Chanakya Niti: చాణక్య చెప్పిన ఈ 5 సూత్రాలు.. మీ వ్యక్తిత్వాన్నే మార్చేస్తాయి..

Chanakya Niti: సమర్థవంతమైన రాజకీయవేత్తగా, దౌత్యవేత్తగా, ఆర్థికవేత్తగా ప్రసిద్ధి చెందారు ఆచార్య చాణక్య. ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు.

Chanakya Niti: చాణక్య చెప్పిన ఈ 5 సూత్రాలు.. మీ వ్యక్తిత్వాన్నే మార్చేస్తాయి..
Chanakya
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 04, 2022 | 9:09 AM

Chanakya Niti: సమర్థవంతమైన రాజకీయవేత్తగా, దౌత్యవేత్తగా, ఆర్థికవేత్తగా ప్రసిద్ధి చెందారు ఆచార్య చాణక్య. ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. ఆయన మాటలు, ఆయన సూక్తులు ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేశాయి. అనేక గ్రంధాలను సైతం ఆయన రచించారు. చాణక్య నీతి వంటి గ్రంధాలు యావత్ మానవాళికి, మనుషుల జీవన గమనానికి దిశానిర్దేశం చేస్తాయి. ఒక వ్యక్తి ఎలా జీవించాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి వంటి అనేక అంశాలను అందులో పేర్కొన్నారు చాణక్య. ఇవాళ మనం చాణక్య చెప్పిన 5 ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. ఈ 5 విషయాలను పాటించడం ద్వారా మీ వ్యక్తిత్వమే మారుతుందని చెప్పవచ్చు.

అందం-జ్ఞానం.. మనిషి అందంగా ఉంటే సరిపోదు.. అందంతో పాటు జ్ఞానమూ ఉండాలంటారు చాణక్య. జ్ఞానం, అవగాహన లేకపోతే ఎంత అందమున్న నిష్ఫ్రయోజనమే అంటారు. ఇలాంటి వారిని అందంగా పలాస పువ్వుతో పోల్చారు చాణక్య. ఎందుకంటే.. పలాసపువ్వు చూడటానికి అందగా ఉన్నప్పటికీ.. పరిమళం ఉండదు. అందుకే ఎదుటి వ్యక్తిని అందంతో కాదు.. వారిలోని లక్షణాలతో అంచనా వేయాలని చెబుతారు చాణక్య.

ఆస్తి వారసత్వం కాదు.. ఒక వ్యక్తికి సంబంధించి ఆస్తికి వారసుడే యజమాని అనే విధానం తప్పు అంటారు చాణక్య. ఈ ఆలోచనను పూర్తిగా వ్యతిరేకించారాయన. ఆస్తిని సమర్థులకు అప్పగించాలంటారాయన. విద్యావంతులు, నైపుణ్యం ఉన్న వారికి ఆస్తిని అప్పగిస్తే సద్వినియోగం చేస్తారు. అర్హతలేని వారికి ఇస్తే.. వాటిని దుర్వినియోగం చేస్తారు. అందుకే.. ఆస్తులను అర్హులకు మాత్రమే ఇవ్వండని చెబుతున్నారు చాణక్య.

మనసును సంస్కరించుకోండి.. మనిషి తన మనస్సును సంస్కరించడం నేర్చుకున్నట్లయితే.. ఇంతకంటే గొప్ప తపస్సు మరొకటి లేదని చాణక్య నీతి చెబుతోంది. ముఖ్యంగా వ్యక్తి జీవితంలో సంతృప్తి అనేది కీలకం. సంతృప్తి పొందడం ప్రారంభిస్తే దానికి మించిన ఆనందం మరొకటి ఉండదు. దురాశను నియంత్రించుకోగలిగితే.. దానిని మించిన పెద్ద విజయం మరొకటి ఉండదు. అదే సమయంలో మనిషి దయ కలిగి ఉండటం చాలా ముఖ్యం అంటారు చాణక్య. దయ లేని మనస్సు వ్యర్థం అంటారు.

ఆహారం.. దీపం చీకటిని తినేస్తుంది.. అందుకే అది నల్లని పొగను సృష్టిస్తుంది అంటారు చాణక్య. అదే విధంగా మనం తినే ఆహారం కూడా మన మనస్సును ప్రభావితం చేస్తుందంటారు. అందుకే సాత్వికమైన మంచి ఆహార పదార్థాలను తినాలని సూచించారు ఆచార్య చాణక్య.

విద్య.. మనిషికి విద్య చాలా ముఖ్యం. విద్యను అభ్యసించిన వ్యక్తికి ఎక్కడైనా గౌరవం లభిస్తుంది. విద్యాభ్యాసం చేసిన వ్యక్తికి తప్పు, ఒప్పు మధ్య తేడాను తెలుసుకుంటారు. విద్య తెలిసిన వ్యక్తి ఎక్కడికి వెళ్లినా జ్ఞానాన్ని పంచుతారు. అందుకే వారికి ప్రతీచోటా గౌరవం లభిస్తుంది. ప్రతీ ఒక్కరూ విద్యాసముపార్జన చేయాలని సూచించారు ఆచార్య చాణక్య.

Also read:

PSL 2022: 4 ఓవర్లు, 8 సిక్సులు, 67 పరుగులు.. పాక్ మాజీ బౌలర్‌ను ఉతికారేసిన బ్యాట్స్‌మెన్స్..!

Building Collapse: నిర్మాణంలో ఉన్న మాల్ భవనం కూలి.. ఐదుగురు దుర్మరణం.. పనులు చేస్తుండగా..

Soldiers Killed: 100 మందికిపైగా సైనికులను హతమార్చాం.. సంచలన ప్రకటన చేసిన ఉగ్రవాద సంస్థ