AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips For Women: స్త్రీలు ఈ నాలుగు తప్పులు చేస్తున్నారా? వెంటనే ఆపండి. లేదంటే మీరు కష్టాల ఊబిలో చిక్కుకోవడం ఖాయం.

మనిషి జీవితంలో పురోభివృద్ధి సాధించడానికి గ్రంధాలలో అనేక మార్గాలు ఉన్నాయి. శాస్త్రంలో ఈ నియమాలను పాటించడం ద్వారా, ఒక వ్యక్తి తన చెడు సమయాలను కూడా మంచి కాలంగా మార్చగల సామర్థ్యాన్ని పొందుతాడు.

Vastu Tips For Women: స్త్రీలు ఈ నాలుగు తప్పులు చేస్తున్నారా? వెంటనే ఆపండి. లేదంటే మీరు కష్టాల ఊబిలో చిక్కుకోవడం ఖాయం.
Vastu Tips For Women
Madhavi
| Edited By: |

Updated on: Jun 06, 2023 | 9:30 AM

Share

మనిషి జీవితంలో పురోభివృద్ధి సాధించడానికి గ్రంధాలలో అనేక మార్గాలు ఉన్నాయి. శాస్త్రంలో ఈ నియమాలను పాటించడం ద్వారా, ఒక వ్యక్తి తన చెడు సమయాలను కూడా మంచి కాలంగా మార్చగల సామర్థ్యాన్ని పొందుతాడు. అందుకే కొన్ని నిబంధనలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు కూడా మన జీవితంలో పెద్ద సమస్యలకు దారి తీస్తాయి. హిందూ మతంలో, స్త్రీలను ఇంటి లక్ష్మి అని పిలుస్తారు. ఏ స్త్రీ తన ఇంటి పరిశుభ్రతపై ఎక్కువ శ్రద్ధ చూపుతుందో ఖచ్చితంగా ఆ ఇంట్లో లక్ష్మి దేవి నివసిస్తుంది. ఇక లక్ష్మీదేవి కొలువై ఉండే ఇంట్లో ధన, ధాన్యానికి లోటు ఉండదు. శాస్త్రం ప్రకారం స్త్రీ ఏ నియమాలు పాటిస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉంటుంది..?

1. స్త్రీలు ఈ పనులు చేయకూడదు:

శాస్త్రం ప్రకారం, స్త్రీలు ఇంటి తలుపును కాలితో తన్నడం లేదా వారి కాలితో తలుపును తాకడం ద్వారా తెరవకూడదు. ఇలా చేసే స్త్రీల ఇంట్లో తల్లి లక్ష్మిదేవి ఎప్పుడూ ప్రవేశించదు. ఆ ఇంటి సభ్యులు ఎప్పుడూ ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎవరైనా స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తుంటే ఈరోజు ఆ తప్పులు చేయడం మానేయాలని శాస్త్రం చెబుతోంది.

ఇవి కూడా చదవండి

2. గుమ్మం మీద కూర్చోవడం:

సాధారణంగా మహిళలు గుమ్మం మీద కూర్చొని మాట్లాడటం, తినడం, ఇతర పనులు చేయడం నిషేధం. స్త్రీలు కూడా ఈ తప్పులు చేయడం వల్ల తల్లి లక్ష్మిదేవి ఆగ్రహానికి గురవుతుంది. స్త్రీల ఈ ఆచారం ఇంటి నాశనానికి దారి తీస్తుంది. అందుకే గుమ్మం మీద కూర్చుని ఇలాంటి పనులు చేయకూడదని గ్రంధాలలో ప్రస్తావన ఉంది.

3. చీపురు పాదాలతో తాకకూడదు:

శాస్త్రాల ప్రకారం, చీపురు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. కాబట్టి ప్రతి స్త్రీ పాటించాల్సిన చీపురుకు సంబంధించిన కొన్ని నియమాలు ఉన్నాయి. ఇంట్లోని ఆడవాళ్ళు చీపురు తొక్కకూడదని, కాళ్లతో చీపురు తొక్కకూడదని అంటారు. స్త్రీలు ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఆ ఇంట్లో పేదరికం పెరుగుతుంది.

4. వంటగదిలో ఈ తప్పులు చేయవద్దు:

హిందూ మతంలో, తల్లి అన్నపూర్ణా దేవి వంటగదిలో నివసిస్తుందని నమ్ముతారు. కాబట్టి రాత్రి భోజనం చేసిన వెంటనే పాచి పాత్రలు అలాగే ఉంచకూడదని చెబుతుంటారు. స్త్రీలు ఇలాంటి తప్పులు చేస్తే ఆ ఇంట్లో వాస్తు దోషాలు ఉంటాయని, ప్రతికూలత పెరుగుతుందని నమ్ముతారు. అలాంటి ఇంట్లో మనం ఎప్పటికీ శాంతి, సంతోషాలు పొందలేమని శాస్త్రం చెబుతోంది.

హిందూ మతంలోని శాస్త్రాల ప్రకారం, ఏ ఇంట్లోనైనా స్త్రీలు పైన పేర్కొన్న 4 తప్పులు తెలిసి లేదా తెలియక చేస్తారు. ఆ ఇంటిలో డబ్బు – ధాన్యం, సంపద లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఈ తప్పులను చేయకూడదని తెలుసుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).