Vastu Tips For Money: ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదా..? ఈ వాస్తు టిప్స్ ఫాలో అయితే..

కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా..ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడు. కృషి, ప్రతిభ ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.

Vastu Tips For Money: ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదా..? ఈ వాస్తు టిప్స్ ఫాలో అయితే..
Vastu Tips For Money
Follow us
Madhavi

| Edited By: Shaik Madar Saheb

Updated on: May 24, 2023 | 9:45 AM

కొంతమంది ఎంత కష్టపడి పనిచేసినా..ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించలేడు. కృషి, ప్రతిభ ఉన్నప్పటికీ, ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే తక్కువ శ్రమతో ఎక్కువ విజయాలు పొందే వ్యక్తులు కొందరు ఉన్నారు. వాస్తవానికి, ఇది వాస్తు ప్రకారం నిర్మించిన గృహాల ఫలితంగా ఇంట్లో ఉండే సానుకూల శక్తి ఫలితం. అటువంటి పరిస్థితిలో, ఆర్థిక శ్రేయస్సు సాధించడానికి కొన్ని ముఖ్యమైన వాస్తు చిట్కాలు ఉన్నాయి, వాటిని అనుసరించడం ద్వారా మీరు కూడా ఆర్థిక నష్టాల నుంచి గట్టెక్కవచ్చు. ఆ పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం.

సంపద కోసం ఎఫెక్టివ్ వాస్తు చిట్కాలు:

-ఇంటి ప్రధాన ద్వారం వాస్తు శాస్త్రంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది. ఏదైనా భవనంలోకి కాస్మిక్ ఎనర్జీ ప్రవేశానికి ఇది ప్రధాన మాధ్యమం. అందువల్ల, దాని సానుకూల, ప్రతికూల ప్రభావాలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

-డబ్బు విషయంలో ఈశాన్య దిక్కు చాలా ముఖ్యమైనది. అందుకే ఈశాన్య దిక్కును ఖాళీగా, శుభ్రంగా ఉంచుకోవాలి.

-లాకర్ ఉత్తరం వైపు తెరుచుకునేలా దక్షిణం లేదా నైరుతి గోడ వైపు ఉంచాలి.

-ఇంట్లో ఏ దిక్కు పై భారం ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల భవనంలో వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఈ రకమైన వాస్తు దోషం వల్ల ఆర్థిక నష్టం, ధన ప్రవాహంలో అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు, న్యాయపరమైన వివాదాలకు దారి తీస్తాయి.

– ఇంటి వాలును నైరుతి నుండి ఈశాన్యం వరకు ఉంచండి. నైరుతి కోణాన్ని అత్యధికంగా ఉంచాలి. ఆ తర్వాత భవనం ఎత్తు వరుసగా ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్య దిశగా తగ్గుతున్న క్రమంలో ఉండాలి.

-ఈశాన్యంలో నీరు ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది, కాబట్టి ఈ దిశలో నీటి ఫౌంటెన్‌ను ఏర్పాటు చేయవచ్చు. ఫౌంటెన్‌లోని నీరు నిరంతరంగా ఉండాలని గుర్తుంచుకోండి.

-గదులు, గోడల రంగును ఉత్తర నీలం రంగులో ఉంచండి. ఎరుపు రంగు వస్తువులను ఈ దిశలో ఉంచకూడదు. అలా చేస్తే ఆర్థిక నష్టాలు పెరుగుతాయి.

-ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేలా ప్రయత్నించండి. గొడవలు, అరుపులు ఉండకూడదు. ఇలా చేస్తే వాస్తు ప్రకారం ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..