AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hanuman Jayanti: ఈ ఏడాది సర్వార్థ సిద్ధి యోగలో హనుమాన్ జయంతి.. ఈ చర్యలతో వ్యాపార పురోభివృద్ధి.. సకల శుభాలు మీ సొంతం

సర్వార్థ సిద్ధి యోగంలో హనుమాన్ జయంతి ప్రారంభం కానుంది. అంతేకాదు ఆ రోజు హస్త, చిత్త నక్షత్రాల శుభ కలయిక ఏర్పడనుంది. అంతేకాదు సర్వ సుఖాలకు అధిపతి అయిన శుక్రుడు తన రాశిని మార్చుకోనున్నాడు. దీంతో హనుమాన్ జయంతి రోజున ప్రత్యేకంగా హనుమంతుని పూజించడం వలన ఎంతో మేలు చేకూరుతుంది

Hanuman Jayanti: ఈ ఏడాది సర్వార్థ సిద్ధి యోగలో హనుమాన్ జయంతి.. ఈ చర్యలతో వ్యాపార పురోభివృద్ధి.. సకల శుభాలు మీ సొంతం
Hanuman Jayanthi Puja
Surya Kala
|

Updated on: Apr 04, 2023 | 11:41 AM

Share

హనుమాన్ జన్మదినోత్స పండుగను ఏప్రిల్ 6వ తేదీ గురువారం జరుపుకోవడానికి భక్తులు రెడీ అవుతున్నారు. ఏడాదికి హనుమాన్ జయంతిని రెండుసార్లు జరుపుకుంటారు.. మొదటి సారి చైత్రమాసంలోని పౌర్ణమి రోజున.. రెండవ రోజు కార్తీక మాసంలోని చతుర్దశి రోజున. ఏప్రిల్ 6న శుభ యోగంలో హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. హనుమాన్ జయంతి రోజున తీసుకోవలసిన కొన్ని చర్యలు కూడా జ్యోతిష్యశాస్త్రంలో పేర్కొనబడ్డాయి.

సర్వార్థ సిద్ధి యోగంలో హనుమాన్ జయంతి ప్రారంభం కానుంది. అంతేకాదు ఆ రోజు హస్త, చిత్త నక్షత్రాల శుభ కలయిక ఏర్పడనుంది. అంతేకాదు సర్వ సుఖాలకు అధిపతి అయిన శుక్రుడు తన రాశిని మార్చుకోనున్నాడు. దీంతో హనుమాన్ జయంతి రోజున ప్రత్యేకంగా హనుమంతుని పూజించడం వలన ఎంతో మేలు చేకూరుతుంది. ఆ రోజున హనుమంతుడి ప్రసన్నం కోసం కొన్ని చర్యలు చేయాల్సి ఉంది. దీనితో హనుమంతుడు జీవితంలోని అన్ని కష్టాలను దూరం చేస్తాడు. దీంతో హనుమాన్ జయంతి నాడు చేపట్టాల్సిన చర్యల గురించి ఈ రోజు తెలుసుకుందాం…

ఈ పరిహారంతో అన్ని కష్టాలు తొలగిపోతాయి

ఇవి కూడా చదవండి

హనుమాన్ జయంతి రోజున బ్రహ్మ ముహూర్తం నుండి సాయంత్రం వరకు 11 సార్లు సుందరకాండ పఠించాలి. ఇలా చేయడం సాధ్యం కాకపోతే.. హనుమాన్ చాలీసాను 108 సార్లు పఠించవచ్చు. అంతేకాదు హనుమాన్ అష్టకం, బజరంగ బలి స్తోత్రాన్ని పఠించవచ్చు. ఇలా చేయడం వల్ల కష్టాలు బాధలు తొలగిపోతాయి. దెయ్యాలు,ప్రేతాలు వంటి ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని విశ్వాసం.

