Ganesh Chaturthi: మత సామరస్యానికి వేదికగా వినాయక చవితి.. ఘనంగా గణపతి నవరాత్రి వేడుకలను చేస్తున్న ముస్లిం ఫ్యామిలీ..
ఉమ్మడి ఖమ్మం జిల్లా వినాయక చవితి మత సామరస్యానికి వేదికగా మారింది. వినాయక చవితి ఉత్సవాలు సందర్భంగా ఖమ్మం నగరంలో మత సామరస్యం వెళ్లి విరిసింది. ముస్లిం కుటుంబం వినాయక చవితి పూజల్లో పాల్గొని తాము దైవాన్ని నమ్ముతామని.. కులమతాలకు తాము అతీతమని నిరూపించారు.

పండగలు పర్వదినాలు, శుభకార్యాలు జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశ్యం కుటుంబం సభ్యుల మధ్య బాంధవ్యాలు గట్టిగా ఉండలని .. తమ రక్త సంబంధంలోని అనుబంధాన్ని తరతరాలుగా కొనగిస్తూ ఒక్కటిగా సాగాలనే… అదే విధంగా వినాయక చవితి వీధుల్లో ఏర్పాటు చేసే మండపాలకు ముఖ్య ఉద్దేశ్యం కూడా ప్రజల మధ్య ఐక్యత కోసమే.. తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వినాయక చవితి మత సామరస్యానికి వేదికగా మారింది. వినాయక చవితి ఉత్సవాలు సందర్భంగా ఖమ్మం నగరంలో మత సామరస్యం వెళ్లి విరిసింది. ముస్లిం కుటుంబం వినాయక చవితి పూజల్లో పాల్గొని తాము దైవాన్ని నమ్ముతామని.. కులమతాలకు తాము అతీతమని నిరూపించారు. వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం నగరంలో కే.సి.ఆర్ టవర్స్ లో నివాసం ఉంటున్న మహ్మద్ కుటుంబం కులమతాలకు అతీతంగా గత రెండు సంవత్సరాల నుండి వినాయక చవితి ఉత్సవాలు జరుపుతున్నారు. సొంత ఖర్చులు తో వినాయక విగ్రహం ఏర్పాటు చేసి.. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. నిమజ్జనం పూర్తి అయ్యేవరకు నిష్టగా పూజలు చేస్తున్నారు. మహ్మద్ తో పాటు అతని భార్య, పిల్లలు కుటుంబ సమేతంగా వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని పూజలు నివసిస్తున్నారు. ఈ పూజ కోసం ఒక్క రూపాయి ఇతరుల దగ్గర తీసుకోకుండా.. సొంత ఖర్చులతోనే ఈ ఉత్సవాలు జరుపుతున్నారు..
మాకు కుల మతాల బేధం లేదని అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటామని ..అందరూ ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటామని మహమ్మద్ అంటున్నాడు. వినాయక చవితి వేడుకలే కాదు దసరా నవ రాత్రులు జరిపిస్తారు.
మహమ్మద్ తో పాటు కుటుంబ సభ్యులు కూడా వినాయకుడికి పూజలు చేస్తారు. భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో వినాయక చవితి, దసరా వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించడం పట్ల స్థానికులు మహ్మద్ కుటుంబాన్ని ప్రశంసిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




