AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indrakeeladri: పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ .. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు ప్రారంభంలోని కామధేను అమ్మవారి ఆలయం దగ్గర నుంచి దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ జరిగింది. ఈ కార్యక్రమంలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందారు. ఈ రోజు పౌర్ణమి సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు.

Indrakeeladri: పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ .. దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
giri pradakshina indrakeeladri
Surya Kala
|

Updated on: Jul 03, 2023 | 8:49 AM

Share

అరుణాచల క్షేత్రం తరహాలో ప్రతి పౌర్ణమికి ఇంద్రకీలాద్రిపై కూడా గిరి ప్రదక్షిణ చెయ్యడం ప్రారంభించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో శోభకృత్‌ నామ సంవత్సరం ఆషాడ మాస పౌర్ణమిని పురస్కరించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమం ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా సాగింది. ఈరోజు ఉదయం ఐదున్నర గంటల సమయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధల మధ్య సాగింది. ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డు ప్రారంభంలోని కామధేను అమ్మవారి ఆలయం దగ్గర నుంచి దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ జరిగింది. ఈ కార్యక్రమంలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందారు. ఈ రోజు పౌర్ణమి సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో  కిటకిటలాడింది.

ఈ కార్యక్రమంలో దుర్గగుడి పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, ఆలయ పూజారులు,  ట్రస్టు బోర్డు సభ్యులు పాల్గొని కనుక దుర్గ అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

కుమ్మరిపాలెం కూడలి, సితార, కబేళా, పాలఫ్యాక్టరీ, చిట్టి నగర్‌, కొత్తపేట, బ్రాహ్మణ మీది నుంచి ఘాట్‌రోడ్డు వరకు జరిగిన ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో భారీ సంఖ్యలో భక్తుల పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, కోలాటాల మధ్య దుర్గా మల్లేశ్వరస్వామి వారి ప్రచార రథం ముందు సాగుతుండగా.. వెనుక దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను వాహనంలో ఉంచి.. ఇంద్రకీలాద్రి చుట్టూ సుమారు 7 కిలోమీటర్లు ప్రదక్షణ చేశారు. గిరి ప్రదక్షిణ చేస్తున్న సమయంలో భక్తుల సౌకర్యార్థం మార్గంలో అధికారులు బస్సుని  ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమం లో భారీ సంఖ్యలోమహిళ భక్తులు పాల్గొన్నారు. దుర్గమ్మకు దారిపొడవునా పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించి అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. పౌర్ణమి రోజున అమ్మవారి శిఖరం చుట్టూ గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయనేది భక్తుల విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..