AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puran: గరుడ పురాణం ప్రకారం స్త్రీలు పొరపాటున కూడా ఈ 4 పనులు చేయవద్దట.. ఎందుకంటే

సనాతన ధర్మంలో స్త్రీని దైవ స్వరూపంగా భావించింది. ఎక్కడ స్త్రీలు పూజింప బడతారో.. ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు అని పేర్కొంది. అంతేకాదు మానసికంగా పురుషులకంటే స్త్రీలు బలవంతులు.. శారీరకంగా బలహీనులు కనుక రక్షణ కోసం సమాజంలో స్త్రీలు నడుకుచుకునే విధానంలో కొన్ని నియమాలను ఏర్పాటు చేసింది. గరుడ పురాణం ప్రకారం స్త్రీలు తమ జీవితంలో కొన్ని పనులను ఎప్పుడూ చేయకూడదు. కాదని చేస్తే ఆ పనుల కారణంగా ఆ స్త్రీతో పాటు భర్త కుటుంబం కూడ ఇబ్బంది పడాల్సి ఉంటుంది తెలిపింది. కనుక ఈ రోజు గరుడ పురాణం ప్రకరం స్త్రీలు చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం..

Garuda Puran: గరుడ పురాణం ప్రకారం స్త్రీలు పొరపాటున కూడా ఈ 4 పనులు చేయవద్దట.. ఎందుకంటే
Garuda Puran
Surya Kala
|

Updated on: Jun 06, 2025 | 4:32 PM

Share

హిందూ మతంలో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 18 పురాణాల్లో గరుడ పురాణం ఒకటి. గరుడ పురాణం మరణం, పునర్జన్మ, ఆత్మలు, నరకం, భయంకరమైన శిక్షల సహా అన్ని రహస్యాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఈ గరుడ పురాణాన్ని పఠిస్తారు. దీనిని ఇంటి పూజారి లేదా బ్రాహ్మణుడు చదువుతారు. గరుడ పురాణం మనిషి జీవితం పరిపూర్ణంగా ఎలా జీవించాలి? సరైన మార్గంలో నడవడానికి మార్గాన్ని కూడా చెబుతుంది. అలాగే గరుడ పురాణం మనం చేయకూడని పనులు ఏమిటో చెబుతుంది. గరుడ పురాణం ప్రకారం మహిళలు తమ జీవితంలో పొరపాటున కూడా చేయకూడని పనుల గురించి పేర్కొంది. ఈ రోజు అవి ఏమిటి.. ఒకవేళ స్త్రీ ఈ పనులను చేయడం వలన తన జీవితాన్ని మాత్రమే కాదు భర్త, కుటుంబ సభ్యుల కు ఎలా సమస్యలను తీసుకు తెస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.. అంతేకాదు సమస్యలను తెచ్చే చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం…

భర్తకు దూరంగా ఉండటం గరుడ పురాణం ప్రకారం స్త్రీ భర్తకు దూరంగా ఉండకూడదు. అలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. ఎక్కువ సమయం భార్య.. తన భర్తకు దూరంగా ఉంటే ఇద్దరూ విడిపోయే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. అందువల్ల స్త్రీ తన భర్తకు ఎక్కువ కాలం దూరంగా ఉండకూడదు.

కుటుంబ సభ్యులను అవమానించవద్దు ఒక స్త్రీ తన తల్లిదండ్రులను లేదా అత్తమామల సహా తన అత్తవారి ఇంట్లో ఎవరిని అవమానించే విధంగా మాట్లాడకూడదు. ఇంటి ఇల్లాలుగా అందరితో మంచిగా ఉండాలి. సౌమ్యంగా మాట్లాడాలి. తన అత్తవారింటి సభ్యలను మాత్రమే కాదు ప్రతి ఒక్కరినీ గౌరవించాలి. ఎందుకంటే భార్య చేసే పనులతోనే భర్తకు సమాజంలో గౌరవం ఏర్పడుతుంది. కనుక భార్య అత్తవారింటి సభ్యులతో దురుసుగా మాట్లాడితే.. ఆ ప్రభావం భర్త పై పడుతుంది. ఆమె భర్త ఇమేజ్ చెడిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇతరుల ఇంట్లో ఎక్కువ కాలం ఉండకూడదు. గరుడ పురాణం ప్రకారం పెళ్ళైన స్త్రీకి అత్తారిల్లే సొంత ఇల్లు.. కనుక పెళ్లిన తర్వాత స్త్రీ ఇతరుల ఇంట్లో.. చివరికి తన పుట్టిల్లు అయినా సరే ఎక్కువ కాలం ఉండకూడదు. ఎందుకంటే ఇతరుల ఇళ్లకు వెళ్లి నివసించే స్త్రీలు తమ సొంత ఇంట్లో గౌరవాన్ని కోల్పోతారు. అలాగే ఆ స్త్రీకి భర్త, అత్తమామలతో సంబంధం క్షీణిస్తుంది. కనుక వివాహం తర్వాత మహిళలు తన అత్తమామల ఇంట్లోనే ఉండాలి. పుట్టింటికి ఆమె అతిధిగా మాత్రమే వెళ్ళాలి.

నిర్జన ప్రదేశాలకు వెళ్లవద్దు స్త్రీలు తమకు తెలియని ప్రదేశాలకు, ఎవరూ లేని నిర్జన ప్రదేశాలకు వెళ్లవద్దు. అలాగే.. స్త్రీలు తమకు తెలియని పురుషుడితోనూ నిర్జన ప్రదేశాలకు వెళ్లకూడదు. అంతేకాదు గర్భవతి అయిన స్త్రీ ఒంటరిగా ఎక్కడికి ప్రయాణం చేయకూడదు. తెలియని ప్రదేశాలకు వెళ్ళడం వలన ఒకొక్కసారి ఆమెకు, కడుపులోని బిడ్డకు హాని కలిగే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే