AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

APSRTC: తిరుమలకు వెళ్లే వెంకన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. ఈరోజు నుంచే..

Tirumala Balaji: దూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల కోసం.. ఏపీ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. తిరుపతి, తిరుమల మధ్య రాకపోకలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది.

APSRTC: తిరుమలకు వెళ్లే వెంకన్న భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ఆఫర్.. ఈరోజు నుంచే..
Ttd Apsrtc
Ram Naramaneni
|

Updated on: Feb 03, 2022 | 11:30 AM

Share

Tirumala:తిరుమల కొండపై కొలువైన వెంకన్న స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. దూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి (Tirupati), తిరుమల మధ్య రాకపోకలకు టికెట్లు ఇవ్వాలని నిర్ణయించింది. తిరుపతి- తిరుమల మధ్య ఈజీగా రాకపోకలు కొనసాగించేందుకు నూతన విధానం ప్రవేశపెట్టింది. బస్సు టికెట్‌ సహా శ్రీవారి దర్శనం టికెట్‌ బుక్‌ చేసుకున్నవారికి తిరుమలకు టికెట్లు జారీ చేయనున్నట్టు వివరించింది.  తిరుపతి బస్సులో సీటు బుక్‌ చేసుకునేటప్పుడే తిరుమల రాకపోకలకు కలిపి టికెట్లు జారీ చేయాలని నిర్ణయించింది. తిరుమల రాకపోకలకు టికెట్‌ తీసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. భక్తులు తిరుపతి వెళ్లాక అదే టికెట్‌తో తిరుమలకు రాకపోకలు చేసే అవకాశం కల్పించనున్నట్టు వివరించారు. తిరుపతి వచ్చాక 72 గంటల పాటు తిరుపతి-తిరుమల టికెట్ చెల్లుబాటవుతుందని వివరించారు. నేటి నుంచే(ఫిబ్రవరి 3) ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని చెప్పారు.  కాగా, రాష్ట్రంలో కరోనా వైరస్(Coronavirus) వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా బస్సులో ప్రయాణించే ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలని బ్రహ్మానందరెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఫిబ్ర‌వ‌రి 8న తిరుమ‌ల‌లో ఏకాంతంగా రథసప్తమి

సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం ఏకాంతంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో వాహనసేవలు ఏకాంతంగా నిర్వహిస్తారు.

రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు :

సూర్యప్రభ వాహనం ఉదయం 6 గం||ల నుంచి 8.00 గం||ల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.43 గంట‌ల‌కు)

చిన్నశేష వాహనం ఉదయం 9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు

గరుడ వాహనం ఉదయం 11.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు

హనుమంత వాహనం మధ్యాహ్నం 1.00 గం||ల నుంచి 2.00 గం||ల వరకు

చక్రస్నానం మధ్యాహ్నం 2.00 గం||ల నుంచి 3.00 గం||ల వరకు (రంగనాయకుల మండపంలో)

కల్పవృక్ష వాహనం సాయంత్రం 4.00 గం||ల నుంచి 5.00 గం||ల వరకు

సర్వభూపాల వాహనం సాయంత్రం 6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు

చంద్రప్రభ వాహనం రాత్రి 8.00 గం||ల నుంచి 9.00 గం||ల వరకు

ఆర్జిత సేవలు రద్దు

ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

Also Read: AP: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన వినూత్నమైన పడవ.. అనుమానంతో మత్స్యకారులు చెక్ చేయగా…