MLA Balakrishna: జిల్లా కేంద్రం ఏర్పాటు కోసం రేపు హిందూపురంలో బాలకృష్ణ మౌన దీక్ష.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటన..
MLA Balakrishna: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల(AP New Districts) ఏర్పాటు పై వివాదాలు కొనసాగుతున్నాయి. జిల్లాల పునర్విభజనను కొందరూ వ్యతిరేకిస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో జిల్లాల పేర్ల..
MLA Balakrishna: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్త జిల్లాల(AP New Districts) ఏర్పాటు పై వివాదాలు కొనసాగుతున్నాయి. జిల్లాల పునర్విభజనను కొందరూ వ్యతిరేకిస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో జిల్లాల పేర్ల విషయంలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జిల్లాల ప్రకటన వచ్చిందే తడవు అనంతపురం జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. జిల్లాల ప్రకటన విషయంలో హిందూపురంకు తీవ్ర అన్యాయం జరిగిందని వైసిపీ నేతలతో పాటు.. ఇతర స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూపురంలో నిరసన సెగలు ఎగసిపడుతున్నాయి. హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలంటూ హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రేపు(ఫిబ్రవరి 4 వ తేదీ) మౌన దీక్ష చేయనున్నారు.
హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ.. రేపు ఉదయం పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌన దీక్ష చేయనున్నారు. రేపు సాయంత్రం అఖిలపక్షాల నేతలతో చర్చించి.. తదపరి ఉద్యమ కార్యచరణపై స్పష్టతనివ్వనున్నారు. తన నివాసంలో పార్టీ కార్యకర్తలతోనూ బాలకృష్ణ సమావేశం నిర్వహించనున్నారు.
హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలని ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు విషయంలో రాజకీయం చేయొద్దని ప్రభుత్వానికి హితవు పలికారు. వైసిపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతి లోక్‌సభ కేంద్రం ఒక జిల్లా కావాలని బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘అన్ని రంగాల్లో హిందూపురం అభివృద్ధి చెందిందని.. జిల్లా కేంద్రానికి అవసరమయ్యే సదుపాయాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిసర ప్రాంతాల వాసులు హిందూపురం జిల్లా కేంద్రంగా ఏర్పడుతుందని ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే హిందూపురం కేంద్రంగా సత్యసాయి జిల్లాని ప్రకటించాలి’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బాలయ్య డిమాండ్ చేశారు.
Also Read: