Asaduddin Owaisi: యూపీలో అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు.. మూడు నుంచి నాలుగు రౌండ్లు ఫైరింగ్
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై హత్యాయత్నం జరిగింది. ఒవైసీపై ఎటాక్ కలకలం రేపుతోంది. యూపీ ఎన్నికల ప్రచారంలో అసద్‌పై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది.
UP elections: యూపీలో ఎన్నికల ప్రచారం చేస్తున్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్‌పై కాల్పులు జరిగాయి. ఈ ఫైరింగ్‌లో ఆయనకెలాంటి ప్రమాదం వాటిల్లలేదు. ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది. నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్టు భావిస్తున్నారు. మీరట్(Meerut) నుంచి తిరిగి వస్తుండగా.. ఈ కాల్పులు జరిగాయి. కాల్పుల విషయాన్ని ధ్రువీకరించారు ఒవైసీ అసదుద్దీన్. యూపీ ఎన్నికల్లో పలు స్థానాల్లో పోటీ చేస్తోంది MIM. తమ పార్టీ అభ్యర్థుల తరఫున ముమ్మర ప్రచారం చేస్తున్నారు ఒవైసీ అసదుద్దీన్. ఎస్పీ(SP), బీజేపీ(Bjp)లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఒవైసీ కాన్వాయ్‌పై దాడి జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిజారసీ(Chhajarsi) టోల్ ప్లాజా వద్ద ఒవైసీ కాన్వాయ్‌పై ఈ దాడి జరిగింది. ఫైరింగ్ చేసినవాళ్లు ఆయుధాలు అక్కడే విడిచివెళ్లినట్టు చెప్పారు ఒవైసీ. తాను అక్కడి నుంచి వేరే వాహనంలో వెళ్లిపోయినట్టు పేర్కొన్నారు.
“యూపీ మీరట్‌లోని కిథౌర్‌లో ఎన్నికల సంబంధిత కార్యక్రమం ముగించుకుని ఢిల్లీ బయలుదేరాను. చిజారసీ టోల్గేట్ వద్ద నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3-4 రౌండ్లు తూటాలు దూసుకెళ్లాయి. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంలో వెళ్లిపోయాను. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు, నలుగురు ఉన్నారు.” అని తెలిపారు అసదుద్దీన్. స్థానిక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది.
कुछ देर पहले छिजारसी टोल गेट पर मेरी गाड़ी पर गोलियाँ चलाई गयी। 4 राउंड फ़ायर हुए। 3-4 लोग थे, सब के सब भाग गए और हथियार वहीं छोड़ गए। मेरी गाड़ी पंक्चर हो गयी, लेकिन मैं दूसरी गाड़ी में बैठ कर वहाँ से निकल गया। हम सब महफ़ूज़ हैं। अलहमदु’लिलाह। pic.twitter.com/Q55qJbYRih
— Asaduddin Owaisi (@asadowaisi) February 3, 2022
గతంలో అసదుద్దీన్ తమ్ముడు అక్బరుద్దీపైనా కాల్పులు జరిగాయి. హైదరాబాద్ కేంద్రంగా అక్బరుద్దీన్‌పై ఎటాక్ జరిగింది. ఈ ఘటన నుంచి అక్బర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అక్బర్.. ఎట్టకేలకు కోలుకున్నాడు. తాజాగా అక్బర్ అన్న అసద్‌పై కాల్పులు జరిగాయి.
Also Read: మాకేదీ వినిపించదు..మాటలు కూడా రావు..! నమ్మారో ఇక అంతే!!
తిరుమలకు వెళ్లే వెంకన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. ఈరోజు నుంచే..