్ణమి రోజున పూజిస్తారు. జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని వత్ పూర్ణిమ అని కూడా అంటారు. స్త్రీలు తమ భర్త దీర్ఘాయువు కోసం ఈ రోజున ఉపవాసం పాటిస్తారు.

జ్యేష్ఠ పూర్ణిమ ప్రాముఖ్యత ఏంటి?

వ్యక్తి జీవితంలో అనేక రకాల సమస్యలు ఉండి, అవి అలాగే కంటిన్యూ అవుతుంటే.. జ్యేష్ఠ పూర్ణిమ రోజున విష్ణుమూర్తిని పూజించడం ఉత్తమ పరిష్కారం. ఈ రోజున సత్యనారయణుని పూజించడం, కథలు వినడం ద్వారా శ్రీమహావిష్ణువు సంతోషించి, సాధకునిపై తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. సత్యనారాయణ కథానంతరం భక్తి భావంతో నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వాలి. భగవంతుడికి పంచామృతం అందించే ప్రసాదంలో తప్పనిసరిగా తులసి దళాన్ని చేర్చాలి. ఆ తరువాత వీలైనంత ఎక్కువ మందికి ప్రసాదం పంచాలి.

పౌర్ణమి నాడు గంగాస్నానంతో పాటు దానం కూడా చాలా ముఖ్యం. మత విశ్వాసాల ప్రకారం.. ఈ రోజున గంగానదిలో స్నానం చేయడం వల్ల అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. పాపాల నుండి విముక్తి లభిస్తుంది. జీవితంలో ఆనందం, శ్రేయస్సు రావడం ప్రారంభమవుతుంది. ఈసారి పౌర్ణమి శనివారం రావడంతో దీని ప్రాధాన్యత మరింత ప్రత్యేకంగా మారింది. ఈ రోజున శనిదేవుని అనుగ్రహం కూడా భక్తులపై ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పౌర్ణమి ఎప్పుడు ప్రారంభమవుతుంది?

జూన్ 3, శనివారం పౌర్ణమి తిథి ఉదయం 11:16 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. ఈ సమయంలో గంగాస్నానం దానం మొదలైనవి చేయవచ్చు. ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటే.. అభిజిత్ నక్షత్రం దానికి అనుకూలంగా ఉంటుంది. ఈ నక్షత్రం ఉదయం 11.29 నుండి 12.23 వరకు ఉంటుంది.

పౌర్ణమి రోజున, లక్ష్మీ దేవి అనుగ్రహం కోసం తప్పకుండా రావి చెట్టును పూజించండి. లక్ష్మి దేవి రావి చెట్టులో నివసిస్తుందని ఒక విశ్వాసం. అందుకే పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే.. ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం.

చంద్ర దోషం తొలగిపోతుంది..

జాతకంలో చంద్ర దోషం ఉన్న వ్యక్తులు.. జీవితంలో ఇనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి వారు.. పౌర్ణమి రోజున చంద్రుడిని పూజించడంతో పాటు, ఆయనకు ఇష్టమైన వస్తువులను దానం చేయాలి. ఈ సందర్భంగా ‘‘|| ఓం స్రం శ్రీం స్రౌం సః చంద్రమసే నమః ||ఓం శ్రీం శ్రీం శ్రౌం సః చంద్రమసాయ నమః’’ అనే మంత్రాన్ని జపించాలి. ఈ పరిహారం చంద్ర దోషాన్ని తొలగించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, మత గ్రంధాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..