AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garuda Puran: గరుడ పురాణం ప్రకారం రోజుని ఈ నాలుగు పనులతో ప్రారంభిస్తే.. అనేక ప్రయోజనాలు మీ సొంతం

హిందూ పురాణాలు మనిషి జీవితాన్ని జీవించే విధానం తెలియజేస్తాయి. ఈ పురాణాల్లో ఒకటి గరుడ పురాణం. శ్రీ మహావిష్ణువు అధినేత అయిన ఈ పురాణంలో మనిషి బతికి ఉందా చేసే పనులు మాత్రమే కాదు.. ఆ పనుల వలన మరణించిన తర్వాత జీవి చేసే యాత్రను కూడా తెలియజేస్తుంది. అంతేకాదు గరుడ పురాణంలో నియమాలు.. విజయానికి సంబంధించిన అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. గరుడ పురాణం ప్రకారం రోజును కొన్ని నియమాల ప్రకారం ప్రారంభిస్తే .. అన్ని పనులలో మీరు విజయం సాధిస్తారు.

Garuda Puran: గరుడ పురాణం ప్రకారం రోజుని ఈ నాలుగు పనులతో ప్రారంభిస్తే.. అనేక ప్రయోజనాలు మీ సొంతం
Garuda Purana
Surya Kala
|

Updated on: May 07, 2025 | 7:57 PM

Share

గరుడ పురాణానికి హిందూ మతంలో ముఖ్యమైన స్థానం ఉంది. ఇది 18 మహాపురాణాలలో ఒక ముఖ్యమైన పురాణంగా పరిగణించబడుతుంది. గరుడ పురాణంలో విజయవంతమైన జీవిత సారాంశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ గరుడ పురాణాన్ని పారాయణం చేయాలి. దానిలో చెప్పిన విషయాలను తమ జీవితంలో స్వీకరించాలి. అయితే గరుడ పురాణం గురించి సాధారణ ప్రజలలో ఒక నమ్మకం ఉంది. దీనిని ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు మాత్రమే ఇంట్లో చదవాలని. గరుడ పురాణం ప్రధానంగా మూడు భాగాలుగా విభజించబడింది (ఆచారఖండం, ధర్మకాండము, బ్రహ్మకాండము). మీరు గరుడ పురాణంలోని మొదటి భాగాన్ని అంటే ఆచారఖండం లేదా పూర్వఖండం ఎప్పుడైనా పఠించవచ్చు.

గరుడ పురాణం మొదటి భాగంలో విశ్వం మూలం, ధ్రువుని పాత్ర, పన్నెండు ఆదిత్యుల కథ, గ్రహాల మంత్రాలు, పూజా విధానం, భక్తి, జ్ఞానం, వైరాగ్యం, మంచి ప్రవర్తన, త్యాగం, దానం, తపస్సు, జపం, తీర్థయాత్ర, మంచి పనులు వంటి అనేక లౌకిక, అతీంద్రియ విషయాలున్నాయి. దీనితో పాటు, వ్యాకరణం, పద్యం, అచ్చులు, జ్యోతిషశాస్త్రం, ఆయుర్వేదం, రత్నసారం, నీతిసారం మొదలైన అంశాలు కూడా ఈ విభాగంలో చేర్చబడ్డాయి. కనుక ప్రతి వ్యక్తి గరుడ పురాణంలో మొదటి భాగాన్ని చదవాలి. దీనిలో పేర్కొన్న విషయాలను తమ జీవితంలోకి అన్వయించుకోవాలి. దీనితో వ్యక్తి చెడు పనులకు దూరంగా ఉండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతాడు. తరువాత మోక్షాన్ని పొందుతాడు.

గరుడ పురాణంలో శ్రీ మహా విష్ణువు స్వయంగా మనుషులు చేసే చేయాల్సిన పనుల గురించి చెప్పాడు. ఈ పనులతో మీరు మీ రోజును ప్రారంభిస్తే.. మీకు ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తాయి. ఈ రోజు ఆ పనులు ఏమిటో తెల్సుకుందాం..

