Statue of Equality: ముచ్చింతల్‌కు సీఎం కేసీఆర్.. ఆధ్యాత్మిక దివ్యక్షేత్రంలో శ్రీలక్ష్మీనారాయణ యాగానికి హాజరు
12 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువులో రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారాయణయాగం నిర్వహించనున్నారు.

Statue of Equality: హైదరాబాద్(Hyderabad) మహానగర శివార్లలోని శంషాబాద్ సమీపం ముచ్చింతల్(Muchintal)లో ఆధ్యాత్మిక చరిత్రపుటల్లో సువర్ణాక్షాలతో లిఖించబడే అధ్యాయం ఆరంభమైంది. సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల (SriRamanujacharya) సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామివారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అద్భుతకార్యక్రమం ఫిబ్రవరి 2 తేదిన ఆరంభమైన ఈ మహోత్సవం ఫిబ్రవరి 14 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. 13 రోజులపాటు జరిగే సహస్రాబ్ది సమారోహంలో భాగంగా యాగశాలలో జరగాల్సిన 1035 కుండాలతో శ్రీ లక్ష్మీనారాయణ యాగ కార్యక్రమం జరుగుతోంది.
13 రోజులపాటు జరగనున్న ఈ మహాక్రతువులో రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనారాయణయాగం నిర్వహించనున్నారు. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్న ముచ్చింతల్ సమతా క్షేత్రంలో మహోత్కృష్టమైన సహస్రకుండాత్మక శ్రీ లక్ష్మీనారాయణ యాగ మహాక్రతువుకు అంకురార్పణ జరిగింది.ఈ యాగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొననున్నారు. యాగశాలలో అగ్నిహోత్రం ఆవిష్కరణ, 1035 కుండలాల్లో శ్రీ లక్ష్మీ నారాయణ హోమం జరుగుతుంది. ఈ హోమాన్ని ఐదు వేల మంది రుత్వికులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జీయర్ స్వాములు, భక్తులు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఈ యాగం పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్ నుంచి శంషాబాద్‌కు బయలు దేరారు.
రామానుజాచార్య సమారోహంలో భాగంగా 12 రోజులపాటు నిర్వహంచనున్న మహా యజ్ఞం కోసం మొత్తంగా 1.5 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వినియోగించనున్నారు. ఈ నెయ్యి మొత్తాన్ని రాజస్థాన్ రాష్ట్రం పాత్‌మెడాలోని పూర్తి స్వదేశీ ఆవులను తీసుకొచ్చి ముచ్చింతల్, తాండూరులలోని వ్యవసాయ క్షేత్రాల్లో పోషిస్తూ వాటి పాల నుంచి సంప్రదాయ పద్ధతుల్లో తయారుచేశారు. త్రిదండి చినజీయర్‌స్వామి మార్గనిర్దేశకత్వంలో దాదాపు 6 నెలల ముందునుంచే యజ్ఞం కోసం నెయ్యిని సిద్ధం చేయడం మొదలుపెట్టడం విశేషం. యజ్ఞ సమిధలను సైతం శాస్త్రబద్ధంగా తయారుచేశారు.

1

2
ధ్వజస్తంభంపై గరుత్మంతుడు పఠం ఆవిష్కరణ సహస్రాబ్ది లో రెండోరోజు యజ్ఞ ఆచార్యుల చే అగ్ని మథనం,అగ్ని ప్రతిష్ఠ జరిగింది. ప్రధాన యాగశాలలో జరిగే మహా కార్యక్రమం ని వీక్షించేందుకు ధ్వజస్తంభం పై గరుత్మంతుడు పఠాన్ని ఎగరవేశారు. దీని ద్వారా అందరూ దేవుళ్లను గరుత్మంతుడు పిలుస్తారు. 13రోజుల పాటు జరిగే 1035 కుండాల యజ్ఞం ఎలాంటి ఆటంకం కలగకుండా జరగాలని గరుడ పఠం ఆవిష్కరణ… గరుడ పఠం ఆవిష్కరణ తరవాత, గరుడ ముద్ద ప్రసాద వితరణ జరిగింది. సంతాన కోసం ఎదురుచూస్తున్న దంపతులకు గరుడ ముద్ద ప్రసాదం తీసుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది అని ప్రసిద్ధి.

3
కమాండ్ కంట్రోల్ రూం ద్వారా ప్రత్యేక నిఘా ఇదిలావుంటే, ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ హాజరు కానున్న నేపథ్యంలో ఎస్‌పీజీకి చెందిన ప్రత్యేక భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. సమతామూర్తి విగ్రహ ప్రాంగణానికి ముందు పార్కింగ్ ఏరియాకు ఎదురుగా ఉన్న భవనంలో పోలీసుల కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి పోలీసుల భద్రత ఏర్పాట్లు, ఇతర సమాచారాలన్నింటికి కూడా కమాండ్ కంట్రోల్ రూం పనిచేయనుంది. ఎస్‌పీజీతో పాటు ఆక్టోపస్, ప్రత్యేక కమాండోలు భద్రత కోసం రంగంలోకి దిగారు. ఇప్పటికే సమతామూర్తి ప్రాంగణంతో పాటు యాగశాల పరిసరాల్లో వీరు నిరంతరం నిఘా కాస్తున్నారు.
ఉత్సవాలకు ప్రత్యేక అశ్వాలు సమతామూర్తి సహస్రాబ్ధి సమరోత్సాహ వేడుకల్లో భాగంగా దేవతా మూర్తుల రథోత్సవం వేళ ముందుగా నడిపించేందుకు ఏపీలోని కడప వ్యాసాశ్రమం నుంచి రెండు శ్వేత రంగు అశ్వాలను రప్పించారు. రంగ, గోధ అనే పేర్లుగల ఈ అశ్వాలను ఆశ్రమంలో దేవతామూర్తుల బయటికి తీసుకొచ్చే సమయంలో ముందుగా నడిపిస్తుంటారు. వీటితో పాటు చిన్న జీయర్ ఆశ్రమంలో ఉన్న మరో అశ్వం యతి కూడా ఉత్సవాల్లో పాల్గొననుంది. ఈ అశ్వాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు.
టీటీడీ ప్రత్యేక సేవలు ముచ్చింతల్‌లో జరుగుతున్న సహస్రాబ్ధి సమారోహంలో తిరుమల తిరుపతి దేవస్థానం తమ వంతు పాత్ర పోషిస్తోంది. ప్రాంగణంలో తిరుమల తిరుపతి ప్రాసస్త్యం, తిరుమల నాడు–నేడు వ్యత్యాసాలు తెలిపే పలు ఛాయా చిత్రాలతో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. చిత్ర ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నారు. విభిన్న రకాల కార్యక్రమాల్లో సహకరించేందుకు తితిదే సిబ్బంది 35 మంది రెండు వారాల పాటు ఇక్కడే ఉండనున్నారు. వీరు కాక దాదాపు 500 మంది వేద పారాయణం చేసేవారు, మ్యూజిక్ కాలేజ్ నుంచి ఆర్టిస్టులు, హరికథ కళాకారులు, మంగళవాద్యాలు మోగించే కళాకారులు 15 మంది వచ్చారు. వీరి కార్యకలాపాలను తితిదే తెలంగాణ ప్రాజెక్ట్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు.
