Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీపై దాడి కేసులో ఇద్దరు షూటర్ల అరెస్ట్.. నిందితులు ఏం చెప్పారంటే..?
Attack on Asaduddin Owaisi: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కాన్వాయ్‌పై కాల్పులు జరిగిన ఘటన
Attack on Asaduddin Owaisi: ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) కాన్వాయ్‌పై కాల్పులు జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ కాల్పుల్లో అసదుద్దీన్ ఒవైసీ ప్రాణాలతో బయటపడ్డారు. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు పంక్చరైంది. మీరట్ (Meerut) లో ప్రచారం అనంతరం ఢిల్లీకి తిరిగి వస్తుండగా.. ఛాజర్సీ టోల్‌గేట్ వద్ద నిందితులు ఒక్కసారిగా కాల్పులకు తెగబ్బారు. ఈ క్రమంలో మాజీ మేయర్ హుస్సేన్ నిందితుడిపై కారు ఎక్కించారు. మొత్తం నాలుగు రౌండ్ల కాల్పులు జరిగాయి. కాగా.. ఒవైసీపై దాడి కేసులో ఇద్దరు షూటర్లను యూపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అసదుద్దీన్ ఒవైసీ హిందూ వ్యతిరేక ప్రసంగాలపై ఆగ్రహంతోనే దాడికి పాల్పడినట్టు కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన నిందితులు యూపీ పోలీసులకు వెల్లడించినట్లు యూపీ అధికారులు పేర్కొన్నారు. దాడి చేసిన వారిలో ఒకరిని అరెస్టు చేయగా, మరొకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన వారిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచారణలో ఒవైసీ హిందూ వ్యతిరేక ప్రకటనలతో బాధపడి ఈ చర్యకు పాల్పడ్డామని వారు పేర్కొన్నారని తెలిపారు. ఇంకా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తి నుంచి 9 ఎంఎం పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ తెలిపారు.
ఈ ఘటన అనంతరం అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలో మాట్లాడారు. యూపీలో ఎన్నికల ప్రచారం (UP Elections) అనంతరం తిరిగి వస్తుండగా తనపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ విషయంపై లోక్‌సభ స్పీకర్‌ను కూడా కలుస్తానని తెలిపారు. ఎన్నికల సంఘం కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎన్నికల కమిషన్‌ను అసదుద్దీన్ కోరారు. అంతేకాకుండా ఈ రోజు లోక్‌సభలో సైతం దీనిపై అసదుద్దీన్ మాట్లాడనున్నారు. దీంతోపాటు ఈ రోజు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు తెలపాలని ఎంఐఎం కార్యకర్తలకు పిలుపునిచ్చింది.
All AIMIM units across the country will be registering a peaceful protest on Friday and will be submitting memorandum to respective DMs/Commissioners seeking thorough investigation into attacks on Asad Owaisi. Also seeking highest security at his public meetings in UP.
— Imtiaz Jaleel (@imtiaz_jaleel) February 3, 2022
పాతబస్తీలో అలెర్ట్..
కాగా.. అసదుద్దీన్‌పై కాల్పులు ఘటనతో హైదరాబాద్ పోలీసులు అలెర్ట్ అయ్యారు. ఓల్డ్ సిటీ లో పోలీస్ బందోబస్తు పెంచారు. చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతం పూర్తిగా పోలీస్ వలయంలోకి వెళ్లింది. సాధారణంగా ఉండే కంటే ఎక్కువ మంది పోలీసులను మోహరించారు. అసద్‌పై కాల్పులు అనంతరం ఈ రోజు శుక్రవారం కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గస్తీని పెంచారు.
Also Read: