AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Joe Biden: ఐఎస్ చీఫ్ అల్‌ ఖురేషీ హతం.. ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌

ISIS leader abu ibrahim al quraishi killed: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ప్రత్యేక దళాలు బుధవారం రాత్రి వాయువ్య సిరియాలో జరిపిన మెరుపు దాడుల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ (ISIS) చీఫ్‌

Joe Biden: ఐఎస్ చీఫ్ అల్‌ ఖురేషీ హతం.. ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌
Isis Leader Abu Ibrahim Al
Shaik Madar Saheb
|

Updated on: Feb 04, 2022 | 6:36 AM

Share

ISIS leader abu ibrahim al quraishi killed: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా ప్రత్యేక దళాలు బుధవారం రాత్రి వాయువ్య సిరియాలో జరిపిన మెరుపు దాడుల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూప్‌ (ISIS) చీఫ్‌ అబూ ఇబ్రహీం అల్‌ హషిమీ అల్‌ ఖురేషీ హతమైనట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ (Joe Biden) తెలిపారు. రెబెల్స్‌ అధీనంలోని వాయవ్య ఇద్లిబ్‌ ప్రావిన్స్‌లోని అట్మీలో ఖురేషీ దాగున్న రెండంతస్తుల ఇంటిపై ప్రత్యేక దళాలు ఒక్కసారిగా విరుచుకుడిపట్లు అధికారులు వెల్లడించారు. ఐఎస్‌ ఉగ్రవాదులకు, భద్రతా దళాల మధ్య రెండు గంటల పాటు జరిగిన హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఐఎస్‌ చీఫ్‌ అబూ ఇబ్రహీం అల్‌-హష్మి అల్‌-ఖురేషి హతమయ్యాడని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ట్విట్టర్ వేదికగా తెలిపారు.

ఈ ఆపరేషన్‌లో అమెరికా సైనికుడు ఎవరూ కానీ సైనిక సిబ్బంది కానీ గాయపడలేదు.. ఆపరేషన్‌ తర్వాత సిబ్బంది సురక్షితంగా తిరిగి వచ్చారని జో బైడెన్ తెలిపారు. అమెరికా సేనల దాడులు చేస్తున్నపుడు.. ఆ దాడుల్లో మరణించకుండా ఖురేషీ (abu ibrahim al quraishi) బాంబుతో పేల్చుకున్నాడన్నారు. ఈ పేలుడులో అతని కుటుంబ సభ్యులు కూడా చనిపోయారని వైట్‌హౌస్‌ అధికారి తెలిపారు. బాంబు దాడుల్లో ఇల్లు పూర్తిగా నేలమట్టమైందని పేర్కొన్నారు.

అమెరికా సైన్యం దాడుల్లో ఖురేషీతో పాటు మరో 13 మంది మరణించారని వైట్‌హౌస్ అధికారి తెలిపారు. మృతుల్లో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారని సిరియా మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. కాగా, ఐఎస్‌ వ్యవస్థాపకుడు అబూ బకర్‌ అల్‌ బగ్దాదీ 2019లో హతమైన తర్వాత అతని వారసుడిగా ఖురేషీని ఉగ్రవాద సంస్థ నియమించింది. అతడి సమాచారం తెలిపితే రూ.74 కోట్ల బహుమతి ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా గతంలో ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా జరిపిన దాడుల్లో ఖురేషీ సైతం అచ్చం బగ్దాదీ లానే తనకు తాను బాంబు పేల్చుకొని మరణించాడు.

Also Read:

Pakistan: చైనా పర్యటనకు ముందు పాక్ లోని రెండు సైనిక స్థావరాలపై ఉగ్రమూకల దాడి.. వందమంది సైనికులు మృతి..

Covid Vaccine: అమెరికా ఆర్మీ సంచలన నిర్ణయం.. కోవిడ్‌ టీకా తీసుకోని 3,300 మంది సైనికులను తొలగించాలని నిర్ణయం..!