AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Robotic Surgery: నేటి నుంచి నిమ్స్‌లో రోబోటిక్‌ సర్జరీలు.. ప్రభుత్వాస్పత్రిలో దేశంలోనే తొలిసారి

నిమ్స్‌ ఆస్పత్రి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఇవాళ్టి నుంచి రోబోటిక్‌ సర్జరీలు అందుబాటులోకి రానున్నాయి. అయితే దేశంలో తొలిసారిగా గవర్నమెంట్ హాస్పటల్స్ లో రోబోటిక్ సర్జరీస్ కు నిమ్స్ ఆసుపత్రి వేదిక కావడం విశేషం. నిమ్స్‌లో నిపుణులైన వైద్యులుండడంతో పాటు ఎక్కువ శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి.

Robotic Surgery: నేటి నుంచి నిమ్స్‌లో రోబోటిక్‌ సర్జరీలు.. ప్రభుత్వాస్పత్రిలో దేశంలోనే తొలిసారి
Robotic Surgery In Nims
Surya Kala
|

Updated on: Jul 03, 2023 | 6:45 AM

Share

ఒకప్పుడు ఓపెన్‌ సర్జరీల…ఇప్పుడంతా రోబోటిక్‌ సర్జరీలు..టెక్నాలజీ పెరిగేకొద్దీ వైద్యరంగంలో పెనుమార్పులు వచ్చేశాయి. చాలా చోట్ల కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. కానీ..ప్రభుత్వాస్పత్రిలో ఎక్కడా అలాంటి సదుపాయాలు లేవు. ఐతే దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో రోబోటిక్‌ సర్జరీలో అందుబాటులోకి రానున్నాయి. ఆధునిక వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ సర్కార్‌ శ్రీకారం చుట్టింది.

నిమ్స్‌ ఆస్పత్రి సరికొత్త రికార్డు సృష్టించబోతోంది. ఇవాళ్టి నుంచి రోబోటిక్‌ సర్జరీలు అందుబాటులోకి రానున్నాయి. అయితే దేశంలో తొలిసారిగా గవర్నమెంట్ హాస్పటల్స్ లో రోబోటిక్ సర్జరీస్ కు నిమ్స్ ఆసుపత్రి వేదిక కావడం విశేషం. నిమ్స్‌లో నిపుణులైన వైద్యులుండడంతో పాటు ఎక్కువ శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. దీంతో నిమ్స్ లో మరింత మెరుగైన సదుపాయాలను కల్పించాలని గుర్తించిన మంత్రి హరీష్ రావు రోబోటిక్‌ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అనేకసార్లు సమీక్షలు నిర్వహించి, రోబోటిక్‌ సేవలతో మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

నిమ్స్‌లో రోబోటిక్‌ వైద్య సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం 32 కోట్ల రూపాయలు నిధులు ఖర్చు చేసింది. వైద్యనిపుణులు కంప్యూటర్‌ మానిటర్‌ సహాయంతో రోబోటిక్‌ హ్యాండ్స్‌ను వినియోగించి ఈ సర్జరీలు చేస్తారు. ఒకొక్కసారి ఆపరేషన్‌ టేబుల్‌పై శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో వైద్యులకు చేతులు అన్ని యాంగిల్స్ లో తిప్పుతూ ఆపరేషన్ చేయడం సాధ్యం కాదు. అప్పుడు రోబోటిక్ హ్యాండ్స్ తో ఆపరేషన్ పూర్తి చేస్తారు. ఇంకా చెప్పాలంటే.. రోబోటిక్ ఆపరేషన్ చేస్తున్న సమయంలో డాక్టర్స్ ఆపరేషన్ టేబుల్ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది.. రోబోటిక్ సర్జరీని కంప్యూటర్‌ మానిటర్‌లో పర్యవేక్షిస్తూ.. వాటి హ్యాండ్‌తో ఆపరేషన్స్ చేయిస్తారు.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో నిమ్స్‌లో అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీలను చేయనున్నారు. మూత్రపిండాలు, కాలేయం, లంగ్స్, గాల్‌బ్లాడర్‌, క్యాన్సర్‌ వ్యాధులకు ఆపరేషన్ ఈజీగా అదీ పెద్దగా కట్ చేయాల్సిన అవసరం లేకుండానే చేయవచ్చు అని డాక్టర్స్ చెప్పారు. నిమ్స్‌లో ఇందుకోసం 20 మంది వైద్యులకు రోబోటిక్‌ సర్జరీలపై శిక్షణ ఇచ్చారని వెల్లడించారు. క్యాన్సర్‌ శస్త్రచికిత్సల్లో వీటి ఉపయోగం ఎక్కువగా ఉంటుందన్నారు. ఖరీదైన సర్జరీని నిమ్స్‌లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగానే చేయనున్నట్లు ఆస్పత్రివర్గాలు తెలిపాయి.

పేదలకు ప్రపంచస్థాయి వైద్యసేవలు అందించాలన్న సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో నిమ్స్‌లో ఖరీదైన రోబోటిక్‌ వైద్య పరికరాలను సమకూర్చినట్లు వైద్యులు తెలిపారు. దేశంలోనే సర్కారీ దవాఖానాలకు రోల్‌మోడల్‌గా తెలంగాణ ప్రభుత్వాస్పత్రులు రూపుదిద్దుకుంటున్నాయి. భాగ్య నగరంలో ఇప్పటికే ఆధునిక సౌకర్యాలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులో ఉండగా.. రాష్ట్రంలో జిల్లాకో మెడికల్‌ కాలేజీలతో తెలంగాణ రాష్ట్రం మెడికల్‌ హబ్‌గా అవతరిస్తోంది. ప్రపంచంలో అనేక దేశాల నుంచి వైద్యం కోసం వస్తున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు