Puri Rath Yatra 2021: అంతా సిద్ధం.. కాసేపట్లో మొదలు కానున్న పూరీ జగన్నాథ రథయాత్ర
పూరీ జగన్నాథ రథయాత్రకు సర్వసిద్ధమయ్యింది. జగన్నాథుని రథయాత్రకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
పూరీ జగన్నాథ రథయాత్రకు సర్వసిద్ధమయ్యింది. జగన్నాథుని రథయాత్రకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శనులు నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలపై గుండిచా మందిరానికి చేరుకోనున్నారు. రథాలను సేవలకు సిద్ధం చేసిన అధికారులు.. వాటిని దక్షిణాభిముఖంగా శ్రీక్షేత్రం ఎదుట నిలిపారు. శ్రీక్షేత్ర కార్యాలయం ఎదుట అక్షయ తృతీయ నుంచి ప్రారంభమైన రథాల తయారీ పనులు.. ఆదివారంతో ముగిసాయి.
సోమవారం చతుర్థామూర్తుల పొహండి వేడుకలు చేపట్టనున్నారు. ఆదివారం నుంచే పూరిలో జగన్నాథుని గోప్యసేవలు ఏర్పాటయ్యాయి. కీలకమైన ‘సేనాపట’ సేవను దైతాపతి సేవాయత్‌లు నిర్వహించారు. మరోవైపు పురుషోత్తముని నవయవ్వన వేడుకలు జరుగుతున్నాయి. స్వర్ణాభరణాలతో ముగ్గురు మూర్తులను అలంకరించారు. మహాప్రసాదం , మరో 56 రకాల పిండి వంటకాలు స్వామికి అర్పణ చేశారు.
కరోనా వ్యాప్తి కారణంగా గతేడాది పూరీ రథయాత్రకు భక్తులను అనుమతించలేదు. అయితే ఈ ఏడాది కూడా కోవిడ్ నిబంధనలు ఉన్నందున జగన్నాథుని రథయాత్ర పూరీకే పరిమితం చేశారు. భక్తులు లేకుండా యాత్రను కొనసాగిస్తున్నారు. ప్రత్యేక్ష ప్రసారంలో వేడుకలను భక్తులు ఇళ్లల్లో కూర్చొని చూడాలని స్థానిక కలెక్టర్ కోరారు. https://youtu.be/O7GX5U4TYGs టీవీ9 కూడా పూరి నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తోంది. ఇక, మూడు రథాలు శ్రీక్షేత్ర కార్డన్‌లో నిలిచిన తర్వాత భద్రతా బలగాలను నియమించారు. సోమవారం శ్రీక్షేత్రం లోపల, వెలుపల జగన్నాథుని సేవలు, పొహండి తదితరాలు నిర్ణీత వేళల్లో నిర్వహించాలని కోరారు.
మరోవైపు, పూరీ పట్టణంలోకి ఎవరూ ప్రవేశించకుండా అన్ని దారులనూ మూసివేశారు. ఎటుచూసినా బలగాలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి రాకపోకలు రద్దు చేశారు. పూరీ రథయాత్రకు 500 మంది అధికారులు, 65 ప్లటూన్ల భద్రతా బలగాలను నియమించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. లైవ్ కోసం ఇక్కడ చూడండి…