AP Job Mela: ఏపీలో రేపు జాబ్ మేళా.. ఇంటర్వ్యూ ఎక్కడ జరగనుంది.? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి.?
AP Job Mela: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) పలు ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. మాటార్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలోనని ఖాళీలను భర్తీ చేయడానికి శుక్రవారం ఈ జాబ్‌మేళాను నిర్వహించనున్నారు..
AP Job Mela: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) పలు ఉద్యోగాల భర్తీకి జాబ్‌మేళాను నిర్వహిస్తోంది. మాటార్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలోనని ఖాళీలను భర్తీ చేయడానికి శుక్రవారం ఈ జాబ్‌మేళాను నిర్వహించనున్నారు. జాబ్‌మేళాలో భాగంగా మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? జాబ్‌మేళాకు ఎలా హాజరు కావాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* ఈ జాబ్‌మేళాలో భాగంగా టీఐజీ వెల్డర్ (75), సీఎన్‌జీ మైనింగ్ ఆపరేటర్ (75) పోస్టులను భర్తీ చేయనున్నారు.
* టీఐజీ వెల్డర్ విభాగంలో 75 ఖాళీలు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత విభాగంలో 0-5 ఏళ్ల అనుభవం ఉండాలి. పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
* సీఎన్‌జీ మైనింగ్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఐటీఐ/డిప్లొమా(మెకానికల్) పూర్తి చేసిండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సీఎన్‌జీ శిక్షణ పొంది ఉండాలి. పురుషులు మాత్రమే అర్హులు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా రెజ్యూమే, విద్యార్హతల జిరాక్స్ కాపీలు, ఆధార్ కార్డు, పాన్‌కార్డ్, బ్యాంక్ పాస్ బుక్‌ను వెంట తెచ్చుకోవాలి.
* ఇంటర్వ్యూలు విజయవాడలోని ఆంధ్రా లయోలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నిర్వహించనున్నారు.
* అభ్యర్థులు సంబంధిత చిరునామాకు ఫిబ్రవరి 4న ఉదయం 9.30 గంటలకు రిపోర్ట్ చేయాలి.
* అభ్యర్థులు పూర్తి వివరాల కోసం 9533322271, 8247766718 నంబర్ ను సంప్రదించాలి.
* ఇంటర్వ్యూకు హాజరయ్యే ముందుగా ఈ లింక్‌ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
@AP_Skill has Collaborated with #MTARTechnologiesPvtLtd to Conduct #ICSTP Program at #Vijayawada
Job Location : #Hyderabad
Registration Link: https://t.co/XnrotfY4b3
Contact: Mr. Siva Nagaraju – 9533322271 Mr. Ashok – 8247766718 APSSDC Helpline : 9988853335 pic.twitter.com/OQb7NK6ir7
— AP Skill Development (@AP_Skill) January 29, 2022
Inspiring story: మట్టిలో మాణిక్యం ఈ అంజనమ్మ.. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మేకల కాపరి కూతురు..