AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM YS Jagan: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష సమావేశం నిర్వంచారు. వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌) నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని ఆదేశించారు.

AP CM YS Jagan: ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులపై సీఎం జగన్ కీలక ఆదేశాలు
Cm Jagan
Balaraju Goud
|

Updated on: Feb 03, 2022 | 6:09 PM

Share

AP CM YS Jagan Mohan Reddy on Education: విద్యాశాఖపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష(Review) సమావేశం నిర్వంచారు. ఈ సమీక్షా సమావేశంలో పాఠశాల విద్యాశాఖ(Education Department) మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, మహిళా,శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌(AP CM YS Jagan) ఏమన్నారంటే..

వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌) నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని సూచించారు. సబ్జెక్టుల వారీగా టీచర్లు కూడా ఉండాలన్న సీఎం.. నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్‌ కారణంగా సుమారు 22 వేలమందికిపైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయన్నారు. వీరందరికీ ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. వీరి సామర్థ్యాలను మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. స్కూళ్లలో సరిపడా సిబ్బంది ఉన్నప్పుడే పురోగతి కనిపిస్తుందన్న సీఎం.. ప్రమోషన్లు, బదిలీలు ఇవన్నీకూడా పూర్తిచేసి జూన్‌నాటికి నూతన విద్యావిధానం సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్నారు.

అలాగే, ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా తీర్చిదిద్దుదామని అనుకున్నామని సీఎం జగన్ తెలిపారు. ఇప్పుడు ప్రతి మండలానికి రెండు స్కూళ్లను 2 జూనియర్‌ కాలేజీలుగా మార్చాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఒకటి కో –ఎడ్యుకేషన్‌ కోసం అయితే, ఒకటి బాలికలకోసం జూనియర్‌ కళాశాలగా మార్చాలన్నారు. ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన సిఫార్సులు అన్నీకూడా అమల్లోకి రావాలన్నారు. మండల రీసోర్స్‌ సెంటర్‌ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఎండీఓ పరిధిలో కాకుండా ఎంఈవోకే నేరుగా డ్రాయింగ్‌ అధికారాలు కట్టబెడుతూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై విద్యాసంబంధిత కార్యకలాపాలు ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సుకు సీఎం ఆమోదం తెలిపారు. అలాగే, ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు

పలురకాల ఆప్స్‌ కన్నా… రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్‌ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సును అమల్లోకి తీసుకురావాలని సీఎం సూచించారు. అటెండెన్స్‌ను ఫిజికల్‌గా కాకుండా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో తీసుకోవాలన్న సిఫార్సునూ అమలు చేయాలన్నారు. విద్యార్ధుల మార్కులనూ ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలని ఆదేశించారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు నాన్‌ అకడమిక్‌ పనులకు వినియోగించవద్దన్న ఎస్‌ఈఆర్‌టీ సూచనలకు మేరకు అంగీకరించారు. హెడ్‌మాస్టర్లను పలు రకాల మీటింగులు కాకుండా సమన్వయంకోసం నెలకు ఒకే సమావేశం ఏర్పాటు చేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ.. వీటికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు.

స్కూళ్ల నుంచి ఫిర్యాదుల పరిష్కారంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం.. సదుపాయాల లేమి, మౌలిక వసతుల మరమ్మతులు తదితర అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నాడు నేడులో ఏర్పాటుచేసిన ఏ సదుపాయాల్లో ఎలాంటి సమస్యవచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం.. స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్స్, తాగునీరు వీటి నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులపై సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. త్వరగా పనులు మొదలుపెట్టాలని విద్యాశాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 15 నుంచి పనులు మొదలుపెడుతున్నామన్న అధికారులు సీఎంకు తెలిపారు. సెప్టెంబరుకల్లా పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామన్న అధికారులు వివరించారు. జగనన్న విద్యాకానుక, టాయిలెట్ల నిర్వహణ, గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి 14417 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇది సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం.. స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్ధులకు డిక్షనరీ ఇవ్వాలని సూచించారు. ప్రతిరోజూ ఒక పదాన్ని పిల్లలకు నేర్పాలన్న సీఎం.. ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలన్నదానిపై పిల్లలకు నేర్పాలని సీఎం ఆదేశించారు. పాఠ్యప్రణాళికలో ఇదొక భాగం చేయాలని, డిజిటల్‌ లెర్నింగ్‌పైనా కూడా దృష్టిపెట్టాలని సూచించారు. ముఖ్యంగా 8,9,10 తరగతుల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ ఉండేలా చూడాలన్నారు. దీన్ని ఒక సబ్జెక్టుగా కూడా పెట్టే ఆలోచన చేయాలని విద్యా శాఖ అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.

Read Also….  AP Corona Cases: ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయి అంటే..?