AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janmashtami: జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెన్న, చక్కెరను ఎందుకు సమర్పిస్తారు? ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే..

జన్మాష్టమి సందర్భంగా.. దేవాలయాల్లో, ఇళ్లలో శ్రీ కృష్ణుడికి వెన్న చక్కరని కలిపి సమర్పించడం పురాతన సంప్రదాయం. అయితే ఇది కేవలం రుచి లేదా ప్రసాదానికి సంబంధించిన విషయం కాదని.. భగవంతుడైన బాల గోపాలుడి ఆట, ఆయన ఆధ్యాత్మిక సందేశంతో ముడిపడి ఉందని మీకు తెలుసా?

Janmashtami: జన్మాష్టమి రోజున కన్నయ్యకు వెన్న, చక్కెరను ఎందుకు సమర్పిస్తారు? ఆధ్యాత్మిక రహస్యం ఏమిటంటే..
Janmashtami
Surya Kala
|

Updated on: Aug 12, 2025 | 11:02 AM

Share

శ్రావణ మాసం అష్టమి తిథి రోజున జరుపుకునే శ్రీ కృష్ణ జన్మాష్టమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. భక్తి, ప్రేమ, సంప్రదాయాల సంగమం. ఈ రోజున దేవాలయాలు, ఇళ్లలో లడ్డూ గోపాలాన్ని అలంకరిస్తారు. శకటాలు తయారు చేస్తారు. వివిధ రకాల నైవేద్యాలను తయారు చేసి కన్నయ్యకి సమర్పిస్తారు. ఈ నైవేద్యాలలో ప్రతిచోటా కనిపించే ఒక నైవేద్యం ఉంది. అదే వెన్న చక్కెర మిశ్రమం. ఆ నైవేద్యం వెనుక రుచి మాత్రమే కాదు. ఆధ్యాత్మిక కథ కూడా దాగి ఉంది.

జన్మాష్టమి రోజున శ్రీ కృష్ణుడి లీల చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వెన్న, చక్కెరను సమర్పించడం కేవలం ఒక సంప్రదాయం కాదు. భక్తి సందేశం. హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోండి. మాటను తీపిగా ఉంచుకోండి. ప్రేమతో భక్తి చేయండి. ఇదే శ్రీ కృష్ణుడి నిజమైన ఆరాధనగా పరిగణించబడుతుంది. వెన్న ,చక్కెరను సమర్పించడం కృష్ణుడు వెన్న దొంగిలించిన లీల జ్ఞాపకం మాత్రమే కాదు. భక్తిలో ప్రేమ, సరళతకు చిహ్నంగా కూడా పురాణాలలో వర్ణించబడింది.

వెన్న – స్వచ్ఛమైన భక్తికి చిహ్నం పురాణ గ్రంథాల ప్రకారం బాల గోపాలుడికి వెన్న అంటే చాలా ఇష్టం. అతను దొంగతనంగా గోకులంలోని ఇళ్లలోకి ప్రవేశించి వెన్న దొంగిలించేవాడు. అందుకే అతన్ని వెన్న దొంగ అని పిలుస్తారు. పాల నుంచి వేరు చేయబడిన వెన్న స్వచ్ఛమైనది. శుభ్రమైనది అని పురాణాలు చెబుతున్నాయి. అది ఆ స్వచ్ఛమైన భక్తికి చిహ్నం. వెన్న పొందడానికి పెరుగుని గట్టిగా చిలకరించాల్సినట్లే.. దేవుడిని చేరుకోవడానికి భక్తి, సాధనను చిలకరించాలని భక్తులు నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

చక్కర – మధురమైన స్వరం సందేశం చక్కర అంటే కేవలం తీపి మాత్రమే కాదు, జీవితంలో తీపి, సానుకూలతకు చిహ్నం. జన్మాష్టమి రోజున వెన్నతో చక్కరని సమర్పించడం వల్ల స్వచ్ఛమైన హృదయంతో పాటు మధురమైన వాక్కు కూడా అవసరమనే సందేశం లభిస్తుందని నమ్ముతారు. కన్నయ్య వెన్న దొంగిలించబడినప్పుడు..చక్కరలోని తీపి అతని పట్ల తమ ప్రేమను పెంచుతుందని గోపికలు విశ్వసించారు.

జన్మాష్టమి రాత్రి ప్రాముఖ్యత శ్రీ కృష్ణుడు శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి జన్మించాడు. ఈ రాత్రి 12 గంటలకు జన్మించిన కన్నయ్యకు వెన్న, చక్కెరను నైవేద్యం పెట్టడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వస్తుందని అన్ని కష్టాలు తొలగిపోతాయని, కుటుంబ సభ్యులలో మాధుర్యం వస్తుందని నమ్ముతారు. అలాగే సంబంధాలలో ప్రేమ పెరుగుతుంది. పిల్లలు రక్షించబడతారు. చాలా ప్రదేశాలలో ఈ నైవేద్యాన్ని దేవాలయాలలో వెండి పాత్రలలో అలంకరిస్తారు. ఇది దాని చల్లదనాన్ని పెంచుతుంది. తరువాత భక్తులకు దీనిని ప్రసాదంగా పంచుతారు.

ఉట్టి కొట్టి సంబరం జన్మాష్టమితో ముడిపడి ఉన్న మరో ప్రసిద్ధ కార్యక్రమం వెన్న కుండ. ఇది వెన్న దొంగిలించే చర్యకు ప్రతీక, దీనిలో యువకుల బృందం ఎత్తుగా కట్టిన కుండను పగలగొట్టి పెరుగు, వెన్నను పొందుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.