ఆనందం, శ్రేయస్సుని తెచ్చే పరిహారం 

హనుమాన్ జయంతి రోజున తమలపాకుతో పాటు శనగలు, సింధూరాన్ని భక్తితో హనుమంతుడికి సమర్పించండి. తర్వాత బెల్లం, బూందీ ప్రసాదం పంచిపెట్టండి. సింధూరం సమర్పించిన తర్వాత హనుమంతుని భుజాల నుండి కొంచెం సింధూరం తీసుకుని ధరించండి. ఇలా చేయడం వలన చేదు దృష్టి తొలగిపోతుంది. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

కోరికలను నెరవేర్చే ఈ పరిహారం 

హనుమాన్ జయంతి రోజున.. హనుమంతుడి ఆలయానికి వెళ్లి.. ఆసనంపై కూర్చుని ఐదు నూనె దీపాలను వెలిగించి రామచరిత్ మానస్ లేదా రక్షా స్త్రోత్రం పఠించండి. అనంతరం హనుమంతుని విగ్రహం నుంచి కొంచెం సింధూరాన్ని కుడి చేతి బొటన వేలితో తీసి, సీత మాత పాదాల సమర్పించండి. ఇలా చేయడం వల్ల పాపాలన్నీ తొలగిపోయి.. కోరికలు నెరవేరుతాయి.

ఈ పరిహారం ఉద్యోగం, వ్యాపారంలో పురోగతికి దారితీస్తుంది

హనుమాన్ జయంతి రోజున 108 తులసి ఆకులపై రామ్ రాముని పేరు వ్రాసి దానిని ఒక మాల రూపంలో తయారు చేసి, ఆపై హనుమంతునికి తులసి మాలను సమర్పించండి. దీని తరువాత.. ఆవనూనె, నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన, ధాన్యాలకు లోటు ఉండదు, ఉద్యోగ, వ్యాపారాలలో పురోభివృద్ధికి అవకాశం ఉంటుంది.

రక్షణ కవచంలా పనిచేసే పరిహారం 

హనుమాన్ జయంతి రోజున సర్వార్థ సిద్ధితో సహా అనేక శుభ యోగాలు కలుగనున్నాయి. ఈ మంగళకరమైన యోగాలలో హనుమాన్ యంత్రాన్ని స్థాపించి క్రమం తప్పకుండా పూజించండి. ఇలా చేయడం వల్ల శారీరక, మానసిక వికాసంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ఈ యంత్రాన్ని ఆరాధించే వారి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. మొత్తం కుటుంబానికి రక్షణ కవచంగా పనిచేస్తుంది.

ఈ పరిహారం వల్ల ధన, ధాన్యాలకు లోటు ఉండదు.

హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి, సమీపంలోని హనుమంతుడి ఆలయంలో బెల్లం, గోధుమ పిండితో లడ్డూలను తయారు చేసి హనుమంతుడికి నైవేద్యంగా సమర్పించండి. ఈ లడ్డులను చేయడం కష్టమనుకునేవారు మోతీచూర్ లడ్డూలను కూడా నైవేద్యంగా సమర్పించండి. చందనము, గులాబీ దండను హనుమంతుడికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల హనుమంతుని విశేష ఆశీస్సులు లభిస్తాయి. జీవితంలో ధన, ధాన్యాలకు లోటు ఉండదు.

అంగారకుడి స్థానాన్ని బలపడేందుకు చేయాల్సిన పరిహారం 

హనుమాన్ జయంతి రోజున.. కుజ దోషం ఉన్నవారు లేదా ఎవరి జాతకంలోనైనా అంగారకుడి ప్రతికూల స్థితిలో ఉంటె వారు హనుమాన్ జయంతి రోజున ఎర్ర వస్త్రాలను దానం చేయాలి. . హనుమాన్ ఆలయంలో ధ్వజారోహణం చేయడం ద్వారా విశేష ప్రయోజనాలు కూడా పొందుతారు. ఇలా చేయడం వల్ల జాతకంలో కుజుడు స్థానం బలపడుతుంది. రక్తదానం, పప్పు దానం చేయవచ్చు

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)