Health News: ఈ 4 చెడ్డ అలవాట్ల వల్లే అన్ని రోగాలు..! వీటిని మార్చుకుంటే జీవితం హ్యాపీ.. అవేంటంటే..?

Health News: ఒకప్పుడు వృద్ధాప్యంతో రోగాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం చిన్నవయసులోనే మధుమేహం, థైరాయిడ్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, మోకాళ్ల నొప్పులు

Health News: ఈ 4 చెడ్డ అలవాట్ల వల్లే అన్ని రోగాలు..! వీటిని మార్చుకుంటే జీవితం హ్యాపీ.. అవేంటంటే..?
Healthy
Follow us
uppula Raju

|

Updated on: Oct 29, 2021 | 11:48 AM

Health News: ఒకప్పుడు వృద్ధాప్యంతో రోగాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం చిన్నవయసులోనే మధుమేహం, థైరాయిడ్, బీపీ, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు, మోకాళ్ల నొప్పులు మొదలైనవన్నీ ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం సమయపాలన లేని జీవనశైలి, ఆహారం. నిద్రపోవడం, లేవడం, తినడం, తాగడం. ఈ అలవాట్ల కారణంగా మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. అటువంటి పరిస్థితిలో శరీరం వ్యాధులతో పోరాడదు. ఫలితంగా క్రమంగా రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. చాలా మంది ఆరోగ్య నిపుణులు ఈ సమస్యలను నివారించడానికి ఏకైక మార్గం మన అలవాట్లను మార్చుకోవడమే అన్నారు. వాటి గురించి తెలుసుకుందాం.

1. పరగడుపున వేడి నీరు తాగడం ప్రతి వ్యక్తి ఉదయం నిద్ర లేచిన తర్వాత పరగడుపున గోరువెచ్చని నీటిని తప్పనిసరిగా తాగాలి. ఇలా చేస్తే రోగనిరోధక శక్తి, జీర్ణవ్యవస్థ వేగంగా పెరుగుతుంది. కడుపు క్లియర్ అవుతుంది. పొట్టని క్రమంతప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరం. అలాగే గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని విషపూరిత అంశాలు బయటకు వెళుతాయి.

2. ఆరోగ్యకరమైన అల్పాహారం ప్రతి ఒక్కరు ఉదయాన్నే అల్పాహారం తీసుకోవాలి. శరీరానికి రోజంతా శక్తి అందేలా పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. రసం, పాలు, గుడ్డు, మొలకలు, ఉప్మా, సెమోలినా ఇడ్లీ, పోహా మొదలైన వాటిని అల్పాహారంగా తీసుకోవాలి. పరాఠాలు, పూరీలు మొదలైన వాటికి దూరంగా ఉండటం మంచిది.

3. 45 నిమిషాల వ్యాయామం అల్పాహారానికి ముందు దాదాపు 45 నిమిషాల పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇందులో యోగా ముఖ్యమైనది. వ్యాయామం మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రస్తుత రోజుల్లో అతి తక్కువ శారీరక శ్రమ వల్ల ఊబకాయం పెరుగుతుంది. దీని వల్ల అన్ని రోగాలు చుట్టుముడుతున్నాయి. అందుకే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఇది కాకుండా మానసిక దృఢత్వానికి యోగా, ప్రాణాయామం తప్పనిసరి.

4. సరైన సమయంలో నిద్ర ఈ రోజుల్లో చాలామంది పడుకునే ముందు మొబైల్, ల్యాప్‌టాప్‌లలో గడుపుతున్నారు. దీని కారణంగా నిద్ర దెబ్బతింటుంది. దీనివల్ల మన ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఇది శారీరక, మానసిక అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఈ సమస్యలను నివారించడానికి ప్రతి వ్యక్తి రోజూ కనీసం 7-8 గంటల నిద్ర పోవాలి.

Join Indian Navy 2021: పదో తరగతి అర్హతతో నేవీలో పోస్టులు.. జీతం నెలకు రూ.50,000.. ఇలా అప్లై చేయండి..

Bajaj Avenger: బజాజ్‌ అవేంజర్‌ కేవలం రూ.51 వేలకే..! ఎక్కడో తెలుసా..?

Health Tips For Women: శీతాకాలంలో వచ్చే ఇబ్బందులను ఎదుర్కోవడానికి మహిళలు ఈ ఆహారాన్ని రెగ్యులర్‌గా తీసుకోండి..

కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
కొత్త అవతారం ఎత్తిన మాజీ కెప్టెన్! శాంటాక్లాజ్‌ కాదు తలా క్లాజ్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..