Shravana Masam: రుద్రాక్షను ధరించాలనుకుంటున్నారా శ్రావణ మాసం శుభప్రదం.. నియమాలు ఏమిటంటే?

సోమవారం, పౌర్ణమి, లేదా అమావాస్య రోజున రుద్రాక్షను ధరించడం మంచిదే అయినప్పటికీ., శ్రావణ మాసంలో రుద్రాక్ష ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగష్టు 5వ తేదీ 2024, సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. రుద్రాక్ష ధరించడానికి శ్రావణ మాసం ఉత్తమంగా పరిగణించబడుతుంది. అందువల్ల మీరు రుద్రాక్షను ధరించాలని ఆలోచిస్తున్నట్లయితే పూర్తి ప్రయోజనాల కోసం శ్రావణ మాసంలో మాత్రమే రుద్రాక్షను ధరించండి.

Shravana Masam: రుద్రాక్షను ధరించాలనుకుంటున్నారా శ్రావణ మాసం శుభప్రదం.. నియమాలు ఏమిటంటే?
Rudraksha
Follow us
Surya Kala

|

Updated on: Jul 18, 2024 | 6:51 AM

రుద్రాక్ష శివునికి చాలా ప్రీతికరమైనది. రుద్రాక్ష శివుని ప్రధాన ఆభరణం. రుద్రాక్ష ధరించడం ద్వారా భక్తులు శివుని అనుగ్రహం పొందుతారని నమ్మకం. రుద్రాక్షకు మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. అంతేకాదు దీనిని ధరించడం వల్ల మానసిక, శారీరక, ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. రుద్రాక్ష చాలా పవిత్రమైనది. శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. కనుక దీనిని నిర్మలమైన హృదయంతో ధరించాలి. అయితే రుద్రాక్షను ధరించడానికి కొన్ని నియమాలను పాటించాలి. ఇలా చేయడం ద్వారా రుద్రాక్షను ధరించే వ్యక్తి జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు, ఆధ్యాత్మిక పురోగతిని పొందుతాడు. సోమవారం, పౌర్ణమి, లేదా అమావాస్య రోజున రుద్రాక్షను ధరించడం మంచిదే అయినప్పటికీ., శ్రావణ మాసంలో రుద్రాక్ష ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.

శ్రావణ మాసంలో రుద్రాక్షను ధరించండి

ఈ సంవత్సరం శ్రావణ మాసం ఆగష్టు 5వ తేదీ 2024, సోమవారం నుంచి ప్రారంభమవుతుంది. రుద్రాక్ష ధరించడానికి శ్రావణ మాసం ఉత్తమంగా పరిగణించబడుతుంది. అందువల్ల మీరు రుద్రాక్షను ధరించాలని ఆలోచిస్తున్నట్లయితే పూర్తి ప్రయోజనాల కోసం శ్రావణ మాసంలో మాత్రమే రుద్రాక్షను ధరించండి.

రుద్రాక్ష ధరించే విధానం

శుక్ల పక్షంలో సోమవారం రుద్రాక్షను ధరించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. రుద్రాక్షను ధరించే ముందు, దీనిని శుద్ధి చేసి పవిత్రం చేయడం అవసరం. ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారం ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ధరించే ముందు కొన్ని పద్ధతులు పాటించాలి.

ఇవి కూడా చదవండి

రుద్రాక్షను శుద్ధి చేయడం

రుద్రాక్ష ధరించే ముందు అన్నింటిలో మొదటిది రుద్రాక్షను శుద్ధి చేయడం అవసరం. ఇందుకోసం ఒక గిన్నెలో 1 స్పూన్ పెరుగు, తేనె, గంగాజలం, తులసి దళం, నెయ్యి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పంచామృతాలున్న గిన్నెలో రుద్రాక్షను వేసి 0 నిమిషాలు ఉంచండి. ఇలా చేయడం వల్ల రుద్రాక్ష శుద్ధి అవుతుంది. అనంతరం శివయ్యను ప్రార్థించండి. ప్రార్థన తర్వాత ఈ మిశ్రమం నుంచి రుద్రాక్షను తీసి.. గంగా జలంతో కడిగి శుద్ధి చేయాలి.

రుద్రాక్షను ధరించే ముందు చేయాల్సిన ప్రార్థన

ఇప్పుడు శివుని మంత్రాలతో రుద్రాక్షను పూజించండి. “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా రుద్రాక్షను శుద్ధి చేయాలి.

శుద్ధి చేసిన అనంతరం రుద్రాక్షను ఎలా ధరించాలంటే

మంత్రాలు చదివిన అనంతరం రుద్రాక్ష శుద్ధి అవుతుంది. సక్రియం చేయబడిన పవిత్రం చేయబడిన తర్వాత రుద్రాక్ష ధరించడానికి పూర్తిగా సిద్ధం అవుతుంది. ఇప్పుడు ఈ రుద్రాక్షను పసుపు లేదా ఎరుపు దారంలో గుచ్చి మెడలో లేదా చేతికి ధరించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!