ఈ భూమి మీద మనుషులు కశ్యప మహర్షి వారసులే.. పరశురాముడు ఎందుకు భూమిని ఈ మహర్షికి దానం చేశాడో తెలుసా..!
విశ్వ సృష్టికి ఎందరో మహర్షులు సహకరించారని విశ్వసిస్తారు. మనం సృష్టి గురించి మాట్లాడేటప్పుడు.. జీవులు, జంతువులు లేదా మానవుల మూలం అని అర్థం. పురాణాల ప్రకారం, సృష్టి వ్యాప్తికి సహకరించిన మహర్షి కశ్యపు వారసులు. కశ్యప్ మహర్షికి 17 మంది భార్యలు. వారి సంతానం నుంచి విశ్వం అభివృద్ధి చెందింది. కశ్యప్ మహర్షి విశ్వ సృష్టికర్తగా కూడా పరిగణించబడ్డాడు. పురాణాల ప్రకారం విశ్వమంతా ఋషి కశ్యపుచే సృష్టించబడిందని నమ్ముతారు. పురాణం ప్రకారం.. కశ్యప్ మహర్షి భార్యలు మానస కుమారుకు జన్మిచ్చారు.
శ్రీ మహా విష్ణు అవతారాల్లో ఒకటైన పరశురాముడి గురించి చాలా మందికి తెలుసు. పురాణాల మీద అవగాహన ఉన్నవారికి సప్త ఋషుల గురించి కూడా తెలుసు. సప్తఋషి గణాలలో కశ్యప మహా ఋషికి ఒకరు. హిందూ విశ్వాసం ప్రకారం అతను ఋగ్వేదంలోని ఏడుగురు ప్రాచీన ఋషులలో ఒకరు. అయితే కశ్యప మహర్షికి పరశురాముడికి గల సంబంధం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. ఈ రోజు కశ్యప మహర్షి ఎవరు పరశురాముడికి ఈ మహర్షికి గల బంధం ఏమిటి అనేది తెలుసుకుందాం.
కశ్యప్ మహర్షి ఎవరంటే? హిందూ మతం ప్రకారం సృష్టి ప్రారంభ సమయంలో బ్రహ్మ దేవుడు సముద్రంలో, భూమిపై అన్ని రకాల జీవులను సృష్టించాడు. ఇదే సముంలో అతను చాలా మంది మానస కుమారులకు జన్మనిచ్చాడు. అలా బ్రహ్మ మానస కుమారుల్లో ఒకరు మరీచి. కశ్యప్ ఋషి మరీచి మహర్షి కళలకు జన్మించాడు. కళ కర్దమ ప్రజాపతి కుమార్తె. కశ్యప మహర్షి అద్భుతమైన లక్షణాలు, గాంభీర్యం, దృఢత్వం, బలంతో ఉత్తమ గొప్ప వ్యక్తులలో ఒకడుగా లెక్కించబడ్డాడు.
విశ్వ సృష్టికి ఎందరో మహర్షులు సహకరించారని విశ్వసిస్తారు. మనం సృష్టి గురించి మాట్లాడేటప్పుడు.. జీవులు, జంతువులు లేదా మానవుల మూలం అని అర్థం. పురాణాల ప్రకారం, సృష్టి వ్యాప్తికి సహకరించిన మహర్షి కశ్యపు వారసులు. కశ్యప్ మహర్షికి 17 మంది భార్యలు. వారి సంతానం నుంచి విశ్వం అభివృద్ధి చెందింది.
కశ్యప్ మహర్షి, విశ్వ సృష్టికర్త కశ్యప్ మహర్షి విశ్వ సృష్టికర్తగా కూడా పరిగణించబడ్డాడు. పురాణాల ప్రకారం విశ్వమంతా ఋషి కశ్యపుచే సృష్టించబడిందని నమ్ముతారు. పురాణం ప్రకారం.. కశ్యప్ మహర్షి భార్యలు మానస కుమారుకు జన్మిచ్చారు. ఆ తర్వాత ఈ విశ్వం సృష్టించబడింది. అందుకే కశ్యప్ మహర్షిని విశ్వ సృష్టికర్త పిలుస్తారు. కశ్యప్ అనేది ఒక ప్రసిద్ధ గోత్రం పేరు కూడా. ఇది చాలా విస్తృతమైన గోత్రం. ఎవరికైతే గోత్రం తెలియదో అటువంటి వ్యక్తీ గోత్రం కశ్యపునిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఒక సంప్రదాయం ప్రకారం భూమి మీద అన్ని జీవులు కశ్యపుని నుండి ఉద్భవించాయి.
పరశురాముడు భూమిని దానం చేశాడు శ్రీ మహా విష్ణువు అవతారమైన పరశురాముడు కశ్యప్ మహర్షి శిష్యుడు. పురాణాల కథ ప్రకారం ఒకసారి పరశురాముడు మొత్తం భూమి మీద దండయాత్ర చేసి క్షత్రియులందరినీ నాశనం భూమిని జయించాడు. అనంతరం పాపానికి ప్రాయశ్చిత్తంగా పరశురాముడు అశ్వమేధ యాగం చేసాడు. ఆ తర్వాత తన గురువైన కశ్యప మహర్షికి మొత్తం భూమిని దానం చేసాడు. తన గురువైన కశ్యపుడు ఆజ్ఞను అనుసరించి, పరశురాముడు ప్రతి రాత్రి భూమిపై ఉండకూడదని నిర్ణయించుకున్నాడు. అతను వేగంగా కదిలే శక్తితో ప్రతి రాత్రి మహేంద్ర పర్వతానికి వెళ్ళేవాడు పరశురాముడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు