Horoscope Today: ఈ రాశి వారు ఆరోగ్య విషయంలో కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి.. ఈరోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూసుకోండి.
Horoscope Today: రాశి ఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారిలో మనలో చాలా మందే ఉంటారు. రాశి ఫలాలను బేస్ చేసుకొని కొత్త పనులను మొదలు పెట్టడం, లేదా వాయిదా వేసుకోవడం లాంటివి చేస్తుంటారు. మరి ఈరోజు...
Horoscope Today: రాశి ఫలాల ఆధారంగా రోజును ప్రారంభించే వారిలో మనలో చాలా మందే ఉంటారు. రాశి ఫలాలను బేస్ చేసుకొని కొత్త పనులను మొదలు పెట్టడం, లేదా వాయిదా వేసుకోవడం లాంటివి చేస్తుంటారు. మరి ఈరోజు మీ రాశి ఫలం ఎలా ఉందో ఓసారి తెలుసుకోండి.
మేషరాశి:
మేషరాశి వారు ఈరోజు ఆర్థిక పరిస్థితులను కొంత విశ్లేషించుకొని లోటు పాట్లను సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యోగాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సూర్య నారాయణ స్వామి వారి ఆరాధన మేలు చేస్తుంది.
వృషభ రాశి:
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం పెరుగుతుంది. అలాగే ఆస్తి వ్యవహారిక విషయాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుబ్రమణ్య స్వామి ఆరాధన ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.
మిథున రాశి:
మిథున రాశి వారు ఈరోజు నూతన పనులు చేపట్టడం, ఆర్థిక అభివృద్ధికి తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. మహా అమ్మవారి నామస్మరణ వీరికి మేలు చేస్తుంది.
కర్కాటక రాశి:
ఈ రాశి వారు ఈరోజు ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవరసం ఉంది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.
సింహ రాశి:
సింహ రాశి వారి ఈరోజు గతంలో చేపట్టి ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. శివపంచాక్షరి జపం వీరికి సూచించదగ్గ అంశం.
కన్యా రాశి:
ఈ రాశి వారు ఈరోజు స్నేహితులు, బంధువులతో సఖ్యతతో కూడిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక ఒప్పందాలను కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. గణపతి నామస్మరణ ఈ రాశి వారి మేలు చేస్తుంది.
తులా రాశి:
తులా రాశి వారు ఈరోజు తెలియని విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక పరమైన అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నవగ్రహ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి:
ఈ రాశి వారికి ఈరోజు వ్యవహారిక విషయాల్లో కొంత ఆదోళన కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒత్తిడితో కూడుకున్న కార్యక్రమాలను జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి. విష్ణు సహస్త్ర పారాయణం మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఈరోజు పనుల్లో ఆలస్యాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కొంతమేర నిరాశ కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విష్ణు మూర్తిని తులసీ దళంతో అర్చన చేసుకోవడం వీరికి సూచించదగ్గ అంశం.
మకర రాశి:
ఈ రాశి వారు ఈరోజు నూతన వృత్తి, వ్యాపారాల్లో తగిన సమీక్షలు ఏర్పాటు చేసుకుంటారు. ఉద్యోగాది విషయాల్లో కొంత అధికారుల ఒత్తిడి కనిపిస్తోంది. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. శివ పంచాక్షరి జపం చేలు చేస్తుంది.
కుంభ రాశి:
కుంభ రాశి వారు ఆరోగ్యం విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆర్థికంగా ఒంత ఒడిదుడుకులు కనిపించేలా ఉన్నాయి. జాగ్రత్త తీసుకోవాలి. అష్టలక్ష్మీ పారాయణం వీరికి సూచించదగ్గ అంశం.
మీన రాశి:
ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక లాభాలు కలిసివస్తుంటాయి. అలాగే సంఘంలో విశేషమైన ఆదారాభిమానులు పొందగలుగారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. సుదర్శన స్వామి వారి నామస్మరణ మేలు చేస్తుంది.
Also Read: Naivedya toThe God: ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం కావాలంటే దేవుడికి అన్నాన్ని ఇలా నైవేద్యంగా పెట్టండి
Leopard : తిరుమలలో కలకలం పుట్టిస్తోన్న చిరుతపులులు.. నేడు మళ్లీ ఘాట్ రోడ్‌లో పులి ప్రత్యక్షం