AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TTE Rules: రాత్రి రైలు ప్రయాణంలో టీటీఈ డిస్టర్బ్ చేయొద్దంటే ఇలా చేయండి..

రాత్రి సమయంలో రైలు ప్రయాణం అంటేనే మంచి నిద్రపోవాలని కోరుకుంటాం. అయితే మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు టీటీఈ వచ్చి..

TTE Rules: రాత్రి రైలు ప్రయాణంలో టీటీఈ డిస్టర్బ్ చేయొద్దంటే ఇలా చేయండి..
Tte Rules
Sanjay Kasula
|

Updated on: Jan 23, 2022 | 3:39 PM

Share

Night Train rules: రాత్రి సమయంలో రైలు ప్రయాణం అంటేనే మంచి నిద్రపోవాలని కోరుకుంటాం. అయితే మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు టీటీఈ వచ్చి నిద్ర లేపుతున్నట్లైతే ఇబ్బందిగా మారుతుంది. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి.. అసలు టీటీఈకి రాత్రి 10 తర్వాత ఆ హక్కు ఉంటుందా.. అనే చాలా అంశాలు మనం తెలుసుకుని ఉండాలి. TTE కూడా ఎటువంటి కారణం లేకుండా ప్రయాణికులను పదే పదే విచారించలేరు. టీటీఈకి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. చాలా సార్లు ప్రయాణీకులు రైలులో ప్రయాణించేటప్పుడు.. TTE టిక్కెట్లను పదే పదే తనిఖీ చేయడం వల్ల నిద్రకు ఇబ్బందిగా మారుతుంటుంది. కాబట్టి TTE టిక్కెట్లను ఎలా తనిఖీ చేయాలి? ఎలాంటి సమయంలో చెక్ చేయాలి. అసలు మనను టీటీఈ చెక్ చేయవద్దు అంటే మనం ఏం చేయాలో కూడా ఇక్కడ తెలుసుకుందాం.

10 గంటల తర్వాత..

టికెట్ చెక్ చేయాలంటే రాత్రి 10 గంటల లోపు ఈ పని చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు, మీ రైలు రాత్రి 8 గంటలకు ఉందనుకోండి.. అప్పుడు TTE రాత్రి 10 గంటలలోపు మీ టిక్కెట్‌ని చెక్ చేస్తారు. కానీ, కొన్ని ప్రత్యేక సమయాల్లో మాత్రమే ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవచ్చు.

10 గంటల తర్వాత రైలు ఉంటే?

మీరు 10 గంటల తర్వాత రైలు ప్రయాణాన్ని మొదలు పెట్టినట్లైతే.. ఈ నియమం వర్తించదు. అంటే రాత్రి 10 గంటల తర్వాత టీటీఈ రైలులో కూర్చున్న ప్రయాణికుల టిక్కెట్లను రాత్రి 10 గంటల తర్వాత మాత్రమే చూడగలరు. రాత్రి వేళల్లో రైలు పట్టుకునే ప్రయాణికులు రాత్రిపూట కూడా టీటీఈకి టికెట్‌, ఐడీ చూపించాల్సి ఉంటుంది.

రాత్రి 10 గంటల తర్వాత మిడిల్ బెర్త్ కోసం నియమాలు

రైల్వే నిబంధనల ప్రకారం మిడిల్ బెర్త్ ఉన్న ప్రయాణికుడు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే తన బెర్త్‌లో పడుకోవచ్చు. ఒక ప్రయాణీకుడు మిడిల్ బెర్త్ తెరవడాన్ని రాత్రి 10 గంటలలోపు ఆపాలనుకుంటే.. అతన్ని ఆపవచ్చు. అదే సమయంలో ఉదయం 6 గంటల తర్వాత ఇతర ప్రయాణికులు దిగువ బెర్త్‌పై కూర్చోవడానికి బెర్త్‌ను తగ్గించాల్సి ఉంటుంది.

11 గంటల తర్వాత ఛార్జ్ చేయడం సాధ్యపడదు

చాలా జోన్లలో రైళ్లలో రాత్రి 11 గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. అదేమిటంటే.. రాత్రి ప్రయాణం అయితే 11 గంటల లోపు మొబైల్ లేదా ల్యాప్‌టాప్ చార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా రైళ్లలో నైట్ ఛార్జింగ్ సౌకర్యం లేదు.

ఇవి కూడా చదవండి: Jackfruit Biryani: ఈ బిర్యానీ చాలా స్పెషల్ గురూ.. పనస బిర్యానీ టేస్ట్‌కు ఫిదా అవ్వాల్సిందే.. ఎలా తయారు చేయాలంటే..?

Health care tips: స్వీట్స్ తినాలంటే భయపడుతున్నారా.. వీటిని ట్రై చేయండి.. అవేంటంటే..