Gas Cylinder Offer: గ్యాస్‌ సిలిండర్‌ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. ఉచితంగా సిలిండర్‌.. ఎలా పొందాలి..!

Gas Cylinder Offer: ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ అనేది ప్రతి ఒక్కరికి అవసరమయ్యేదే. ఇక గ్యాస్‌సిలిండర్‌ను వివిధ మొబైల్‌ యాప్‌ల..

Gas Cylinder Offer: గ్యాస్‌ సిలిండర్‌ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌.. ఉచితంగా సిలిండర్‌.. ఎలా పొందాలి..!
Follow us
Subhash Goud

|

Updated on: Feb 04, 2022 | 7:55 AM

Gas Cylinder Offer: ప్రస్తుతం ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ అనేది ప్రతి ఒక్కరికి అవసరమయ్యేదే. ఇక గ్యాస్‌సిలిండర్‌ను వివిధ మొబైల్‌ యాప్‌ల ద్వారా బుకింగ్‌ చేసుకునే సౌలభ్యం ఉంది. పేటీఎం తన యూజర్లకు ఓ అద్బుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ బుక్‌ చేసుకునేవారికి గ్రేట్‌ డీల్స్‌ను ప్రకటించింది పేటీఎం. మొదటి డీల్ కింద బుక్‌ చేసుకున్న కస్టమర్లకు రూ.25 డిస్కౌంట్‌ లభిస్తుండగా, రెండో ఆఫర్ కింద రూ.30 క్యాష్‌బ్యాక్‌ను పొందే అవకాశం ఉంటుంది. ఇక మూడో ఆఫర్ కింద ఉచితంగానే యూజర్లు ఎల్‌పీజీ సిలిండర్‌ను యూజర్లు పొందవచ్చని పేటీఎం తెలిపింది.

అయితే పేటీఎం ద్వారా మాత్రమే గ్యాస్ సిలిండర్‌ బుకింగ్‌ చేసుకునేవారికి మాత్రమే ఈ అవకాశం ఉంది. పేటీఎం కస్టమర్లకు ప్రస్తుతం ఈ మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో. రూ.25 డిస్కౌంట్ కావాలనుకుంటే, ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్ చేసుకున్న వెంటనే మీకు లభిస్తుంది. ఒకవేళ రూ.30 క్యాష్ బ్యాక్ అయితే.. పేటీఎం క్యాష్ రూపంలో దీనిని పొందే అవకాశం ఉంటుంది. గ్యాస్‌ సిలిండర్‌. బుకింగ్ సమయంలో వీటి కోసం పేటీఎం పలు ప్రోమోకోడ్లను ఆఫర్ చేస్తుంది. కానీ ఉచితంగా ఎల్‌పీజీ సిలిండర్ పొందాలనుకునే వారికి.. ప్రత్యేక ప్రోమోకోడ్‌ను అందిస్తోంది పేటీఎం. ఉచితంగా పొందాలంటే కస్టమర్లు సిలిండర్‌ను బుకింగ్‌ చేసే సమయంలో FREECYLINDER అనే ప్రోమోకోడ్‌ను వాడాల్సి ఉంటుంది. అయితే సిలిండర్ బుక్ చేసుకునే సమయంలో పూర్తి మొత్తాన్ని యూజర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో గరిష్టంగా రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది పేటీఎం. యూజర్‌ ఒక్కసిలిండర్‌ మాత్రమే బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌ ఫిబ్రవరి 28వ తేదీ వరకకు అందుబాటులో ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

Rs 500 Note: రూ.500 నోటు నకిలీదా..? నిజమైనదా..? గుర్తించడం ఎలా..? ఆర్బీఐ ఏం చెబుతోంది..!

Liqour Served: అంతర్జాతీయ విమానాల్లో మద్యం ఎందుకు అందిస్తారు.. దేశీయ ఫ్లైట్లలో ఎందుకు అందించరు.?