Building Collapse: నిర్మాణంలో ఉన్న మాల్ భవనం కూలి.. ఐదుగురు దుర్మరణం.. పనులు చేస్తుండగా..
Building Collapses in Pune: మహారాష్ట్ర (Maharashtra) లోని పూణె నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం గురువారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో
Building Collapses in Pune: మహారాష్ట్ర (Maharashtra) లోని పూణె నగరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనం గురువారం అర్ధరాత్రి కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పూణే నగరంలోని ఎరవాడ పరిధిలోని శాస్త్రినగర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మాల్ ఒక్కసారిగా కూలిపోయిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కట్టర్ల సాయంతో ఐరన్ రాడ్లను కోసి కార్మికులను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. బేస్‌మెంట్‌లో అక్కడ కూలీలు పనిచేస్తుండగా ఈ ఘటన జరిగిందని తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తునట్లు తెలిపారు.
కాగా.. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కొలుకోవాలంటూ ప్రధాని మోదీ (PM Narendra Modi) ట్విట్ చేశారు.
Prime Minister Narendra Modi extends his condolences to the bereaved families of those who died in the mishap at an under-construction building in Pune https://t.co/jQmpM7GNMW pic.twitter.com/qnekeOC1Bq
— ANI (@ANI) February 4, 2022
కాగా.. గత నెల ప్రారంభంలో ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఒక బహుళ అంతస్తుల భవనం కూలి ముగ్గురు బాలికలతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు. ముంబైలోని పశ్చిమ ప్రాంతంలోని బెహ్రామ్ నగర్‌లో మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయిందని స్థానిక అధికారి తెలిపారు. వెంటనే అగ్నిమాపక దళం, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. అంతేకాకుండా గత నెల, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని తేజాజీ నగర్‌లో నిర్మాణంలో ఉన్న పాఠశాల పైకప్పు కూలిపోవడంతో 10 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు. ఆ సమయంలో 20 మంది కూలీలు నిర్మాణ స్థలంలో పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Also Read: