- Telugu News Photo Gallery Spiritual photos Which direction of the house furniture should be placed know Vastu rules related to furniture in telugu
Vastu Rules: ఇంట్లో ఫర్నిచర్ ఎలా పెట్టాలి.. ఏ దిశలో పెట్టాలి.. వాస్తు నియమాలు తెలుసుకోండి!
Vastu Rules: ఇంటిని అందంగా చూపించడంలో ఫర్నిచర్(Furniture) కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే కాలంలో వచ్చిన మార్పుల్లో భాగంగా అనేక రకాల ఫర్నిచర్లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫర్నిచర్ ను ఎల్లప్పుడూ వాస్తు ప్రకారం(Vastu Tips) కొనుగోలు చేయాలి. వాటిని ఉంచే దిశ కూడా వాస్తు నియమాల ప్రకారం ఉండాలి, అప్పుడు కుటుంబంలో ఆనందం, సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది.
Updated on: Feb 03, 2022 | 4:42 PM

వాస్తు శాస్త్రం ప్రకారం, తేలికపాటి ఫర్నిచర్ ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచాలి. అయితే భారీ ఫర్నీచర్‌ను దక్షిణం లేదా పడమర దిశలో ఉంచాలి. ఒకొక్కసారి ఇంట్లో ఏ దిక్కులోనూ ఫర్నిచర్ పెట్టుకునే వీలుండదు.. అటువంటి సమయంలో ఇంట్లో గోడకు దాదాపు 06 నుండి 08 అంగుళాల దూరంలో ఏర్పాటు చేసుకోవాలి.

చెక్క ఫర్నిచర్ శుభప్రదమైనది, ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. రావి, మర్రి, గంధపు చెక్కలను హిందూ మతంలో చాలా గౌరవంగా భావిస్తారు. కనుక వీటితో తయారు చేసిన ఫర్నిచర్ ను ఇంట్లో ఎప్పుడూ ఉంచవద్దు. ఇవి ఇంటిలో ప్రతికూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అయితే వీటి చెక్కని ఇంట్లోని పూజా మందిర నిర్మాణానికి ఉపయోగించవచ్చు

వాస్తు ప్రకారం, ఇనుము లేదా ప్లాస్టిక్ ఫర్నిచర్ కొనకూడదు. ఈ రోజుల్లో చాలా మంది ఐరెన్, లేదా ప్లాస్టిక్ ఫర్నిచర్ కొనుచేయడం సర్వసాధారణం. అయితే ఈ ఫర్నిచర్ ఇంట్లో ప్రతికూలతను పెంచుతుంది. దీంతో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ తగ్గి గొడవలు పెరుగుతాయి.

ఫర్నిచర్ కొనుగోలు చేసే రోజును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మంగళ, శని, అమావాస్య రోజుల్లో ఫర్నీచర్ కొనకూడదు.

ఫర్నిచర్ యొక్క మూలలు పదునైనవిగా ఉండకూడదు. గుండ్రంగా ఉండాలి. రౌండ్ ఫర్నిచర్ ప్రజల మధ్య ప్రేమను, కుటుంబంలో సానుకూలతను పెంచుతుంది. గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ పాఠాకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని.. మత విశ్వాసాలు నమ్మకంపై ఆధారపడి ఇచ్చింది.




