AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50 ఏళ్ల తర్వాత ఏర్పడనున్న మాలవ్య, బుధాదిత్య రాజ్యయోగం.. ఈ రాశుల వారికి చేతి నిండా డబ్బే.. వేరు చెప్పిందే వేదం అంటారు..

జ్యోతిషశాస్త్రం ప్రకారం సెప్టెంబర్ 2025 నెల కొన్ని రాశులకు చాలా ప్రత్యేకమైనదిగా ఉండనుందని తెలుస్తుంది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగాలు కొన్ని రాశుల వారి అదృష్టాన్ని ప్రకాశింపజేయబోతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ రోజు ఈ యోగాల తర్వాత అదృష్టం ప్రకాశించే ఆ అదృష్ట రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.

50 ఏళ్ల తర్వాత ఏర్పడనున్న మాలవ్య, బుధాదిత్య రాజ్యయోగం.. ఈ రాశుల వారికి చేతి నిండా డబ్బే.. వేరు చెప్పిందే వేదం అంటారు..
Malavya Budhaditya Yoga
Surya Kala
|

Updated on: Aug 12, 2025 | 7:44 AM

Share

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల సంచారము, వాటి సంయోగం జీవితంలో పెద్ద మార్పులను తెస్తాయి. 50 సంవత్సరాల తర్వాత సెప్టెంబర్ నెలలో అరుదైన యాదృచ్చికం జరగబోతోంది. ఈ సమయంలో, శుక్రుడు తన సొంత రాశి తులారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది మాలవ్య రాజ్యయోగాన్ని సృష్టిస్తుంది. దీనితో పాటు బుధుడు, సూర్యుడి కలయిక ద్వారా బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ రెండు శుభ యోగాలు కలిసి ఏర్పడటంతో రానున్న సమయం మకరం, కుంభం, తుల ఈ మూడు రాశుల వారికి ఆర్థికంగా మంచి ఫలితాలను తీసుకుని వచ్చే అవకాశం ఉంది.

మాలవ్య రాజయోగం అంటే ఏమిటి? జ్యోతిషశాస్త్రంలో పంచ మహాపురుష యోగం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. వీటిలో ఒకటి మాలవ్య రాజ్యయోగం. శుక్ర గ్రహం కేంద్ర భావంలో (మొదటి, నాల్గవ, ఏడవ లేదా పదవ ఇల్లు) దాని ఉచ్ఛ రాశి మీన రాశిలో లేదా దాని సొంత రాశి వృషభం, తులారాశిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది.

సెప్టెంబర్‌లో శుక్రుడు తన సొంత రాశి తులారాశిలో సంచరించడం వల్ల ఈ రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడిని సంపద, శ్రేయస్సు, ప్రేమ, కళ,విలాసాలకు కారకుడిగా పరిగణిస్తారు. కనుక ఈ యోగ ప్రభావం వల్ల, ఒక వ్యక్తి జీవితంలో భౌతిక సుఖాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

ఇవి కూడా చదవండి

బుధాదిత్య రాజయోగం అంటే ఏమిటి? సూర్యుడు, బుధుడు ఒకే ఇంట్లో కలిసినపుడు బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. సూర్యుడిని గ్రహాలకు రాజుగా , ఆత్మకు కారకుడిగా భావిస్తారు. అయితే బుధుడిని తెలివి, వ్యాపారం, వాక్కుకు కారకంగా భావిస్తారు.

ఈ రెండు గ్రహాల కలయిక చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ యోగా ప్రభావం వల్ల ఒక వ్యక్తికి సమాజంలో గౌరవం లభిస్తుంది. అతని తెలివితేటలు పదునుగా మారతాయి. వ్యాపారం, వృత్తిలో పురోగతి సాధిస్తాడు.

ఏ 3 రాశుల వారు ఎక్కువగా ప్రభావితమవుతారంటే

మకర రాశి: ఈ సమయం మకర రాశి వారికి చాలా ఫలవంతమైనదిగా నిరూపించబడుతుంది. మాలవ్య రాజ్యయోగ ప్రభావం వల్ల జీవితంలో సౌకర్యాలు, విలాసాలు పెరుగుతాయి. వీరు ఆఫీసులో పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. జీతం పెరగవచ్చు. బుధాదిత్య రాజ్యయోగం కారణంగా వ్యాపారస్తులు వ్యాపారంలో పెద్ద ఒప్పందాలను పూర్తి చేస్తారు. ఆర్థిక లాభానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.

కుంభ రాశి: కుంభ రాశి వారికి ఈ రెండు రాజయోగాల నుంచి ఊహించని ధన లాభాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించవచ్చు. ఈ సమయం వ్యాపారవేత్తలకు లాభాలతో నిండి ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతుంది. దీనితో పాటు కుటుంబ జీవితంలో కూడా ఆనందాన్ని పొందుతారు. సంబంధాలలో మాధుర్యం ఉంటుంది.

తులా రాశి: ఈ సమయం తుల రాశి వారికి ఒక వరం లాంటిది ఎందుకంటే శుక్రుడు ఈ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాలవ్య రాజ్యయోగం కారణంగా వీరి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. బుధాదిత్య రాజ్యయోగ ప్రభావం వల్ల వీరి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది. పెండింగ్ పని పూర్తవుతుంది. అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
IND vs WI 1st T20I: భారత్ ముందు 172 పరుగుల ఛాలెంజ్
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు