AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yadadri: యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి దర్శనం, ఆర్జిత సేవలకు అన్‌లైన్ బుకింగ్ సిస్టమ్..!

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించే భక్తులకు గుడ్ న్యూస్. రోజు రోజుకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రీశుడి దర్శనం కోరి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.

Yadadri: యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి దర్శనం, ఆర్జిత సేవలకు అన్‌లైన్ బుకింగ్ సిస్టమ్..!
Yadadri
M Revan Reddy
| Edited By: |

Updated on: May 24, 2024 | 12:41 PM

Share

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించే భక్తులకు గుడ్ న్యూస్. రోజు రోజుకు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రీశుడి దర్శనం కోరి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. తిరుపతి తిరుమల దేవస్థానం తరహాలోనే యాదాద్రి నర్సన్న ఆలయంలో కూడా టికెట్లును ఆన్‌లైన్‌లో పొందే విధంగా ఏర్పాటు చేసింది యాదాద్రి దేవస్థానం.

తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం తర్వాత ఇలా వైకుంఠంగా పేరుందిన తిరుమల తరహాలో యాదాద్రిలో ఆలయనిర్మాణం, మాఢవీధులు, స్వామివారి పూజ కైంకర్యాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, ప్రసాదాలతో తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకుంది. ఈ పుణ్యక్షేత్రానికి భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు వీఐపీ, వీవీఐపీ, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తుల సిఫార్సులపై వచ్చే భక్తులకు 300 రూపాయల టికెట్‌తో బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. రూ.150 చెల్లించి శీఘ్రదర్శనం ఆన్ లైన్ లో నమోదుకు అవకాశం ఉండగా, ప్రస్తుతం అన్ని సేవలను ఆన్ లైన్ అందుబాటులోకి దేవస్థానం తీసుకువచ్చింది.

ఆన్‌లైన్‌లో ‘yadadritemple.telangana.gov.in ‘ వెబ్‌సైట్ ను సందర్శించి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఇదే వెబ్ సైట్ నుంచి ఈ హుండీ ద్వారా డొనేషన్స్ కూడా ఇవ్వవచ్చు. ఆన్ లైన్ బుకింగ్ ద్వారా గంట ముందు దర్శన, పూజ కైంకర్యాలకు బుకింగ్ చేసుకునే అవకాశం యాదగిరిగుట్ట దేవస్థానం కల్పించింది

ఆన్ లైన్ బుకింగ్ లో పేరు, గోత్రం, పూజ వివరాలు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, తేదీ, ఎన్ని టికెట్లు, అడ్రస్, ఆధార్ నెంబర్, ఆలయ సందర్శన వేళ వంటి వివరాలు నింపాలి. ఆన్ లైన్ బుకింగ్, కౌంటర్ లో కంప్యూటరైజ్డ్ టికెట్లు పొందిన భక్తులకు తూర్పు రాజగోపురం వద్ద టికెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆలయంలో లోనికి అనుమతిస్తారన్నారని ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఈ టాలీవుడ్ నటుడు ఒకప్పుడు చిరంజీవి ఇంటికి ఇటుకలు మోశాడని తెలుసా?
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
ఆ సినిమా ఇప్పుడు వస్తే సూపర్ హిట్ అయ్యేది..
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
పొట్టకూటికోసమని వెళ్లి.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా..? హైదరాబాద్ టూ విశాఖ, అరకు.. మీ
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
పాలక్ పన్నీరు కూర ఇలా వండి తింటే.. ఏ నాన్ వెజ్ కూరలు సరిపోవు
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
ప్లేస్‌ ఒక్కటే.. ఒక్కోరోజూ ఒక్కో స్టైల్‌లో పూజలు..ఏంటని ఆరా తీయగా
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
వేసవికాలంలో పెరుగు తినడం మంచిదేనా? బయట పడ్డ నమ్మలేని నిజాలు
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ?
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌
తెలంగాణ డీఈఈసెట్‌ 2026 నోటిఫికేషన్‌ వచ్చేసిందోచ్‌