- Telugu News Photo Gallery Spiritual photos Chanakya niti due to these reasons person becomes poor in telugu
Chanakya Niti: ఈ లక్షణాలున్న వ్యక్తి జీవితాంతం పేదరికంలోనే జీవిస్తాడు.. వాటిని వదిలించుకోమంటున్న చాణక్య
తక్షశిలలో అధ్యాపకుడు ఆచార్య చాణక్యుడు తన జీవితంలో ఎదురైన అనుభవాలతో మానవ జీవితానికి సంబంధించిన అనేక విధానాలు నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. చాణక్యుడు ప్రకారం ఒక వ్యక్తి పేదరికంలో జీవించడానికి అనేక కారణాలు ఉన్నాయి. చాణక్య నీతిలో పేర్కొన్న కొన్ని అంశాలు వ్యక్తి ఆర్థిక పతనానికి దోహదపడతాయి.
Updated on: Jul 03, 2023 | 12:19 PM

కోపాన్ని నియంత్రించుకునే గుణం కలిగిన స్త్రీని పెళ్లి చేసుకున్నభర్త జీవితం ఆనందంగా సాగుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుని, ప్రకోపాలను నివారించడం సామరస్య సంబంధానికి దోహదం చేస్తుంది.

కుటుంబ ఏకీకరణ: కుటుంబంలో ఐక్యత, కలిసి ఉండాలనే భావాన్ని ప్రోత్సహించే వాతావరణాన్ని కల్పించండి. కుటుంబ సభ్యులతో కలిసి నాణ్యమైన సమయాన్ని గడపడానికి, భాగస్వామ్యులతో కలిసి వివిధ కార్యకలాపాలలో పాల్గొనే వాతావరణాన్ని కల్పించండి. అంతేకాదు విజయాలు , కెరీర్ లో మైలురాళ్లను ఫ్యామిలీ సభ్యులు అందరు కలిసి సమిష్టిగా జరుపుకునే విధంగా ప్రోత్సహించండి. ఇది కుటుంబ సంబంధాలను బలపరుస్తుంది.

వనరుల నిర్వహణ: చాణక్యుడు ప్రకారం తమకున్న ఆర్ధిక వనరులను సరిగ్గా నిర్వహించ లేకపోతే అది.. అతనికి పేదరికానికి ఒక ముఖ్యమైన కారణం. ఒక వ్యక్తి తన ఆదాయాన్ని నిర్వహించడంలో తెలివిగా ఖర్చు చేయడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడంలో విఫలమైతే.. అది ఆర్థిక ఇబ్బందులకు, చివరికి పేదరికానికి దారి తీస్తుంది.

విద్య , నైపుణ్యాలు లేకపోవడం: ఒక వ్యక్తి విజయంలో విద్య, నైపుణ్యాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని చాణక్యుడు నమ్మాడు. సరైన జ్ఞానం లేదా నైపుణ్యాలు లేకుండా వ్యక్తులు మంచి జీతంతో కూడిన ఉద్యోగాలు లేదా అభివృద్ధి కోసం అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కష్టపడాల్సి ఉంటుంది. పేదరికంలో చిక్కుకుని ఉంటారు.

వ్యసనాలు, దుర్గుణాల్లో మునిగిపోవడం: జూదం, అతిగా మద్యపానం లేదా మాదకద్రవ్యాల వినియోగం వంటి వ్యసనాలు, దుర్గుణాలు మనిషి ఆర్ధిక ఎదుగుదలకు అడ్డంకులని చాణక్యుడు హెచ్చరించాడు. ఈ అలవాట్లు ఒక వ్యక్తి ఆర్థిక వనరులను హరించి, దరిద్రంలో ఉండేలా చేస్తాయి.





























