Bajaj Avenger: బజాజ్ అవేంజర్ కేవలం రూ.51 వేలకే..! ఎక్కడో తెలుసా..?
Bajaj Avenger: చాలా మందికి ఫేమస్ బైక్ కొనాలని కోరికుంటుంది. కానీ అధిక ధర కారణంగా కొనలేకపోతారు. అటువంటి వారికి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే బజాజ్ అవెంజర్
Bajaj Avenger: చాలా మందికి ఫేమస్ బైక్ కొనాలని కోరికుంటుంది. కానీ అధిక ధర కారణంగా కొనలేకపోతారు. అటువంటి వారికి ఇది శుభవార్తనే చెప్పాలి. ఎందుకంటే బజాజ్ అవెంజర్ స్టైలిష్ బైక్ కేవలం రూ. 51 వేలకే అందుబాటులో ఉంది. కానీ ఇది సెకండ్ హ్యాండ్ బైక్. ప్రస్తుతం ఇది బైక్స్ 24 అనే వెబ్‌సైట్‌లో రూ.51 వేలకు అమ్మకానికి ఉంది. అయితే ఈ బైక్ షోరుమ్ ధర రూ.1.08 లక్షలుగా ఉంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
బజాజ్ అవెంజర్ సింగిల్ సిలిండర్ స్ట్రోక్ 220 సిసి, ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఈ ఇంజన్ 19.03PS పవర్, 17.5Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. Bikes24 వెబ్‌సైట్‌లో జాబితా చేయబడిన ఈ బైక్ బ్లూ కలర్‌లో వస్తుంది. ఈ బైక్ మంచి కండిషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ ఢిల్లీలోని DL-10 RTOలో రిజిస్టర్ చేసి ఉంది. ఇది 2015 మోడల్ 41 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. Bikes24లో జాబితా చేయబడిన ఈ బైక్ కొన్ని షరతులకు లోబడి 12 నెలల వారంటీతో వస్తుంది.
ఇందులో కంపెనీ 7 రోజుల సులభ రాబడి గురించి సమాచారం ఇచ్చింది. దీనికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ లేదా కారు కొనడానికి ముందు దాని గురించి ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలి. ఎందుకంటే మోసాలు జరిగే అవకాశం ఉంది. ఈ బైక్ గురించి మరిన్ని వివరాల కోసం కార్స్ 24 వెబ్‌సైట్‌లో ఇచ్చిన పూర్తి సమాచారం తెలుసుకోండి.
గమనిక: ఏదైనా సెకండ్ హ్యాండ్ బైక్ కొనడానికి ముందు దాని గురించి ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి. అలాగే ఈ సమాచారం Bikes24.comలో ఉంది. దీనికి టీవీ9కి ఎటువంటి సంబంధం లేదని గుర్తించండి.