Drugs: అర్జెంటీనాలో విషాదం.. కల్తీ కొకైన్ తీసుకొని 20 మంది మృతి.. మరో 74 మంది..

Tainted cocaine kills 20 in Argentina: అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కాదేది కల్తీకి అనర్హం అన్నారు పెద్దలు. దాన్ని నిజం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఆఖరికి కొకైన్‌ను కూడా కల్తీ చేసి.. బానిసల ప్రాణాలు తీస్తున్నారు.

Drugs: అర్జెంటీనాలో విషాదం.. కల్తీ కొకైన్ తీసుకొని 20 మంది మృతి.. మరో 74 మంది..
Drugs
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 04, 2022 | 8:34 AM

Tainted cocaine kills 20 in Argentina: అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కాదేది కల్తీకి అనర్హం అన్నారు పెద్దలు. దాన్ని నిజం చేస్తున్నారు కొందరు అక్రమార్కులు. ఆఖరికి కొకైన్‌ను కూడా కల్తీ చేసి.. బానిసల ప్రాణాలు తీస్తున్నారు. కొకైన్‌ వంటి మాదకద్రవ్యాలను చాలా దేశాలు బ్యాన్‌ చేశాయి. కానీ, మత్తు కోసం యువత పెడదారులు తొక్కి, వాటికి బానిసలుగా మారుతున్నారు. మత్తుకు బానిసలైన వారి వీక్‌ పాయింట్‌ను క్యాష్‌ చేసుకుంటున్నారు అక్రమార్కులు. తాజాగా కల్తీ కొకైన్ తీసుకోవడం వల్ల అర్జెంటీనా (Argentina) రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో 20 మంది చనిపోయారు. మరో 74 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు. చట్టవిరుద్ధమైన ఈ మాదక ద్రవ్యాన్ని (Drugs) విషం, ఇతర పదార్థాలతో కల్తీ చేసుంటారని భావిస్తున్నారు దర్యాప్తు అధికారులు. డ్రగ్స్ తీసుకునేవారు ఎవరైనా గత 24 గంటల్లో కొకైన్ కొనుగోలు చేసుంటే, దానిని పారేయాలని బ్యూనస్‌ఎయిర్స్‌ రక్షణ మంత్రి ప్రజలకు సూచించారు.

బాధితుల్లో రాజధాని ప్రాంతానికి చెందిన హర్లింఘామ్, ట్రెస్ డీ ఫెబ్రేరో, శాన్ మార్టిన్ జిల్లాలకు చెందినవారు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కల్తీ కొకైన్‌ ఇష్యూపై హర్లింఘామ్‌లో ఆందోళనలు జరిగాయి. ఓ పోలీసు వాహనంపై దాడి చేశారు బాధితుల బంధువులు. డ్రగ్స్ వినియోగానికి సంబంధించి 2019లో విడుదలైన ఒక నివేదిక ప్రకారం, కొకైన్ వినియోగించే దేశాల్లో అమెరికా, ఉరుగ్వే తర్వాత అర్జెంటీనా మూడో స్థానంలో నిలిచింది. అయితే, మత్తు పధార్థాల కట్టడికి అర్జెంటీనా ఎన్ని చర్యలు చేపట్టినా సరైన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో అక్కడ విచ్చలవిడిగా కొకైన్‌ వంటి మాదకద్రవ్యాలు అమ్ముతున్నారు.

డిమాండ్‌ ఎక్కువగా ఉన్న టైంలో, ఇలా ఇతర పధార్థాలు మిక్స్‌ చేసి విక్రయిస్తారని అర్జెంటీనా పోలీసులు చెబుతున్నారు. అలాంటివి తీసుకోవడంతో చాలామంది ఆస్పత్రుల పాలవుతున్నారని అంటున్నారు. ఇప్పటికైనా మాదకద్రవ్యాల వినియోగాన్ని మానాలని అర్జెంటీనా పోలీసులు సూచిస్తున్నారు.

Also Read:

Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీపై దాడి కేసులో ఇద్దరు షూటర్ల అరెస్ట్.. నిందితులు ఏం చెప్పారంటే..?

Mark Zuckerberg: కుప్పకూలిన మెటా షేర్లు.. 200 డాలర్లకు పైగా డమాల్.. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్