CM KCR at Muchintal: సమతా స్ఫూర్తి కేంద్రంలో సీఎం కేసీఆర్.. శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలపై సమీక్ష

Statue Of Equality Celebrations: చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేశారు. శ్రీరామ‌న‌గరాన్ని ప‌రిశీలించారు కేసీఆర్. 216 అడుగుల శ్రీరామానుజుల విగ్రహాన్ని ఆయన సందర్శించారు.

CM KCR at Muchintal: సమతా స్ఫూర్తి కేంద్రంలో సీఎం కేసీఆర్..  శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలపై సమీక్ష
సెక్యూరిటీ రివ్యూ తర్వాత ప్రధాన యాగశాలను సందర్శించింది KCR కుటుంబం. యాగశాలకు నమస్కరించి పరిక్రమణ చేశారు సీఎం దంపతులు. యాగశాల ప్రాంగణంమొత్తం తిరిగి పరిశీలించారు. పెరుమాళ్లను దర్శించుకున్నారు. సహస్రాబ్ది వేడుకలు జరుగుతున్నతీరు.. ఏర్పాట్లును అడిగి తెలుసుకున్నారు.
Follow us

|

Updated on: Feb 03, 2022 | 7:22 PM

CM KCR Attend Statue Of Equality Celebrations: ముచ్చింతల్‌లో సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బృహాత్తర కార్యక్రమం.. ఫిబ్రవరి 2 తేదిన ఆరంభమైన ఈ మహోత్సవం ఫిబ్రవరి 14 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 13 రోజులపాటు జరిగే సహస్రాబ్ది సమారోహంలో భాగంగా యాగశాలలో జరగాల్సిన 1035 కుండాలతో శ్రీ లక్ష్మీనారాయణ యాగ కార్యక్రమం జరుగుతోంది. స‌హ‌స్రాబ్ది స‌మారోహం వేడుక‌లో రెండో రోజు జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు.

చిన‌జీయ‌ర్ స్వామి ఆశ్ర‌మానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విచ్చేశారు. సమతా క్షేత్రంలో మహోత్కృష్టమైన సహస్రకుండాత్మక శ్రీ లక్ష్మీనారాయణ యాగ మహాక్రతువులో సీఎం పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా శ్రీరామ‌న‌గరాన్ని ప‌రిశీలించారు కేసీఆర్. 216 అడుగుల శ్రీరామానుజుల విగ్రహాన్ని ఆయన సందర్శించారు. సీఎం కేసీఆర్‌కు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు రుత్వికులు. సీఎంతో పాటు చిన‌జీయ‌ర్ స్వామి, మైహోమ్ అధినేత రామేశ్వ‌ర‌రావు ఉన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ న‌డుచుకుంటూ సెక్యూరిటీ సెంట‌ర్‌కు వెళ్లారు. ఇలాంటి శాంతి సందేశం జాతికి, యావత్ దేశానికి అవ‌స‌రమని సీఎం కేసీఆర్ అన్నారు. కాగా ఈ కార్య‌క్ర‌మంలో వైసీపీ ఎమ్మెల్యే రోజా, చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిలు కూడా పాల్గొన్నారు.

కాగా, ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరు కానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్ష లో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర,పోలీసు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్‌ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో ఏర్పాటు చేసిన పోలీసుల కమాండ్‌ కంట్రోల్‌ రూంను సీఎం పరిశీలించారు.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు