- Telugu News Photo Gallery Business photos Know Why Liqour served in international flight instead of domestic flight know reason behind this
Liqour Served: అంతర్జాతీయ విమానాల్లో మద్యం ఎందుకు అందిస్తారు.. దేశీయ ఫ్లైట్లలో ఎందుకు అందించరు.?
Liqour Served: విమాన ప్రయాణాల్లో మద్య నిషేధం ఉంటుంది. ఎవరైనా మద్యం తాగి ప్రయాణించినట్లయితే అలాంటి వారిపై విమాన సిబ్బంది చర్యలు చేపడతారు. ప్రయాణానికి అనుమతించరు..
Updated on: Feb 02, 2022 | 10:13 AM

Liqour Served: విమాన ప్రయాణాల్లో మద్య నిషేధం ఉంటుంది. ఎవరైనా మద్యం తాగి ప్రయాణించినట్లయితే అలాంటి వారిపై విమాన సిబ్బంది చర్యలు చేపడతారు. ప్రయాణానికి అనుమతించరు. మన దేశంలో విమాన ప్రయాణాల్లో మద్యం తాగి ప్రయాణించేందుకు ఎలాంటి అనుమతి ఉండదు. ఇక అంతర్జాతీయ విమానాల్లో మాత్రం ఎలాంటిదేమి ఉండదు. కానీ అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వ్యక్తులకు మద్యాన్ని అందిస్తారు.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దేశీయ విమానాలలో మద్యం సేవించడాన్ని నిషేధించిందని, ప్రస్తుతం అంతర్జాతీయ విమానాలలో మాత్రమే మద్యం అందించబడుతుందని తెలియజేస్తున్నాము. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి.

ఇందుకు సంబంధించిన నిబంధనలకు భిన్నమైన వాదనలు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాలలో ఆల్కహాల్ అందించడానికి కారణం దాని వ్యవధి, సుదూర విమానాలలో, రిఫ్రెష్‌మెంట్ కోసం లిక్కర్‌లు అందించబడతాయని నమ్ముతారు.

అదే సమయంలో, పరిమిత మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల విమానంలో ప్రయాణించే ప్రయాణికులు బాగా నిద్రపోతారు. వారి సుదీర్ఘ అంతర్జాతీయ విమానాలు కూడా సులభంగా పూర్తవుతాయి. అందుకే మద్యం వారి సౌకర్యం కోసం మాత్రమే అందించబడుతుంది అనే వాదన కూడా ఉంది.

ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్ లో ఆల్కహాల్ ఇవ్వకూడదనే నిబంధన ఉంది. ఈ విమానాలు చాలా తక్కువ దూరం ప్రయాణిస్తాయి. ఆల్కహాల్‌కు అనుమతి ఉండదు. ఎందుకంటే ఈ విమానాల్లో ప్రయాణించే వారు తక్కువ సమయంలోనే గమ్యానికి చేరుకుంటారు. ఎక్కువ సమయం పట్టదు కాబట్టి ఆల్కహాల్ అందించరని తెలుస్తోంది. అటువంటి పరిస్థితిలో డొమెస్టిక్ ఫ్లైట్‌లలో మద్యం సేవించడం సాధ్యం కాదు.





























