Naivedya toThe God: ఐశ్వర్యం, ఆనందం మీ సొంతం కావాలంటే దేవుడికి అన్నాన్ని ఇలా నైవేద్యంగా పెట్టండి
Naivedya to the God: అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏది లేకపోయినా బ్రతకగలం. కానీ ఆహారం లేకపోతే బతకలేం. అందుకనే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అన్నారు పెద్దలు.. ఈ అన్నం కలిగిని తీర్చడమే కాదు.. శివుడిని అన్నంతో కొలిస్తే ఐశ్వర్యం, ఆనందం ఇస్తాడు.. అన్నని దేవుడికి ఏ విధంగా నైవేద్యంగా పెడితే..ఏయే ఫలితాలు వస్తాయంటే
TV9 Telugu Digital Desk | Edited By: Surya Kala
Updated on: Jul 11, 2021 | 8:22 PM

ఆర్ధిక సమస్యలున్నవారు.. తెల్లని అన్నంతో శివలింగాన్ని నిర్మించి పూజలను చేసి నది నీటిలో వదలాలి. అలా చేసిన వారి ఇంట్లో ఎప్పుడూ నగదును ఇబ్బందులు కలుగవు. త్వరలోనే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి.

చర్మ వ్యాధులతో బాధపడేవారు .. తెల్లని అన్నానికి తేనెను కలిపి రోజూ ఇష్ట దైవానికి నైవేద్యంగా పెట్టాలి. అటువంటి వారికి అన్ని రకాల చర్మ వ్యాధుల నుంచి విముక్తి లభిస్తుంది.

దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బందులు పడేవారు తెల్లని అన్నానికి తేనెను, పంచదారను, కొబ్బరిని కలిపి ఆ అన్నాన్ని కులదేవతకు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఆ అన్నాన్ని దానం చేయాలి.. అటువాంటి వారికి అన్ని రకాల రోగాలు నయం అవుతాయి.

తెల్ల అన్నం, శనగపప్పు వేసి పాయసం చేసి మీ ఇంటి దేవునికి నైవేద్యం పెట్టి పాయసాన్ని దానం చేస్తే మీ ఇంట్లో అందరూ ప్రేమ, అభిమానాలను కలిగి ఉంటారు. చాల వరకు శాంతి లభిస్తుంది. మనస్సులో ఉండే భయం, భీతి, బెదిరింపులన్నీ తొలగిపోతాయి.

తెల్ల అన్నానికి నల్లని నువ్వులు కలిపి శ్రీ శనైశ్చరునికి నైవేద్యం పెట్టి నువ్వులను కాకులను పెడితే మీకు ఉన్న పితృదేవతల శాపాలనుంచి విముక్తి లభిస్తుంది.

అన్నం దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్ని పశువులకు ప్రసాదం పెట్టాలి. అనంతరం అవివాహితకు తాంబూలం ఇచ్చి నమస్కరిస్తే రావాల్సిన మొండి బాకీలు వసూలు అవుతాయి.





