ఇవి కూడా చదవండి

ఈ 4 విషయాలతో మీ రోజును ప్రారంభించండి

గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత ముందుగా దేవుడిని పూజించాలి. రోజును పూజతో ప్రారంభించడం ద్వారా దేవతలు మాత్రమే కాదు పూర్వీకుల ఆశీర్వాదం కూడా పొందుతారు. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

ఉదయం ఆహారం తీసుకునే ముందు.. ఆ ఆహారాన్ని దేవునికి సమర్పించండి. దీని తర్వాతే ఆహారం, నీరు తీసుకోండి. ఇలా చేయడం వలన అన్నపూర్ణ దేవి ఆశీస్సులు లభిస్తాయి. ఇంట్లో ఆనందం, ఆర్ధిక శ్రేయస్సుకు లోటు ఉండదు.

గరుడ పురాణంలో విష్ణువు ప్రతి వ్యక్తి రోజుకు ఒక్కసారైనా తన గురించి తాను ఆత్మపరిశీలన చేసుకోవాలని చెప్పాడు. ఇలా చేయడం వలన మీకు తప్పు ఒప్పుల మధ్య తేడాను గుర్తించడంలో.. కొత్త ఆలోచనలను చేయడంలో సహాయపడుతుంది.

ప్రతిరోజూ ఎవరో ఒకరికి సహాయం చేయాలి. మీ సామర్థ్యం ప్రకారం ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం పెట్టవచ్చు, ఆవుకు ఆహారం అందించవచ్చు. పక్షులకు ధాన్యాన్ని తినిపించవచ్చు. లేదా కుక్కకు రొట్టె తినిపించవచ్చు. ఎవరైతే ప్రతిరోజూ ఈ పనులను క్రమం తప్పకుండా చేస్తారో.. వారికి పుణ్యం లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
టేస్టీ.. టేస్టీ ఫుడ్‌తో పాటు అవి కూడా.. కావాలంటే కేరాఫ్ ఒలివియా!
టేస్టీ.. టేస్టీ ఫుడ్‌తో పాటు అవి కూడా.. కావాలంటే కేరాఫ్ ఒలివియా!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు.. ఆయనే నా దేవుడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నారు.. ఆయనే నా దేవుడు..
ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉందా?మీ వ్యక్తిత్వం ఇదే
ప్యాంట్ జేబుల్లో చేతులు పెట్టుకునే అలవాటు ఉందా?మీ వ్యక్తిత్వం ఇదే
భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న..
భర్త చనిపోయాక మంగళసూత్రం ఏం చేయాలి..? 99శాతం మంది చేస్తున్న..
కూతురి పరీక్షలు.. గుడికి వెళ్తూ ఒకరు.. వచ్చే నెలలో పెళ్లి అనగా..
కూతురి పరీక్షలు.. గుడికి వెళ్తూ ఒకరు.. వచ్చే నెలలో పెళ్లి అనగా..
తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. త్వరలోనే శంకుస్థాపన
తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లు.. త్వరలోనే శంకుస్థాపన
వేడి అన్నంలోకి అదిరిపోయే ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నె ఖాళీ
వేడి అన్నంలోకి అదిరిపోయే ధనియాల రసం.. ఇలా చేస్తే గిన్నె ఖాళీ
నువ్వెప్పుడు సినిమాలు చేశావన్నా?ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?
నువ్వెప్పుడు సినిమాలు చేశావన్నా?ఈ ఫొటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా?
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దంచికొట్టనున్న వర్షాలు..
తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. దంచికొట్టనున్న వర్షాలు..
తగ్గిన టమాట ధరలు.. సామాన్యులకు శుభవార్త
తగ్గిన టమాట ధరలు.. సామాన్యులకు శుభవార్త