Rashmika Mandanna: కొత్త ఇంట్లోకి మారుతోన్న కన్నడ ముద్దుగుమ్మ!.. సామాన్లు ప్యాక్‌ చేసుకోవడం కష్టంగా ఉందంటూ..

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రస్తుతం ఫుల్‌ స్పీడ్‌లో ఉంది.'పుష్ప'(Pushpa)  తో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తమిళం సహా హిందీలోనూ వరుస సినిమాలు చేస్తోంది.

Rashmika Mandanna: కొత్త ఇంట్లోకి మారుతోన్న కన్నడ ముద్దుగుమ్మ!.. సామాన్లు ప్యాక్‌ చేసుకోవడం కష్టంగా ఉందంటూ..
Rashmika Mandanna
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2022 | 6:23 PM

కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ప్రస్తుతం ఫుల్‌ స్పీడ్‌లో ఉంది.’పుష్ప'(Pushpa)  తో మరో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తమిళం సహా హిందీలోనూ వరుస సినిమాలు చేస్తోంది. సినిమాలతో పాటు సోషల్‌ మీడియా(Social media) లోనూ చురుగ్గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌ గా మారింది. ‘సామాన్లు ప్యాక్‌ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. అయితే నా పనులు నేను చేసుకోవడం నాకు చాలా ఇష్టం’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ లో ఓ పోస్ట్‌ పెట్టింది. దీంతో రష్మిక కొత్త ఇల్లు కొనుక్కుందా? అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది.

ప్రస్తుతం హిందీలో’మిషన్ మజ్ను’, ‘గుడ్ బై’ అనే చిత్రాల్లో నటిస్తోంది రష్మిక. ఈ సినిమా షూటింగ్‌ ల కోసం ఎక్కువగా ముంబయిలోన ఉంటోంది. ఈ నేపథ్యంలో హోటళ్లలో ఉండే బదులు సొంతంగా ఓ ఇంట్లోకి మారే ప్రయత్నాల్లో ఉందీ ముద్దుగుమ్మ. అయితే గతేడాది ఫిబ్రవరిలోనే రష్మిక ముంబయిలో ఓ ఇం‍టిని కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఇన్‌స్టా పోస్ట్‌ ను చూస్తోంటే ఆ ఇంటి గృహప్రవేశం పనుల్లోనే రష్మిక బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో ఆమె శర్వానంద్‌ తో కలిసి నటిస్తోన్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం షూటింగ్‌ ఇటీవలే పూర్తైంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు త్వరలోనే ‘పుష్ప’ సీక్వెల్‌ ‘పుష్ప: ది రూల్‌’ షూటింగ్‌ లో జాయిన్‌ కానుంది. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటివారంలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని సమాచారం.

Also Read:RRR Movie: మరో 50 రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అంటూ కొత్త పోస్టర్‌ ను రిలీజ్‌ చేసిన జక్కన్న టీం..

Allu Arjun: పునీత్‌ రాజ్‌కుమార్‌ కు నివాళి అర్పించిన అల్లు అర్జున్.. కుటుంబ సభ్యులకు పరామర్శ..

Allu Arjun: పుష్పతో అంతకంతకూ పెరుగుతోన్న బన్నీ పాపులారిటీ.. ఆ విషయంలో రజనీని అధిగమించిన అల్లు అర్జున్‌..