AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Join Indian Navy 2021: పదో తరగతి అర్హతతో నేవీలో పోస్టులు.. జీతం నెలకు రూ.50,000.. ఇలా అప్లై చేయండి..

Join Indian Navy 2021: ఇండియన్ నేవీలో సెయిలర్ (ఎంఆర్) పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అ

Join Indian Navy 2021: పదో తరగతి అర్హతతో నేవీలో పోస్టులు.. జీతం నెలకు రూ.50,000.. ఇలా అప్లై చేయండి..
Indian Navy
uppula Raju
|

Updated on: Oct 29, 2021 | 11:00 AM

Share

Join Indian Navy 2021: ఇండియన్ నేవీలో సెయిలర్ (ఎంఆర్) పోస్టుల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు నేవీ అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 2, 2021న ముగుస్తుంది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 300 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టుల కోసం దాదాపు1500 మంది అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌కు పిలవనున్నారు. అయితే రాత పరీక్షలో రాష్ట్రాలను బట్టి కటాఫ్ మార్కులు మరే అవకాశం ఉంది.

పోస్ట్ పేరు – నావల్ సెయిలర్ (మెట్రిక్ రిక్రూట్) పోస్టుల సంఖ్య – 300 ఎంత జీతం – ఈ ఉద్యోగానికి ఎంపికైన యువతకు ముందుగా శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో వారికి ప్రతి నెలా రూ.14,600 చెల్లిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ రూ.21,700 నుంచి రూ.69,100 వరకు చెల్లిస్తారు. స్థాయి 3 ప్రకారం.. అన్ని ఇతర అలవెన్సులతో పాటు పూర్తి జీతం అందుబాటులో ఉంటుంది. ప్రారంభ జీతం నెలకు దాదాపు 50 వేల రూపాయలు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు అభ్యర్థులు దేశంలో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి10వ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఇది కాకుండా మీ వయోపరిమితి నోటిఫికేషన్ ప్రకారం.. 01 ఏప్రిల్ 2002 నుంచి 31 మార్చి 2005 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక ఇలా ఉంటుంది రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లీషు భాషలలో ఉంటుంది. పరీక్ష 30 నిమిషాలు ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి. సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ 10వ తరగతి స్థాయిలో ఉంటాయి. పూర్తి సిలబస్‌ను జాయిన్ ఇండియన్ నేవీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ)కి హాజరుకావాల్సి ఉంటుంది.

RajiniKanth: రజినీ కాంత్ ఆరోగ్యంపై స్పందించిన భార్య లత..ఏం చెప్పారంటే..

Covaxin: అక్కడకు వెళ్లే భారతీయులకు శుభవార్త..కొవాగ్జిన్‌కు ఆమోదం..ఆంక్షల తొలగింపు..

Jangu Prahlad: గేయ రచయిత జంగు ప్రహ్లాద్ కన్నుమూత.. సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్..