AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AHA Unstoppable: సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్‌? బాలయ్య ప్రశ్నకు మహేశ్‌ రియాక్షన్‌ చూడండి..

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతోన్న 'అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే (UnstoppableWithNBK)' ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు.

AHA Unstoppable: సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్‌? బాలయ్య ప్రశ్నకు మహేశ్‌ రియాక్షన్‌ చూడండి..
Aha Unstoppable
Basha Shek
|

Updated on: Feb 03, 2022 | 7:39 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) హోస్ట్‌గా ‘ఆహా’ ఓటీటీలో ప్రసారమవుతోన్న ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే (UnstoppableWithNBK)’ ఏ రేంజ్‌లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన పనిలేదు. వెండితెరపై తనదైన నటనతో మెప్పించే బాలయ్య వ్యాఖ్యాతగా మారి తోటి నటీనటులను ఇంటర్వ్యూ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఈ షో IMDBలోని టాప్ 10 రియాలిటీ టీవీ జాబితాలో స్థానం దక్కించుకుంది. కాగా ఇప్పటికే 9 ఎపిసోడ్‌లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ టాక్‌షో ఇప్పుడు గ్రాండ్‌ ఫినాలేలోకి అడుగుపెట్టింది. ఫినాలే ఎపిసోడ్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) సందడి చేయనున్నారు. ఆయనతో పాటు స్టార్‌ డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి సైతం ఈ షోకు అతిథిగా విచ్చేశారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలై అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఫైనల్‌ ఎపిసోడ్‌ రేపు( ఫిబ్రవరి4) ప్రసారం కానున్న నేపథ్యంలో తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన స్పెషల్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు టాక్‌ షో నిర్వాహకులు.

నా డైలాగ్ నీ గొంతుతో వినాల‌నుంద‌య్యా! బాలయ్య సరదా సంభాషణలకు తోడు మహేశ్‌ స్పాంటేనియస్‌ సమాధానాలతో సాగిన ఈ ప్రోమో ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. ‘ఇంత యంగ్‌గా ఉన్నావేంట‌య్యా బాబు.. నాదో చిన్న కోరిక.. నా డైలాగ్ నీ గొంతుతో వినాల‌నుంద‌య్యా’ అంటూ బాలయ్య మ‌హేశ్‌ను అడగడంతో మొదలైంది ప్రోమో. దీనికి ‘మీ డైలాగ్ మీరు త‌ప్ప ఇంకెవ‌రు చెప్పలేరు సార్‌’ అని మ‌హేశ్ రిప్లై ఇచ్చాడు. ‘చిన్నప్పుడు నువ్వు చాలా నాటీ కిడ్‌వ‌ని విన్నాను. చేసేవ‌న్నీ చేస్తావ్‌..చెప్పమంటే ఇలా సిగ్గుపడతావ్‌’ అనగానే మహేశ్‌ సిగ్గుపడిపోవడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ‘సూపర్‌ స్టార్‌ అయిపోయావ్‌.. సడెన్‌ గా మూడేళ్లు గ్యాప్‌ తీసుకున్నావ్‌. ఏంటి? అని బాలకృష్ణ అడగ్గా ‘ఆ మూడేళ్లు నన్ను నేను క‌రెక్ట్ చేసుకోవ‌డానికి తీసుకున్నా. దాని త‌ర్వాత మ‌ళ్లీ తిరిగి ఆలోచించాల్సిన అవసరం రాలేదు’ అని మహేశ్‌ సమాధానం చెప్పాడు. అదేవిధంగా ‘వెకేష‌న్ అని చెప్పి డైరెక్టుగా పెళ్లి చేసుకున్నావ్..ఏంటి అంత సీక్రెటా? ‘అంటూ మ‌హేశ్ పెళ్లి గురించి కూడా ఆరా తీసే ప్రయత్నం చేశారు బాలయ్య. ఇలా బాలయ్య- మహేశ్‌ల సరదా సంభాషణలతో సాగిన ఈ ప్రోమోను చూసి అభిమానులు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఫుల్‌ ఎపిసోడ్‌ వస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోన్న నటసింహం, సూపర్‌ స్టార్‌ల ప్రోమోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Also Read:Rashmika Mandanna: కొత్త ఇంట్లోకి మారుతోన్న కన్నడ ముద్దుగుమ్మ!.. సామాన్లు ప్యాక్‌ చేసుకోవడం కష్టంగా ఉందంటూ..

Allu Arjun: పునీత్‌ రాజ్‌కుమార్‌ కు నివాళి అర్పించిన అల్లు అర్జున్.. కుటుంబ సభ్యులకు పరామర్శ..

RRR Movie: మరో 50 రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా.. కౌంట్‌డౌన్‌ స్టార్ట్ అంటూ కొత్త పోస్టర్‌ ను రిలీజ్‌ చేసిన జక్కన్న టీం..