Guru Purnima: చీకటి నుంచి వెలుగు వైపుకి నడిపించే గురువు .. నేడు గురు పౌర్ణమి.. తల్లిదండ్రులను ఎలా పూజించాలంటే..
హిందూ విశ్వాసం ప్రకారం మనిషిని చీకటి నుండి వెలుగు వైపుకు నడిపించేవాడు గురువు. తాను ఉన్న ప్లేస్ నుంచి తన శిష్యులను వారి గమ్యానికి చేర్చే వ్యక్తి గురువు. ఒక వ్యక్తికి మంచి, చెడు, తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని చెప్పడం ద్వారా సరైన జీవిత మార్గాన్ని చూపుతాడు. లక్ష్యాన్ని సాధించడానికి మనిషికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ దొంగ దొంగిలించలేని జ్ఞానాన్ని గురువు మనకు ప్రసాదిస్తాడు.
హిందూ మతంలో గురువుకు విశిష్ట స్థానం ఉంది. సనాతన సంప్రదాయంలో గురువుకి ఇచ్చిన స్థానం ప్రపంచాన్ని పాలించే విష్ణువుకు కూడా లేదని చెప్పవచ్చు. అంత ఉన్నతమైన స్థానం గురువుకి ఇచ్చారు. ఎందుకంటే ఆ గోవిందుడిని కూడా గుర్తించగలిగే శక్తిని ఆ గురువు మాత్రమే ఇవ్వగలడు. గురువు విశిష్టతను తెలియజేస్తూ.. ఆయన పట్ల భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ ప్రతి సంవత్సరం ఆషాఢ పూర్ణిమను గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ రోజు గురువుపై విశ్వాసం వ్యక్తం చేస్తూ పూజిస్తారు. అయితే గురువు లేకుంటే ఏమి చేయాలి? గురువు లేని సమయంలో ఎవరిని పూజించాలో తెలుసుకుందాం.
జీవితంలో గురువు ఎందుకు ముఖ్యమంటే.. హిందూ విశ్వాసం ప్రకారం మనిషిని చీకటి నుండి వెలుగు వైపుకు నడిపించేవాడు గురువు. తాను ఉన్నప్లేస్ నుంచి తన శిష్యులను వారి గమ్యానికి చేర్చే వ్యక్తి గురువు. ఒక వ్యక్తికి మంచి, చెడు, తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసాన్ని చెప్పడం ద్వారా సరైన జీవిత మార్గాన్ని చూపుతాడు. లక్ష్యాన్ని సాధించడానికి మనిషికి జ్ఞానాన్ని ఇస్తాడు. ఏ దొంగ దొంగిలించలేని జ్ఞానాన్ని గురువు మనకు ప్రసాదిస్తాడు. సనాతన సంప్రదాయం ప్రకారం అది జీవితానికి సంబంధించిన ఏదైనా ఆధ్యాత్మిక అభ్యాసం లేదా ఏదైనా పూజా కార్యక్రమంమైనా గురువు లేకుండా జరపలేరు. ఆ పని విజయవంతం కాదు.
గురువు లేకపోతే తల్లిని పూజించవచ్చు మీ సమీపంలో గురువు లేకపోతే మీకు జన్మనిచ్చి… నడక, నడత, మన్నన.. జీవితంలో జీవించడాన్ని మొదటిగా నేర్పిన తల్లిని పూజించవచ్చు. గురు స్థానంలో తల్లిదండ్రులను పూజించవచ్చు. తల్లిదండ్రులైన శివపార్వతులకు ప్రదక్షిణ చేసి గణేశుడు విఘ్నలకు అధిపతి అయ్యాడు. మొదట పూజలను అందుకుంటున్నాడు. పిల్లల జీవితంలో తల్లిదే ప్రధాన స్థానం.. తన పిల్లలను మంచి నడవడికతో మంచి వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. అటువంటి పరిస్థితిలో గురువు లేకపోతే మీ అమ్మను పూజించండి.
గురువు లేనప్పుడు ఏమి చేయాలంటే సనాతన సంప్రదాయంలో జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చెప్పారు. మీకు గురువు లేకపోతే తన జీవితానికి మార్గదర్శత్వం వహించిన వ్యక్తిని అధిష్టాన దేవతను తన గురువుగా భావించి, గురు పూర్ణిమ రోజున పూజించాలి. హిందువుల విశ్వాసం ప్రకారం గురు పూర్ణిమ రోజున గురువు లేనప్పుడు, విఘ్నాలకధిపతి గణేశుడు, ప్రత్యక్ష దైవం సూర్యుడు, శివుడు, శ్రీ విష్ణువు, శ్రీ కృష్ణుడు, శక్తి స్వరూపిణి దుర్గాదేవిని, శ్రీ హనుమంతుడిని గురువుగా భావించి పూజించవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).