Goddess Lakshmi: లక్ష్మీ దేవిని సిరి సంపదలకు ప్రతిరూపంగా ఎందుకు పిలుస్తారో తెలుసా? ఆసక్తికర విశేషాలు మీకోసం..!
Goddess Lakshmi: హిందూ మతంలో ప్రతి రోజు ఒక దేవతను ఆరాధిస్తారు. అందులో భాగంగానే శుక్రవారం నాడు మాతా లక్ష్మి లేవిని పూజిస్తారు.
Goddess Lakshmi: హిందూ మతంలో ప్రతి రోజు ఒక దేవతను ఆరాధిస్తారు. అందులో భాగంగానే శుక్రవారం నాడు మాతా లక్ష్మి లేవిని పూజిస్తారు. అయితే, లక్ష్మి దేవిని సిరి సంపదలకు, సంతోషం, శ్రేయస్సును ప్రసాదించే అమ్మగా ప్రజలు ఆరాధిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొందిన వ్యక్తి జీవితంలో దేనికీ లోటు ఉండదని నమ్ముతారు. అయితే, మత గ్రంధాల్లో లక్ష్మీదేవి స్వభావాన్ని చంచలమైనదిగా వర్ణించారు. లక్ష్మీ దేవి శాశ్వతంగా ఇంట్లో కొలువై ఉండాలంటే నిత్యం పూజలు చేసి అమ్మవారిని సంతోషపరచాలని అంటుంటారు. అందుకే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం కోసం ప్రజలు ప్రతి శుక్రవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఉపవాసం కూడా ఉంటారు. మరి లక్ష్మీ దేవిని సంపదల దేవత అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అమ్మవారికి అసలు ఆ కీర్తి ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం..
లక్ష్మీ దేవి జననం.. లక్ష్మీ దేవి జననానికి సంబంధించి పురాణాల్లోనే అనేక కథలు ఉన్నాయి. అయితే, లక్ష్మీ దేవి సిరి సంపదలు, సుఖ శాంతులు ప్రసాదించే దేవతగా ఎందుకు కొలుస్తారనే దానికి కూడా ఒక చరిత్ర ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. విష్ణు పురాణం ప్రకారం.. దుర్వాస మహర్షి కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరిస్తాడు. దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఏనుగుకు వేసాడు. ఆ ఏనుగు ఆ మాలను క్రిందపడవేసి కాళ్ళతో తొక్కుతుంది. దాంతో కోపోద్రిక్తుడైన దుర్వాసుడు ‘నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక’ అని శపించాడు.
దాంతో స్వర్గలోకంలో నిర్వీర్యం అయ్యింది. ఐశ్వర్యం నశించిపోయింది. ఇదే సమయంలో రాక్షసులు బలవంతులయ్యారు. రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంద్రుడు, ఇతర దేవతలు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయాలు వివరిస్తారు. ఆ తరువాత బ్రహ్మదేవుడు దేవతలను వెంటబెట్టుకొని విష్ణువు దగ్గరికి వెళ్ళి వివరిస్తారు. విష్ణువు వారికి ఒక పరిష్కారం చూపుతారు. అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, సిరి సంపదలను మళ్లీ పొందవచ్చునని, అందుకోసం క్షీరసాగరాన్ని మధించాలని విష్ణువు సలహా ఇస్తారు. అయితే క్షీరసాగర మధనం దేవతలకొక్కరికి సాధ్యమయ్యే పని కాదు. రాక్షస గనాన్ని కూడా క్షీరసాగర మధనానికి ఒప్పించి.. క్షీరసాగరాన్ని మధించడం మొదలు పెడతారు.
శ్రీ హరి సలహా మేరకు దేవతలు రాక్షసులతో కలిసి క్షీర సాగరంలో సముద్రాన్ని మథనం చేశారు. సముద్ర మథనం నుండి హాలాహలం, కామధేనువు, తెల్లని అశ్వం, ఐరావతం, కల్పవృక్షం, అమృతంతో పాటు.. లక్ష్మి దేవి కూడా జనిస్తుంది. ఆ సందర్భంగా లక్ష్మి దేవిని శ్రీ మహావిష్ణువును వరిస్తుంది. లక్ష్మి దేవి జననంతో ముల్లోకాలకు సుఖ సంతోషాలు తిరిగి వచ్చాయి. దేవతలు అమృతాన్ని సేవించి అమరులు అయ్యారు. ఇంద్రలోకంలో సరిసంపదలు మళ్లీ వచ్చాయి. అప్పటి నుంచి లక్ష్మి దేవిని సంపదలు, శ్రేయస్సు, వైభవానికి ప్రతీకగా కొలుస్తారు. ముఖ్యంగా శుక్రవారాన్ని లక్ష్మీ దేవికి ప్రతీకరమైన రోజుగా పురాణాలు పేర్కొంటాయి. అందుకే శుక్రవారం రోజు ప్రజలు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు.
Also read:
Fire Accident: మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం..
Chanakya Niti: చాణక్య చెప్పిన ఈ 5 సూత్రాలు.. మీ వ్యక్తిత్వాన్నే మార్చేస్తాయి..