AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Virus: అమెరికాలో తగ్గుముఖం పట్టిన కరోనా..అగ్రరాజ్యంలో పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావం అధికం..

Corona Virus: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అగ్రరాజ్యం అమెరికా(America)లో కూడా కోవిడ్ 19 (Covid-19) కల్లోలం సృష్టించింది. సెకండ్ వేవ్ డెల్టా తర్వాత ఓమిక్రాన్(Omicron) వేరియంట్ కూడా..

Corona Virus: అమెరికాలో తగ్గుముఖం పట్టిన కరోనా..అగ్రరాజ్యంలో పిల్లలపై ఒమిక్రాన్ ప్రభావం అధికం..
Surya Kala
|

Updated on: Feb 03, 2022 | 9:43 PM

Share

Corona Virus: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అగ్రరాజ్యం అమెరికా(America)లో కూడా కోవిడ్ 19 (Covid-19) కల్లోలం సృష్టించింది. సెకండ్ వేవ్ డెల్టా తర్వాత ఓమిక్రాన్(Omicron) వేరియంట్ కూడా ఆదేశంలో భారీగా కేసులు నమోదయ్యాయి. అయితే ఇప్పుడు అమెరికా ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది అక్కడ ప్రభుత్వం. గత వారం కంటే ఈ వారంలో కొత్తగా నమోదైన కరోనా కేసులు గణనీయంగా తగ్గాయని.. గణాంకాలను చూస్తే.. కరోనా కేసులు 52 శాతం తగ్గాయని పేర్కొంది. బుధవారం 3.46 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ బారిన పడి 3,365 మంది ప్రాణాలు కోల్పోయారు.

కరోనా వైరస్ ప్రభావం అమెరికాపై భారీగా పడింది. ఈ దేశంలో ఇప్పటివరకు 76 మిలియన్ల మందికి పైగా ప్రజలు కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో కరోన బారిన పడ్డారు. ఇప్పటివరకు 9 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య కూడా అత్యధికం.

ఓమిక్రాన్ విధ్వంసం : కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ అమెరికాపై భారీ ప్రభావం చూపించింది. ముఖ్యంగా ఈ వైరస్‌ బారిన పడుతున్న చిన్నారుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత నెల జనవరిలో 35 లక్షల మందికి పైగా చిన్నారుల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జిన్హువా వార్తా సంస్థ నివేదిక ప్రకారం, అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (AAP), చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్ సోమవారం ఒక నివేదికను విడుదల చేశాయి. ఈ నివేదికలో 2020లో దేశంలో అంటువ్యాధి ప్రారంభమైనదని.. అప్పటి నుండి 114 మిలియన్లకు పైగా పిల్లలు కరోనా పాజిటివ్ బారిన పడ్డారని పేర్కొంది.

కరోనా ఎఫెక్ట్.. దేశంలో అప్పులు కరోనా ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాన్ని ఎంతగానో ప్రభావితం చేసింది. మొత్తం జాతీయ రుణ భారం రికార్డు స్థాయిలోపెరిగిపోయింది. అప్పులు $ 30 ట్రిలియన్లకు మించిపోయాయి. ఈ లెక్కలను అమెరికా ప్రభుత్వ పరిధిలోని ట్రెజరీ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన డేటా ప్రకారం, మొత్తం రుణ రేటు జనవరి 31 వరకు ఉంది. ఇది గత సంవత్సరం 2020 జనవరి కంటే దాదాపు $7 ట్రిలియన్లు ఎక్కువ. ఆ సమయంలో కరోనా వైరస్ దేశ ఆర్థిక వ్యవస్థపై అంతగా ప్రభవితం చేయలేదని పేర్కొంది.

Also Read:

 ఉద్యోగులు రోడ్డు మీదకు రావడం బాధ కలిగించింది.. వారికిచ్చిన హామీలను నెరవేర్చాలి : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