AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astrology: కలలో ఇవి కనిపించాయా.. అయితే త్వరలో మీ పంట పండినట్లే..!

Astrology: ప్రతీ ఒక్కరికి సహజంగానే కలలు వస్తుంటాయి. అయితే, కలలు రావడంపై ప్రజల్లో రకరకాల విశ్వాసాలు ఉన్నాయి.

Astrology: కలలో ఇవి కనిపించాయా.. అయితే త్వరలో మీ పంట పండినట్లే..!
Shiva Prajapati
|

Updated on: Jan 23, 2022 | 9:59 AM

Share

Astrology: ప్రతీ ఒక్కరికి సహజంగానే కలలు వస్తుంటాయి. అయితే, కలలు రావడంపై ప్రజల్లో రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. రాత్రి వచ్చే కలలకు విలువ లేదని, పగటి పూట వచ్చే కలలు నిజం అవుతాయని, కలలో కొన్ని వస్తువులు, ఘటనలు కనిపిస్తే శుభం జరుగుతుందని, మరికొన్ని కనిపిస్తే అశుభం జరుగుతుందని ఇలా రకరకాలుగా చెబుతుంటారు పెద్దలు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందట. ముఖ్యంగా కొన్ని రకాల వస్తువులు, జంతువులు, కొన్ని సంఘటనలు రాత్రి కలలో వస్తే.. భవిష్యత్‌లో వారి జీవితం పూలపాన్పు అవుతుందని చెబుతోంది జ్యోతిష్య శాస్త్రం. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. అగ్ని: మీ కలలో అగ్ని, మంటలు, వంట చేయడం వంటికి కనిపిస్తే శుభం జరుగుతుంది. త్వరలో ఉద్యోగం పొందడం, పురోగతి సాధించడం జరుగుతుంది. 2. డబ్బు: మీకు కలలో డబ్బు కనిపిస్తే రాబోయే రోజుల్లో మీరు భారీగా డబ్బును పొందబోతున్నారు. 3. దానిమ్మపండ్లు: మీరు దానిమ్మపండ్లు తింటునట్లు కల వస్తే.. త్వరలో లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది. ఈ కల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుదలకు చిహ్నం. 4. రంగులు: మీ కలలో పసుపు, ఎరుపు రంగులు కనిపిస్తే మీ ప్రతిష్ట పెరుగనుందని అర్థం. విలువైన సంపదలు పొందుతారు. 6. గుర్రపు స్వారీ: గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు మీకు కల వస్తే.. మీరు త్వరలోనే శుభవార్త వింటారు. ఉద్యోగం, ఉపాధి, ఆర్థిక స్థితి మెరుగుదలకు ఇది చిహ్నం. 7. రైతులు: రైతు, పచ్చని వాతావరణం మీ కలలో వస్తే.. మిమ్మల్ని లక్ష్మీ దేవి వరించనుందని అర్థం. 8. తేనే, పాలు, పెరుగు: మీ కలలో పాలు, తేనె, పెరుగు కనిపిస్తే శుభ సూచికగా పేర్కొంటారు. భవిష్యత్‌లో ఆర్థికంగా స్థిరపడతారు.

గమనిక: పై కథనానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాల ఆధారంగా పాఠకుల ఆసక్తిని దృష్టిని ఉంచుకోని పబ్లిష్ చేయడం జరిగింది.

Also read:

Harish Shankar : ‘అబ్బా చింపేశావ్ అన్నయ్యా.. నిజానికి  పిండేశావ్’.. హరీష్ శంకర్ ఆసక్తికర ట్వీట్

Priyamani: సెకండ్ ఇన్నింగ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ‘ప్రియమణి’ ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Telangana: అక్కడ జీలుగు కల్లుకు యమ డిమాండ్.. ఏకంగా సీసా రూ.500.. ముందు బుక్ చేసుకుంటేనే