AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: విజయానికి సంబంధించిన ఈ 5 సూత్రాలను అర్థం చేసుకుంటే అసాధ్యం కూడా సుసాధ్యమే..

Chanakya Niti: జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే చాణక్య నీతి చదవాల్సిందే అని కొందరు చెబుతుంటారు. ఎందుకంటే..

Chanakya Niti: విజయానికి సంబంధించిన ఈ 5 సూత్రాలను అర్థం చేసుకుంటే అసాధ్యం కూడా సుసాధ్యమే..
Shiva Prajapati
|

Updated on: Jan 23, 2022 | 3:48 PM

Share

Chanakya Niti: జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే చాణక్య నీతి చదవాల్సిందే అని కొందరు చెబుతుంటారు. ఎందుకంటే.. ఆచార్య చాణక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో అంశాలను తన పుస్తకంలో పొందుపరిచారు. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై మార్గనిర్దేశనం చేశారు. ఆయన చెప్పిన విధానాలు.. అప్పట్లోనే కాదు ఎప్పటికీ ఆచరణీయంగా ఉంటాయనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే 5 విషయాలను పక్కాగా అర్థం చేసుకోవాలని ఆచార్య చాణక్య చెప్పారు. మరి ఆ 5 విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకునే ముందు మిమ్మల్ని మీరు మూడు ప్రశ్నలు అడగండి. మొదటిది నేను ఈ పని ఎందుకు చేస్తున్నాను? రెండోది దీని ఫలితం ఎలా ఉంటుంది? మూడోది ఇందులో విజయం సాధిస్తానా? ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు ఉండి, మీపై మీకు విశ్వాసం ఉంటే ఆ లక్ష్యం వైపు మాత్రమే అడుగు వేయండి. 2. విజయానికి మరో సూత్రం ఏమిటంటే, మీకు కావలసిన దాని కోసం నిజాయితీగా, హృదయపూర్వకంగా సిద్ధం కావడం. మీరు చేయదలచిన పనిని గురించి ఎవరి వద్ద చర్చించవద్దు. రహస్యంగా మీ పనిని మీరు పూర్తి చేయండి. విజయం సాధించిన తర్వాత మాత్రమే ఇతరులతో చర్చించండి. 3. జీవితంలో విజయం సాధించాలనుకుంటే ఎప్పుడూ అదృష్టంపై ఆధారపడొద్దు. మీ విధిని మీరే రాసుకోగల సామర్థ్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు. కాబట్టి మీ సామర్థ్యాన్ని గుర్తించి, పూర్తి అంకితభావంతో కష్టపడి పని చేయండి. అప్పుడే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. 4. విజయపథంలో చాలాసార్లు అపజయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అటువంటి పరిస్థితిలో వైఫల్యాన్ని ఒక పాఠంగా భావించి ముందుకు సాగండి. మీ సానుకూల దృక్పథం, కృషి కలయిక మిమ్మల్ని మీ లక్ష్యాన్ని చేరుస్తుంది. 5. మీరు విజయం సాధించాలనుకునే రంగంలోని వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పరచుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు కూడా గుర్తింపు పొందుతారు. భవిష్యత్తులో దాని ప్రయోజనం కూడా మీకు అందుతుంది.

Also read:

Salary Overdraft: శాలరీ ఓవ‌ర్‌డ్రాఫ్ట్‌ అంటే ఏమిటో తెలుసా.. ఇది ఎప్పుడు తీసుకోవాలంటే..

TTE Rules: రాత్రి రైలు ప్రయాణంలో టీటీఈ డిస్టర్బ్ చేయొద్దంటే ఇలా చేయండి..

Boat 181 TWS: బోట్ నుంచి అదిరిపోయే వైర్‌లెస్ ఇయ‌ర్ బ‌డ్స్‌.. త‌క్కువ ధ‌ర‌లో ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు..