AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaishakh Purnima 2025: ఇంట్లో పేదరికమా.. వైశాఖ పౌర్ణమి రోజున దీపంతో ఈ పరిహారం చేసి చూడండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..

హిందూ మతంలో ప్రతి తిధికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఏడాది వైశాఖ పౌర్ణమి తిధి 2025 మే 12న వచ్చింది. ఈ శుభ సమయంలో మీరు దీపానికి సంబంధించిన ఒక సాధారణ పరిహారం చేస్తే.. మీరు కోరుకున్న ఫలితాన్ని పొందవచ్చు. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో నాలుగు చోట్ల దీపాలు వెలిగించాలి. ఆ నాలుగు ప్రదేశాలు ఏమిటో ఈ రోజున తెలుసుకుందాం..

Vaishakh Purnima 2025: ఇంట్లో పేదరికమా.. వైశాఖ పౌర్ణమి రోజున దీపంతో ఈ పరిహారం చేసి చూడండి.. లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
Vaishakh Purnima 2025
Surya Kala
|

Updated on: May 07, 2025 | 3:53 PM

Share

పౌర్ణమి తిథి హిందూ మతంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ రోజున చంద్రుడు పూర్ణ బింబంగా దర్శనం ఇస్తాడు. పౌర్ణమి రోజున చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని మత విశ్వాసం. పౌర్ణమి తిథి విష్ణువు, లక్ష్మీదేవి పూజకు కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల సంపద పెరుగుతుంది. పాపాల నుండి విముక్తి లభిస్తుంది.

వైశాఖ మాసంలోని పౌర్ణమి రోజుని బుద్ధ పూర్ణిమగా కూడా జరుపుకుంటారు. ఈ సంవత్సరం వైశాఖ పూర్ణిమ 2025 మే 12న వచ్చింది. ఈ శుభ తిది రోజున శుభ సమయంలో దీపానికి సంబంధించిన ఒక సాధారణ పరిహారం చేస్తే కోరుకున్న ఫలితం పొందుతారు. వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో నాలుగు చోట్ల దీపాలు వెలిగించాలి. దీని ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయని..అప్పుల నుంచి విముక్తి పొందవచ్చని నమ్ముతారు.

వైశాఖ పౌర్ణమి 2025 ఎప్పుడంటే

పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం వైశాఖ పౌర్ణమి తిథి మే 11 సాయంత్రం 6:55 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ పౌర్ణమి తిధి మే 12న రాత్రి 7:22 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమిను మే 12న జరుపుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

వైశాఖ పౌర్ణమి రోజున ఎక్కడ దీపం వెలిగించాలంటే

ఇంటి ప్రధాన ద్వారం వద్ద: వైశాఖ పౌర్ణమి రోజున విష్ణువును పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. వైశాఖ పౌర్ణమిన ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు.

తులసి పూజ: వైశాఖ పౌర్ణమి శుభ సందర్భంగా.. తులసి మొక్కను పూజించండి. తరువాత తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని.. ఆ వ్యక్తి అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతాడని నమ్మకం.

ఇంటి పూజ గదిలో: వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైశాఖ పౌర్ణమి రోజున ఇంటి పూజ గదిలో లేదా పూజ చేసే ప్రార్ధనా స్థలంలో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన జీవితంలో ఆనందం, శ్రేయస్సును తెస్తుందని.. ఆర్థిక లాభం తెస్తుందని నమ్మకం.

వంటగదిలో: హిందూ మత విశ్వాసం ప్రకారం వంటగది ఇంట్లో అతి ముఖ్యమైన భాగం. వంట ఇల్లు ఇంట్లో నివసించే వ్యక్తుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అటువంటి పరిస్థితిలో వైశాఖ పౌర్ణమి రోజున మీరు వంటగదిలో దీపం వెలిగించాలి. ఇలా చేయడం వలన అన్నపూర్ణ దేవి ప్రసన్నం అవుతుందని.. ఇంట్లో ఎప్పుడూ ఆహార కొరత ఉండదని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us
మనిషికి నడకలేకపోతే వచ్చే భయంకర రోగాలు ఇవే..
మనిషికి నడకలేకపోతే వచ్చే భయంకర రోగాలు ఇవే..
ACని ఎంత టెంపరేచర్‌లో ఉంచాలి? చాలా మంది చేసే పొరబాటు ఇదే
ACని ఎంత టెంపరేచర్‌లో ఉంచాలి? చాలా మంది చేసే పొరబాటు ఇదే
శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..
శోభన్‌బాబు చనిపోయే ముందు ఆ హీరోయిన్‌కు చివరి ఫోన్ కాల్..
మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే
మహిళల ఆరోగ్యం కోసం.. ఏటా చేయించుకోవాల్సిన 5 కీలక రక్త పరీక్షలివే
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి
వర్ష బీభత్సం.. హైదరాబాద్‌లో ఇద్దరు యువకులు మృతి
ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో తెగ ట్రెండ్ అవుతోన్న సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే
మీకు ఈ 5 సంకేతాలు కనిపిస్తున్నాయా? మీ కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లే
'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'
'లోకేష్ మామా.. నాకు హాస్టల్ సీటు ఇప్పించవా.. ప్లీజ్‌'
శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం
శ్రీశైలం మల్లన్నకు విరాళంగా 540 గ్రాముల వెండి నాగాభరణం
మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి
మీరు కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదా ఇలా సింపుల్‌గా తెలుసుకోండి