AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangajal: పవిత్రమైన గంగాజలం ఇంట్లో ఉందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..! చాలా నష్టపోతారు..

Gangajal: సనాతన ధర్మంలో గంగా నదిని దేవతా రూపంగా కొలుస్తారు. గంగ నీరు అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. ఇంట్లో ఏ శుభకార్యమైనా గంగాజలం తప్పకుండా వాడుతారు.

Gangajal: పవిత్రమైన గంగాజలం ఇంట్లో ఉందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..! చాలా నష్టపోతారు..
Gangaja
uppula Raju
|

Updated on: Oct 29, 2021 | 11:51 AM

Share

Gangajal: సనాతన ధర్మంలో గంగా నదిని దేవతా రూపంగా కొలుస్తారు. గంగ నీరు అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు. ఇంట్లో ఏ శుభకార్యమైనా గంగాజలం తప్పకుండా వాడుతారు. మత విశ్వాసాల ప్రకారం.. గంగ మోక్షాన్ని ఇస్తుంది. ప్రతిరోజూ ఎంతమంది గంగానదిలో స్నానం చేస్తారు. వారి పాపాలన్నిటిని దూరం చేస్తుందని నమ్మకం. కలియుగంలో కూడా గంగామాత పట్ల ప్రజలకు ఎనలేని భక్తిభావం ఉంది. ప్రజలు ఖచ్చితంగా గంగాజలాన్ని తమ ఇళ్లలో ఉంచుకుంటారు. ఎందుకంటే గంగాజలాన్ని ఇంట్లో ఉంచుకోవడం శుభప్రదంగా భావిస్తారు. గంగాజలాన్ని ఇంట్లో ఉంచితే మీ ఇంట్లో అభివృద్ధి ఉంటుందని నమ్ముతారు. అందుకే ఇంట్లో గంగాజలాన్ని పూర్తి భక్తితో కొలుస్తారు. కానీ ఈ నీరు ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలా నష్టపోతారు.

1. గంగాజలాన్ని వీటిలో ఉంచకూడదు.. సాధారణంగా గంగాజలాన్ని ప్లాస్టిక్‌ సీసాలోనో, లేకపోతే ఏదైనా డబ్బాలోనే ఉంచుతారు. కానీ పొరపాటున కూడా ఇలా చేయకూడదు. ఎందుకంటే ప్లాస్టిక్‌ని స్వచ్ఛంగా ఎవ్వరూ పరిగణించరు. వీలైనంత వరకు గంగాజలాన్ని రాగి, ఇత్తడి, మట్టి లేదా వెండి చెంబులలో మాత్రమే ఉంచాలి.

2. ఈ పని చేయడం మర్చిపోవద్దు మీరు ఇంట్లో గంగాజలాన్ని ఉంచినట్లయితే ప్రతి సందర్భంలోనూ పరిశుభ్రత పట్ల పూర్తి శ్రద్ధ వహించాలి. గంగాజలాన్ని ఉంచే ప్రదేశంలో నీచు వస్తువులు పెట్టకూడదు. వంటగదికి మొదలైన వాటికి దూరంగా ఉంచాలి.

3. అలాంటి చోట్ల గంగాజలాన్ని ఉంచవద్దు గంగాజల్ జీవితంలో స్వచ్ఛతను అందిస్తుంది కాబట్టి చీకటి ఉన్న ప్రదేశంలో దానిని ఎప్పుడూ ఉంచకూడదు. గంగాజలం పవిత్రమైనది కాబట్టి దానిని ఎక్కడ పెడుతున్నామో అక్కడ మురికి ఉండకుండా చూసుకోవాలి.

4. మురికి చేతులతో ముట్టుకోకూడదు గంగాజలాన్ని ముట్టుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మురికి చేతులతో గంగాజలాన్ని తాకడం మంచిది కాదు. చేతులను బాగా కడుక్కొని నీటిని ముట్టుకోవాలి. గంగాజలాన్ని మురికి చేతులతో, అపవిత్ర స్థితిలో తాకితే అది పెద్ద దోషం.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది.

Health News: ఈ 4 చెడ్డ అలవాట్ల వల్లే అన్ని రోగాలు..! వీటిని మార్చుకుంటే జీవితం హ్యాపీ.. అవేంటంటే..?

Bajaj Avenger: బజాజ్‌ అవేంజర్‌ కేవలం రూ.51 వేలకే..! ఎక్కడో తెలుసా..?

Join Indian Navy 2021: పదో తరగతి అర్హతతో నేవీలో పోస్టులు.. జీతం నెలకు రూ.50,000.. ఇలా అప్లై చేయండి..