AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covaxin: అక్కడకు వెళ్లే భారతీయులకు శుభవార్త..కొవాగ్జిన్‌కు ఆమోదం..ఆంక్షల తొలగింపు..

గల్ఫ్‌ దేశం ఒమన్‌ భారతీయ ప్రయాణికుకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొవాగ్జిన్ తీసుకున్న వారు సైతం ఒమన్‌ వెళ్లేందుకు అంగీకారం తెలిపింది. తమ

Covaxin:  అక్కడకు వెళ్లే భారతీయులకు శుభవార్త..కొవాగ్జిన్‌కు  ఆమోదం..ఆంక్షల తొలగింపు..
Basha Shek
|

Updated on: Oct 29, 2021 | 10:51 AM

Share

గల్ఫ్‌ దేశం ఒమన్‌ భారతీయ ప్రయాణికుకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొవాగ్జిన్ తీసుకున్న వారు సైతం ఒమన్‌ వెళ్లేందుకు అంగీకారం తెలిపింది. తమ దేశంలో ఆమోదం పొందిన కొవిడ్‌ వ్యాక్సిన్ల జాబితాలో కొవాగ్జిన్‌ను కూడా చేర్చుతున్నామని, కాబట్టి ఈ టీకా తీసుకున్నవారు ఎలాంటి సందేహాలు, అనుమానాలు లేకుండా తమ దేశంలో అడుగుపెట్టవచ్చని ఒమన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. అదేవిధంగా బయలుదేరడానికి కనీసం 14 రోజుల ముందు రెండు డోసుల కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారు ఒమన్‌ చేరుకున్న తర్వాత 14 రోజుల క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. తమ దేశానికి చేరుకోవడానికి ముందు ఆర్‌టీపీసీఆర్‌ కొవిడ్‌ పరీక్షలో నెగెటివ్‌ వచ్చినట్లు నివేదిక ఉంటే చాలని తెలిపింది. ఈ మేరకు మస్కట్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. క్వారంటైన్‌ నుంచి మినహాయింపు.. కరోనా ఆంక్షలను తొలగిస్తూ సెప్టెంబర్‌ 1 నుంచి భారత్‌తో పాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ప్రయాణికులు తమ దేశంలో అడుగుపెట్టవచ్చని ఒమన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమోదం పొందిన టీకాలు వేసుకున్నవారికి మాత్రమే తమ దేశంలో ప్రవేశం ఉంటుందని కొన్ని నిబంధనలు విధించింది. అదేవిధంగా ప్రయాణికులు తమ దేశంలో అడుగుపెట్టిన తర్వాత కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజా ఉత్తర్వులతో ఈ నిబంధనల నుంచి ఉపశమనం కలగనుంది.

Also Read:

Weight Loss: సోషల్‌ మీడియా ఖాతాలను తొలగించింది.. 32 కిలోలు తగ్గింది.. ఎలాగంటే..

PM Narendra Modi: రోమ్‌కు చేరుకున్న ప్రధాని మోదీ.. నేడు క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ

Boy Alexa: అలెక్సాతో ముద్దు ముద్దుగా మాట్లాడుతున్న చిన్నారి.. నెట్టింట వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో..